ప్రధాన మంత్రి కార్యాలయం

ఈజిప్టు అధ్యక్షుడు శ్రీ అబ్దెల్ ఫతహ్ అల్-సిసీ తో టెలిఫోన్ లో సంభాషించిన ప్ర‌ధాన‌ మంత్రి

Posted On: 26 MAY 2020 7:38PM by PIB Hyderabad

ఈజిప్టు అధ్యక్షుడు శ్రీ అబ్దెల్ ఫతహ్ అల్-సీసీ తో ప్ర‌ధాన‌ మంత్రి శ్రీ  న‌రేంద్ర‌ మోదీ ఈ రోజు న టెలిఫోన్‌ లో మాట్లాడుతూ, ఈజిప్టు అధ్యక్షుడు శ్రీ అబ్దెల్ ఫతహ్ అల్-సిసీ కి మరియు ఈజిప్టు ప్రజల కు ఈద్-ఉల్-ఫిత్ర్ శుభాకాంక్షలు తెలిపారు.

ఈజిప్టు అధ్యక్షుడు శుభాకాంక్షల ను స్వీకరిస్తూ,  
ఈజిప్టు నాగరకత మరియు భారతదేశం నాగరకత ప్రపంచం లోని అత్యంత పురాతనమైన నాగరకత ల సరసన నిలుస్తాయని పేర్కొన్నారు.  ద్వైపాక్షిక సంబంధాలు వేగవంతమైన రీతి లో విస్తరిస్తుండటం పట్ల ఆయన సంతోషాన్ని వ్యక్తం చేశారు.

కోవిడ్-19 సంక్షోభ కాలం లో ఈజిప్టు అధికారివర్గాలు భారతీయ పౌరుల సురక్ష కోసం మరియు సంక్షేమం కోసం సాయపడటాన్ని ప్ర‌ధాన‌ మంత్రి ప్రశంసించారు.
 
ఇదివరకు వేసుకొన్న ప్రణాళిక  ప్రకారం తాను ఈ సంవత్సరం లో ఈజిప్టు ను  సందర్శించవలసి ఉండగా ఆ కార్యక్రమాన్ని కోవిడ్-19 విశ్వమారి కారణం గా నిలిపివేసుకోవలసి వచ్చిన సంగతి ని ప్రధాన మంత్రి ఈ సందర్భం లో ప్రస్తావిస్తూ, పరిస్థితులు అనుకూలించిన వెంటనే అధ్యక్షుడు శ్రీ సిసీ ని కలుసుకోవాలని ఉంది అంటూ తన అభిలాష ను వెల్లడించారు.  


**(Release ID: 1627190) Visitor Counter : 102