సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ
మోడీ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చాక ఒక సంవత్సరం పూర్తయిన సందర్భంగా 2019 మే 30వ తేదీ నుండి 2020 మే 30వ తేదీ వరకు డి.ఏ.ఆర్.పి.జి. విజయాలపై ఈ-బుక్‌లెట్ ను ప్రారంభించిన - డాక్టర్ జితేంద్ర సింగ్.
ప్రధానమంత్రి మోడీ యొక్క సుపరిపాలన దృష్టికి అనుగుణంగా డి.ఏ.ఆర్.పి.జి. పనిచేస్తోంది. సంస్కరణ, పనితీరు మరియు పరివర్తన అనే మంత్రాన్ని అవలంబించింది: డాక్టర్ జితేంద్ర సింగ్
Posted On:
30 MAY 2020 7:27PM by PIB Hyderabad
మోడీ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చాక ఒక సంవత్సరం పూర్తయిన సందర్భంగా 2019 మే 30వ తేదీ నుండి 2020 మే 30వ తేదీ వరకు డి.ఏ.ఆర్.పి.జి. విజయాలపై రూపొందించిన ఈ-బుక్‌లెట్ ను కేంద్ర సిబ్బంది, ప్రజా పిర్యాదులు, పింఛన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ విడుదల చేశారు. ప్రజలకు తమ శాఖ విజయాలు తెలియజేస్తూ, వీడియో-కాన్ఫరెన్సింగ్ ద్వారా సీనియర్ అధికారులతో సంభాషించిన మొదటి వ్యక్తిగా డాక్టర్ సింగ్ ఈ విభాగాన్ని అభినందించారు.
ఈ సందర్భంగా డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ, ప్రధానమంత్రి మోడీ యొక్క సుపరిపాలన దృష్టికి అనుగుణంగా డి.ఏ.ఆర్.పి.జి. పనిచేస్తోందనీ, సంస్కరణ, పనితీరు మరియు పరివర్తన అనే మంత్రాన్నిఖచ్చితంగా అవలంభిస్తోందనీ పేర్కొన్నారు.
ఏ) కేంద్ర సచివాలయం మరియు రాష్ట్ర సచివాలయాల్లో ఈ-ఆఫీస్ అమలుకు తీవ్రమైన కృషి చేయడం మరియు
బి) 2019 మరియు 2020 సంవత్సరాల్లో వరుసగా షిల్లాంగ్ మరియు ముంబైలలో 22 మరియు 23 వ జాతీయ ఇ-గవర్నెన్స్ సమావేశాన్ని నిర్వహించడం వంటి చర్యల ద్వారా -
భారతదేశంలో ఇ-గవర్నెన్స్‌కు డి.ఏ.ఆర్.పి.జి. అపారమైన ప్రేరణనిచ్చిందనే వాస్తవాన్ని ఆయన ఎత్తిచూపారు.
అనేక మంత్రిత్వ శాఖలు మరియు విభాగాలలో సి.పి.జి.ఆర్.ఏ.ఎమ్.ఎస్ సంస్కరణలను అనుసరించడం ద్వారా ప్రజా ఫిర్యాదులను పరిష్కరించడంలో డి.ఏ.ఆర్.పి.జి. గణనీయమైన సంస్కరణలను చేపట్టిందని డాక్టర్ జితేంద్ర సింగ్ ఈ సందర్భంగా గుర్తు చేశారు.
డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ, డి.ఏ.ఆర్.పి.జి. చేపట్టిన సంస్కరణల విజయం కోవిడ్-19 మహమ్మారి కాలంలో సాక్ష్యమిచ్చిందని చెప్పారు. ఈ-ఆఫీస్ ఉపయోగించి ఇంటి నుండి పనిచేయడం ద్వారానూ, మరియు కోవిడ్-19 కు సంబంధించి ప్రజల నుండి వచ్చిన 0.87 లక్షల ఫిర్యాదులను సకాలంలో పరిష్కరించడం ద్వారానూ పనిలో అంతరాయం లేకుండా అనేక మంత్రిత్వ శాఖలు / విభాగాలు పనిచేశాయి. ఒక్కొక్క ఫిర్యాదుకు 1.45 రోజుల సగటు రికార్డు సమయం పట్టింది.
జమ్మూ & కశ్మీర్ లో సుపరిపాలన కోసం ప్రభుత్వ ఎజెండాను ముందుకు తీసుకెళ్లడంలో పాల్గొనే మరియు వినూత్నమైన ప్రాంతీయ సమావేశాలు మరియు సామర్థ్య నిర్మాణ కార్యక్రమాల పరంపరను నిర్వహించడం కోసం జమ్మూ & కశ్మీర్ ప్రభుత్వంతో డి.ఏ.ఆర్.పి.జి. కుదుర్చుకున్న ఒప్పందాన్ని డాక్టర్ జితేంద్ర సింగ్ అభినందించారు.
సుపరిపాలన సూచిక (జి.జి.ఐ.) 2019, నేషనల్ ఈ-సర్వీసెస్ డెలివరీ అసెస్‌మెంట్ 2019 మరియు సెంట్రల్ సెక్రటేరియట్ మాన్యువల్ ఆఫ్ ఆఫీస్ ప్రొసీజర్ 2019 వంటి మూడు ముఖ్యమైన ప్రచురణ విషయంలో డి.ఏ.ఆర్.పి.జి. చేసిన కృషిని డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రశంసించారు. ఈ ప్రచురణలు వాటి విద్యా పరమైన విషయ పరిజ్ఞానంతో నిండి ఉన్నాయి. డిజిటల్ సెంట్రల్ సెక్రటేరియట్ వైపు దూసుకు పోయేందుకు, సుపరిపాలన ను ముందుకు తీసుకెళ్లడానికీ అవసరమైన అనేక విషయాలు వీటిలో ఉన్నాయి.
భవిష్యత్తు కార్యాచరణ గురించి డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ, ఫీడ్-బ్యాక్ కాల్ సెంటర్లతో టూల్ కిట్‌ను మెరుగుపరచడం, అప్‌గ్రేడ్ చేసిన సాఫ్ట్‌వేర్ సొల్యూషన్స్ మరియు ఇ-గవర్నెన్స్ మరియు ఇ-సర్వీసెస్ పై దృష్టి సారించి ప్రభుత్వ సుపరిపాలన ఎజెండాను ముందుకు తీసుకెళ్లడం ద్వారా సకాలంలో ఫిర్యాదుల పరిష్కారానికి కొత్త సవాళ్లను ఎదుర్కోవడంలో డి.ఏ.ఆర్.పి.జి. కి భారీ బాధ్యత ఉందని అన్నారు. స్వదేశీ విధానం నుండి సమర్థవంతమైన పనిని వేగవంతం చేయాలని కూడా ఆయన డి.ఏ.ఆర్.పి.జి. ని కోరారు.
డి.ఏ.ఆర్.పి.జి. కార్యదర్శి డాక్టర్ ఛత్రపతి శివాజీ, డి.ఏ.ఆర్.పి.జి. అదనపు కార్యదర్శి వి.శ్రీనివాస్, సంయుక్త కార్యదర్శులు శ్రీమతి జయా దుబే మరియు శ్రీ ఎన్.బి.ఎస్. రాజపుట్ తో పాటు డిపార్టుమెంటు కు చెందిన సీనియర్ అధికారులు ఈ కార్యక్రమంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు.
డి.ఏ.ఆర్.పి.జి. ఈ-బుక్ లెట్ (చిన్న పుస్తకం) చూడడానికి దయచేసి ఇక్కడ క్లిక్ చెయ్యండి.
<><><><>
(Release ID: 1628070)
Visitor Counter : 309