రక్షణ మంత్రిత్వ శాఖ
అమెరికా రక్షణ మంత్రితో ఫోన్‌లో మాట్లాడిన భారత రక్షణ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్
- ద్వైపాక్షిక రక్షణ సహకార ఏర్పాట్ల విషయమై పురోగతిని సమీక్షించిన ఇరువురు
Posted On:
29 MAY 2020 6:48PM by PIB Hyderabad
భారత రక్షణ శాఖ మంత్రి శ్రీ రాజనాథ్ సింగ్ శుక్రవారం (ఈ రోజు) సాయంత్రం అమెరికా రక్షణ మంత్రి డాక్టర్ మార్క్ టీ ఎస్పర్‌తో ఫోన్‌లో మాట్లాడారు. కోవిడ్-19 మహమ్మారిపై పోరాట అనుభవాలను గురించి ఇద్దరు మంత్రులు ఒకరితో మరొకరు వివరించుకున్నారు. ఈ విషయమై అద్భుతమైన ద్వైపాక్షిక సహకారాన్ని కొనసాగిస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఈ ఫోన్ సంభాషణలో భాగంగా వారు ఇరువురు మంత్రులు వివిధ ద్వైపాక్షిక రక్షణ సహకార ఏర్పాట్లలో పురోగతిని సమీక్షించారు. రెండు దేశాల మధ్య రక్షణ భాగస్వామ్యాన్ని మరింత ప్రోత్సహించే విషయమై నిబద్ధత వ్యక్తం చేశారు. సౌలభ్యం మేరకు విలైనంత దగ్గరలోనే భారత్‌ను సందర్శించాలని భారత రక్షణ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్ అమెరికా రక్షణ మంత్రి ఎస్పర్‌ను ఆహ్వానించారు. రక్షణ మంత్రి ఆహ్వానాన్ని ఎస్పర్ చాలా ఆనందంతో అంగీకరించారు. ఇటీవల సంభవించిన ఆంఫన్ తుఫాను సమయంలో తూర్పు భారత దేశంలో జరిగిన ప్రాణ నష్టం విషయమై ఎస్పెర్ తన సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తుఫాను సమయంలో భారతదేశం చేపట్టిన సహాయక చర్యల గురించి రక్షణ మంత్రి ఆయనకు వివరించారు. భాగస్వామ్య భద్రతా ప్రయోజనాల ప్రాంతీయ పరిణామాలపై ఇరువురు మంత్రులు తమ అభిప్రాయాలను పంచుకున్నారు.
(Release ID: 1627845)
Visitor Counter : 293