ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ
కేంద్ర మంత్రి డా.జితేంద్ర సింగ్‌తో జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు సోసో షైజా సమావేశం
ఈశాన్య రాష్ట్రాల్లో కొవిడ్-19 ప్రభావం, తిరిగి వస్తున్నవారికి ఉపాధిపై చర్చ
ఈశాన్య ప్రాంత వాసులకు సౌకర్యవంతమైన జీవనోపాధి కల్పిస్తామని మంత్రి హామీ
Posted On:
28 MAY 2020 7:21PM by PIB Hyderabad
జాతీయ మహిళా కమిషన్ సీనియర్ సభ్యురాలు శ్రీమతి సోసో షైజా, కేంద్ర ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ మంత్రి (స్వతంత్ర బాధ్యత) డా.జితేంద్ర సింగ్‌తో సమావేశమయ్యారు. ఈశాన్య రాష్ట్రాల్లో కొవిడ్-19 ప్రభావంపై చర్చించారు. కరోనా వైరస్‌కు అడ్డుకట్ట వేసేలా సమయానుకూలంగా ముందస్తు జాగ్రత్తలు చేపట్టిన ప్రధాని శ్రీ నరేంద్రమోదీని ఆమె ప్రశంసించారు. భారత్ ఈ గడ్డు పరిస్థితి నుంచి గట్టెక్కుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
లాక్‌డౌన్ సమయంలో తాము చేపట్టిన సేవా కార్యక్రమాల గురించి శ్రీమతి షైజా మంత్రికి వివరించారు. ముఖ్యంగా, దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఉన్న ఈశాన్య ప్రాంత ప్రజలకు అందించిన సాయం గురించి చెప్పారు. కొన్ని ప్రత్యేక ఉద్యోగాల్లో నైపుణ్యం ఉండి, ఈశాన్య ప్రాంతాలకు తిరిగివస్తున్న యువతకు ఎలా ఉపాధి కల్పించాలన్న అంశంపై ఓ ప్రణాళికను ఆమె మంత్రికి అందించారు.
కరోనా సమయంలో, మహిళా స్వయం సహాయక బృందాల పనితీరును మంత్రి డా.జితేంద్ర సింగ్ ప్రశంసించారు. లాక్‌డౌన్ సమయంలో ఈశాన్య ప్రాంత మహిళలు వివిధ వస్తువుల తయారీలో ముందడుగు వేశారని అన్నారు. స్వయం సహాయక బృందాలు చేతుల్లో రూపుదిద్దుకుని దేశవ్యాప్తంగా వేగంగా ప్రాచుర్యం పొందుతున్న అనేక రకాల, ఫ్యాన్సీ డిజైన్లు ఉన్న ముఖ కవచాల గురించి ఈ సందర్భంగా మంత్రి ప్రత్యేకంగా ప్రస్తావించారు.
కరోనా వైరస్ సమయంలో, ఈశాన్య ప్రాంతంలో తమ మంత్రిత్వ శాఖ చేపట్టిన అనేక కార్యక్రమాల గురించి కూడా డా.జితేంద్ర సింగ్ జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు సోసో షైజాకు వివరించారు. ఈశాన్య రాష్ట్రాలకు ఆర్థిక సాయం అందించామన్నారు. వైద్య రంగానికి సంబంధించి, ముఖ్యంగా కరోనా వైరస్, ఇతర అంటువ్యాధులకు సంబంధించిన సాయం కోరుతూ ఈశాన్య రాష్ట్రాల నుంచి తమ వద్దకు అభ్యర్ధనలు వచ్చినప్పుడు వేగంగా వాటిని పరిష్కరించామన్నారు. కరోనా సమయంలో ఈశాన్య రాష్ట్రాల ప్రభుత్వాలు స్పందించిన తీరును మంత్రి ప్రశంసించారు.
దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి తిరిగివచ్చే ఈశాన్య ప్రాంత వాసులకు సౌకర్యవంతమైన జీవనోపాధి కల్పించడానికి అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని శ్రీమతి సోసో షైజాకు మంత్రి డా.జితేంద్ర సింగ్ హామీ ఇచ్చారు.
(Release ID: 1627567)
Visitor Counter : 207