రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

తేజాస్ యుద్ధ విమానం వైమానిక దళానికి అప్పగింత

Posted On: 27 MAY 2020 8:29PM by PIB Hyderabad

భారత వైమానిక దళం ఇటీవలే సులూర్ లోని వైమానిక కేంద్రంలో పునరుద్ధరించిన ఫ్లయింగ్ బులెట్స్ అనే 18వ స్క్వాడ్రన్ లోకి తేజాస్ ఎంకె-1 ఎఫ్ ఓ సి ని తీసుకుంది. దీంతో వైమానిక దళం నిర్వహణ సామర్థ్యం పెంపులో మరో ముఖ్యమైన అడుగు వేసినట్టయింది. ఇలా తీసుకోవటం స్క్వాడ్రన్ కు ఇదే మొదటి సారి. మేకిన్ ఇండియా కార్యక్రమాన్ని పరిపుష్టం చేసేలా స్వదేశీ యుద్ధ విమాన చరిత్రలో కూడా ఇదొక కీలకమైన మైలురాయి. అత్యంత చురుకైన ఈ  తేలికపాటి యుద్ధ విమానం ఒకే ఇంజన్ తో పనిచేస్తుంది. వైవిధ్యాన్ని చాటుకుంటూ అన్ని రకాల వాతావరణాలనూ తట్టుకోగలగటం, బహుళ పాత్రలు పోషించగలగటం, గాలిలోనే ఇంధనం నింపుకోగలగటం దీని ప్రత్యేకతలు.


వైమానిక దళాధిపతి ఎయిర్ ఛీఫ్ మార్షల్ ఆర్ కె ఎస్ బహదౌరియా దీన్ని వాడకంలో పెట్టారు. సదర్న్ ఎయిర్ కమాండ్ ఎయిర్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్ ఎయిర్ మార్షల్ టిడి జోసెఫ్, హెచ్ ఎ ఎల్ సీఎండీ శ్రీ ఆర్ మాధవన్, ఏరోనాటికల్ దెవలప్ మెంట్ ఏజెన్సీ డైరెక్టర్ డాక్టర్ గిరీశ్ ఎస్ దేవధర్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 
ఈ సందర్భంగా తేజాస్ ఎఫ్ ఓ సి  పత్రాలను హిందుస్తాన్ ఎరోనాటికల్ సిఎండి  వైమానిక దళాధిపతికి అప్పగించారు. అనంతరం వైమానిక దళాధిపతి ఈ పత్రాలను 18 స్క్వాడ్రన్ గ్రూప్ కమాండింగ్ ఆఫీసర్  కెప్టెన్ మనీష్ తొలాని కి లాంచనపూర్వకంగా తాళాలతో అందజేశారు. హెలికాప్టర్లు, రవాణా విమానాలు. తేజాస్ యుద్ధ విమానాల గగన తల విన్యాసాలతో  ఈ కార్యక్రమం ప్రారంభమైంది. 
18 వ స్క్వాడ్రన్ 1965 ఏప్రిల్ 15న అంబాలా లో ఏర్పాటైంది. భారత వైమానిక దళంలోని ఏకైక పరమవీర చక్ర గ్రహీత ఫ్లయింగ్ ఆఫీసర్ నిర్మల్ జిత్ సింగ్ సెఖాన్ 1971 నాటి భారత్-పాకిస్తాన్ యుద్ధ సమయంలో ఈ స్క్వాడ్రన్ లో ఉన్నారు. హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ లో తయారైన రెండు విమానాలు తేజాస్, అజీత్ అదే యుద్ధంలో  నడిపిన ఘనత కూడా ఈ స్క్వాడ్రన్ దే.  దేశవ్యాప్తంగా వేరు వేరు స్థావరాల నుంచి మిగ్-27 ఎం ఎల్ విమానాన్ని కూడా నడిపింది. సదర్న్ ఎయిర్ కమాండ్ నిర్వహణ పరిధిలోకి వచ్చే ఈ స్క్వాడ్రన్ కు 2016 ఏప్రిల్ లో తాత్కాలిక విరామం ఇచ్చారు. 

***



(Release ID: 1627339) Visitor Counter : 209