వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ
లాక్ డౌన్ సమయంలో దేశ ఆహార ధాన్యం అవసరాలు తీర్చేందుకు 3530 రైలు భోగీల ద్వారా 98 లక్షల మిలియన్ టన్నుల ఆహారాన్ని రవాణా చేసినట్లు, 751.69 లక్షల మెట్రిక్ టన్నుల మేర తగినంత ఆహార ధాన్యాల నిల్వ ఉందని తెలిపిన ఆహార మరియు పి.డి.ఎస్. మంత్రి
మంత్రిత్వ శాఖ యొక్క ఏడాది విజయాల గురించి మీడియాను ఉద్దేశించి ప్రసంగించిన శ్రీ రామ్ విలాస్ పాశ్వాన్.
Posted On:
29 MAY 2020 5:46PM by PIB Hyderabad
గత ఏడాది కాలంలో వినియోగదారులు వ్యవహారాలు, ఆహార, ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ చేపట్టిన కార్యక్రమాలు మరియు సంస్కరణల గురించి మీడియాకు వివరించేందుకు కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార మరియు ప్రజాపంపిణీ శాఖ మంత్రి శ్రీ రామ్ విలాస్ పాశ్వాన్ ఈ రోజు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కోవిడ్ -19 మహమ్మారి నేపథ్యంలో, అన్ని పి.డి.ఎస్. మరియు నాన్ పి.డి.ఎస్. కార్డ్ హోల్డర్లకు, వలస కార్మికులు మరియు ఏదైనా ఆహార పథకం కిందకు రాని వారికి ఆహార ధాన్యాలు మరియు పప్పు ధానాలు అందించడం మీద మంత్రిత్వ శాఖ ప్రధానంగా దృష్టి కేంద్రీకరించిందని ఆయన మీడియాకు తెలిపారు. రాష్ట్ర ఆహార శాఖల మంత్రులు మరియు కార్యదర్శులతో మంత్రిత్వ శాఖ క్రమం తప్పకుండా సమీక్ష నిర్వహిస్తోందని, అందువల్ల అహార ధాన్యాన్ని సరఫరా చేసేందుకు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఎలాంటి అడ్డంకులు కలగబోవని తెలిపారు. తాజా స్టాక్ లో తగినంత ఆహార నిల్వలు అందుబాటులో ఉన్నాయని తెలిపిన ఆయన, పి.ఎం.జి.కె.ఏ, ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజీ, ఎన్.ఎఫ్.ఎస్.ఏ. మరియు ఇతర పథకాల కింద రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఆహార ధాన్యాల పంపిణీ కొన్ని రాష్ట్రాలు మినహా సంతృప్తి కరంగా ఉందని తెలిపారు. 2021 నాటికి వన్ నేషన్ – వన్ రేషన్ కార్డ్ పథకం కింద ఆధార్ తో 100 శాతం రేషన్ కార్డులను అందుబాటులో ఉంచే అంశాన్ని సాధించాలని మంత్రిత్వ శాఖ లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు.
మీడియాతో మాట్లాడుతూ, 2020 మే 28 నాటికి, ఎఫ్.సి.ఐ.లో ప్రస్తుతం 272.29 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం, 479.40 లక్షల మెట్రిక్ టన్నుల గోధుమలు ఉన్నాయని మంత్రి తెలిపారు. అందువల్ల మొత్తం 751.69 లక్షల మిలియన్ టన్నుల ఆహార ధాన్యం నిల్వలు అందుబాటులో ఉన్నాయని (గోధుమ మరియు వరి కొనుగోలు మినహాయించి, ఇవి ఇంకా గోడౌన్ కు చేరలేదు) వివరించారు.
2020 మార్చి 24న లాక్ డౌన్ ప్రకటించిన నాటి నుంచి సుమారు 98.84 లక్షల మెట్రిక్ టన్నుల ఆహారా ధాన్యాలను 3530 రైలు భోగీల ద్వారా రవాణా చేయబడుతున్నాయని ఆయన తెలిపారు. రైలు మార్గమే కాకుండా, రోడ్లు మరియు జల మార్గాల ద్వారా కూడా రవాణా జరిగిందని, మొత్తం 201.44 లక్షల మిలియన్ టన్నుల రవాణా చేయబడిందని తెలిపారు. 11 నౌకల ద్వారా 12వేల మెట్రిక్ టన్నుల ఆహారధాన్యాలు రవాణా అయ్యాయని, దానితో పాటు మొత్తం 9.61 లక్షల మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాలు ఈశాన్య రాష్ట్రాలకు రవాణా అయినట్లు వివరించారు.
ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన
1. ఆహార ధాన్యం (బియ్యం / గోధుమ)
పి.ఎం.జి.కె.ఏ.వై. కింద వచ్చే 3 నెలలకు మొత్తం 104.4 లక్షల మిలియన్ టన్నుల బియ్యం మరియు 15.6 లక్షల మిలియన్ టన్నుల గోధుమలు అవసరం అవుతాయి. వీటిలో 83.38 లక్షల మిలియన్ టన్నుల బియ్యం మరియు 12.42 లక్షల మిలియన్ టన్నుల గోధుమలను వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సరఫరా చేయడం జరిగింది. మొత్తం 95.80 లక్షల మిలియన్ టన్నుల సరఫరా జరిగింది.
2. పప్పులు
పప్పు ధాన్యాల విషయానికి వస్తే రాబోయే మూడు నెలల మొత్తం అవసరానికి 5.87 లక్షల మిలియన్ టన్నుల కు గాను, ఇప్పటి వరకూ 4.62 లక్షల మిలియన్ టన్నుల పప్పులు పంపించగా, 3.64 లక్షల మిలియన్ టన్నుల పప్పులు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు చేరుకున్నాయి. 71,738 మెట్రిక్ టన్నుల పంపిణీ జరిగింది. 2020 మే 20 నాటికి 1.64 లక్షల మిలియన్ టన్నుల పప్పులను రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు పంపిణీ చేశాయి. 2020 మే 20 నాటికి మొత్తం 12.81 లక్షల మెట్రిక్ టన్నుల పప్పులు (టూర్ -588 ఎల్.ఎమ్.టి., మూంగ్ -1.62 ఎల్.ఎమ్.టి., ఉరాద్ -2.42 ఎల్.ఎమ్.టి., బెంగాల్‌గ్రామ్ -2.42 ఎల్.ఎమ్.టి. మరియు మసూర్ -0.47 ఎల్.ఎమ్.టి.) ప్రస్తుత స్టాక్ లో అందుబాటులో ఉన్నాయి.
ఆత్మ నిర్భర్ భారత్
ఆత్మ నిర్భర్ భారత్ ప్యాకేజీ కింద రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ఇప్పటికే 2.06 ఎల్.ఎం.టి.ల ఆహార ధాన్యాల పంపిణీ చేసినట్లు , ఇప్పటికే పంపిణీ ప్రారంభమైందని, షెడ్యూల్ ప్రకారం పూర్తి అవుతుందని శ్రీ పాశ్వాన్ తెలిపారు.
ఆత్మ నిర్భర్ భారత్ పథకం కింద వలస వచ్చిన వారిని / ఒంటరిగా ఉన్న వలసదారులను గుర్తించడం రాష్ట్ర, కేంద్ర పాలిత ప్రభుత్వాల సొంత యంత్రాంగాల ద్వారా చేయవచ్చని, మరియు వ్యక్తుల ఆధార్ అందుబాటులో ఉంటే, ఆ వ్యక్తి ఎన్.ఎఫ్.ఎస్.ఏ. లేదా రాష్ట్రం పిడిఎస్ పథకం పరిధిలోకి రాలేదని నిర్థారించడానికి కూడా పరపతి అందించవచ్చని ఆయన తెలిపారు. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ఈ పథకం యొక్క ప్రయోజనాన్ని ఏదైనా పేద లేదా నిరుపేద వలస లేదా ఒంటరిగా ఉన్న వలసదారులకు అందిచవచ్చని, వారు ఆహారం పొందలేరని అదే విధంగా ఎన్.ఎఫ్.ఎస్.ఏ లేదా రాష్ట్ర పి.డి.ఎస్. పథకాల పరిధిలోకి రారని వివరించారు.
వన్ నేషన్ – వన్ రేషన్ కార్డ్
17 రాష్ట్రాలు లేదా కేంద్ర పాలిత ప్రాంతాల్లో వన్ నేషన్ – వన్ రేషన్ కార్డ్ ప్రణాళిక ప్రకారం ఎన్.ఎఫ్.ఎస్.ఏ. రేషన్ కార్డుల హోల్డర్లు ప్రవేశ పెట్టిన పోర్టబులిటీ గురించి శ్రీ పాశ్వాన్ తెలిపారు. ప్రస్తుతం 17 రాష్ట్రాల ఒకే జాతీయ క్లస్టర్లో కలిపే సౌకర్యం అందుబాటులో ఉంది. జనవరి 2012 నాటికి 100 శాతం ఆధార్ అనుసంధాన్ని సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు.
కోవిడ్ -19 వ్యాప్తిని పరిష్కరించేందుకు ఇథనాల్ ఉత్పత్తిని పెంచడం
ప్రస్తుతం 2019-20 సంవత్సరానికి ఇథనాల్ సరఫరా (డిసెంబర్ 2019 – నవంబర్ 2020) కోసం చక్కెర మరియు చక్కెర సిరప్ నుంచి ఇథనాల్ ఉత్పత్తిని కూడా ప్రభుత్వం అనుమతించిందని, సి-హెవీ మొలాసిస్ నుంచి పొందిన ఇథనాల్ లీరు 43.75 రూపాయలు, బి-హెవీ మొలాసిస్ నుంచి లీటరుకు 54.27 రూపాయలు, చెరకు రసం లేదా చక్కెర లేదా చక్కెర సిరప్ నుంచి పొందిన ఇథనాల్ కోసం లీటరుకు 59.48 రూపాయలు రెమ్యునరేటివ్ ఎక్స్-మిల్లు ధరను నిర్ణయించిందని ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రబుత్వాలు లేదా కేంద్ర పాలిత ప్రాంతాల సమన్వయంతో ఆహార మరియు ప్రజా పంపిణీ శాఖ సమిష్టి కృషికి, ఇథైల్ ఆల్కహాల్ లేదా ఇథనాల్ లైసెన్సింగ్ మరియు నిల్వ కారణంగా అవసరమైన అనుమతులు హ్యాండ్ శానిటైజర్లను తయారు చేయడానికి చక్కెర మిల్లులకు, డిస్టిలరీలకు, శానిటైజర్ పరిశ్రమలకు ఇచ్చనట్లు తెలిపారు. ఫలితంగా 165 డిస్టిలరీలు మరియు 962 స్వతంత్ర తయారీ దారులకు దేశ వ్యాప్తంగా హ్యాండ్ శానిటైజర్లు ఉత్పత్తి చేయడానికి లైసెన్సులు ఇవ్వబడ్డాయని, దీని ఫలితంగా 87,20,262 లీటర్ల హ్యాండ్ శానిటైజర్ల ఉత్పత్తి (2020 మే 11 నాటికి) జరిగిందని వివరించారు.
తక్కువ సల్ఫర్ ఉండే చక్కెరను పొందడానికి చెరకు రసం స్పష్టీకరణపై కొత్త ప్రక్రియ కోసం నేషనల్ షుగర్ ఇనిస్టిట్యూట్ (ఎన్.ఎస్.ఐ) కాన్పూర్ కు పేటెంట్ మంజూరు చేయబడింది. ఇంకా కో-స్పటికీకరణతో ఫోర్టిఫైడ్ నిరాకార చక్కెరపై పేటెంట్ కోసం కూడా ఒక దరఖాస్తు దాశలైంది.
బలవర్థకమైన వరి
మహారాష్ట్ర మరియు గుజరాత్ 2020 ఫిబ్రవరి నుంచి పైలట్ పథకం కింద బలవర్థకమైన బియ్యం పంపిణీని ప్రారంభించాయని, బియ్యం బలోపేతం మరియు ప్రజా పంపిణీ వ్యవస్థ కింద వాటి పంపిణీ పై కేంద్ర ప్రాయోజిత పైలట్ పథకం గురించి శ్రీ పాశ్వాన్ సమాచారం ఇచ్చారు. హాస్టళ్ళ పథకం రాష్ట్రాలు లేదా కేంద్ర పాలిత ప్రాంతాల సహాయంతో లేదా స్పాన్సర్ చేసిన హాస్టళ్ళను దాని పరిధిలోకి చేర్చడానికి సవరించబడింది. ఇప్పుడు బి.పి.ఎల్. రేట్ల వద్ద ఆహార ధాన్యాన్ని కేటాయించడం, ప్రభుత్వ యాజమాన్యంలోని మరియు బెగ్గర్ హౌస్ లు, నారి నికేతన్ లు, మరియు ఇతర సారూప్య సంక్షేమ సంస్థల అవసరాలను తీర్చడానికి మరియు ప్రభుత్వ యాజమాన్యంలోని మరియు స్పాన్సర్డ్ హాస్టళ్ళ విద్యార్థులందరికీ 2/3 వ వంతు నివాసితులు ఎస్సీ లేదా ఎస్టీ లేదా ఓబీసీ వర్గానికి చెందిన వారని తెలిపారు.
అధిక టర్నోవర్ సాధించిన సి.డబ్ల్యూ.సి.
2019-20లో సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ (సి.డబ్ల్యూ.సి) అత్యధికంగా 1710 కోట్ల రూపాయల టర్నోవర్ సాధించిందని శ్రీ పాశ్వాన్ తెలిపారు. 2019-20 సంవత్సరానికి సి.డబ్ల్యూ.సి మధ్యంతర డివిడెండ్ ప్రకటించింది. గతేడాది 72.20 శాతంతో పోలిస్తే, 95.53 శాతం ఉంది. భారత ప్రభుత్వానికి మొత్తం డివిడెండ్ 64.98 కోట్ల రూపాయల్లో 35.77 కోట్ల రూపాయలు వచ్చాయి.
***
(Release ID: 1627769)
Visitor Counter : 298