విద్యుత్తు మంత్రిత్వ శాఖ

రూ.22,000 కోట్ల విలువైన విద్యుత్తు ప్రాజెక్టుల‌కు నిధులు స‌మ‌కూర్చేందుకు ఎన్‌బీపీసీఎల్‌తో పీఎఫ్‌సీ అవ‌గాహన‌ ఒప్పందం

- 225 మెగావాట్ల హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టుల‌తో పాటు వివిధ బహుళార్ధసాధక ప్రాజెక్టులకు ఆర్థిక సాయం

Posted On: 26 MAY 2020 6:14PM by PIB Hyderabad

విద్యుత్తు మంత్రిత్వ శాఖ ఆధ్వ‌ర్యంలోని కేంద్ర ప్ర‌భుత్వ రంగ సంస్థ (పీఎస్‌యూ) మ‌రియు  దేశంలో ప్ర‌ముఖ బ్యాంకింగేత‌ర ఆర్థిక సంస్థ (ఎన్‌బీఎఫ్‌సీ) అయిన ప‌వ‌ర్ ఫైనాన్స్ కార్పొరేష‌న్ (పీఎఫ్‌సీ) మ‌ధ్యప్ర‌దేశ్‌లోని వివిధ విద్యుత్తు ప్రాజెక్టుల‌కు ఆర్థిక సాయం అందించేందుకు ముందుకు వ‌చ్చింది. ఇందులో భాగంగా సంస్థ మ‌ధ్య‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం అధ్వ‌ర్యంలోని న‌ర్మ‌దా బేసిన్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్‌తో (ఎన్‌బీపీసీఎల్‌) మంగ‌ళ‌వారం ఒక అవ‌గాహ‌న ఒప్పందం (ఎంఓయూ) కుదు‌ర్చుకుంది. ఈ ఒప్పందంలో భాగంగా మ‌ధ్యప్ర‌దేశ్‌లో దాదాపు రూ.22,000 కోట్ల విలువైన 225 మెగావాట్ల హైడ్రో-ఎల‌క్ట్రిక్ ప్రాజెక్టులు మ‌రియు ఇత‌ర బ‌హుళ ప్ర‌యాజ‌న‌క‌ర ప్రాజెక్టుల‌కు సంస్థ త‌గిన ఆర్థిక సాయం అందించ‌నుంది. రాష్ట్రంలో 225 మెగావాట్ల జలవిద్యుత్ ప్రాజెక్టులు, మధ్యప్రదేశ్‌లో 12 ప్రధాన బహుళార్ధసాధక ప్రాజెక్టుల విద్యుత్ భాగాలను ఏర్పాటు చేయడానికి ఎన్‌బీపీసీఎల్ సంస్థ ఈ నిధులను మోహరించనుంది. వర్చువల్ ప్లాట్‌ఫామ్‌పై జ‌రిగిన ఒక కార్య‌క్ర‌మంలో ఈ అవగాహన ఒప్పందంపై పీఎఫ్‌సీ సంస్థ సీఎండీ రాజీవ్ శ‌ర్మ‌, ఎన్‌బీపీసీఎల్ మేనేజింగ్ డైరెక్ట‌ర్ శ్రీ ఐ.సి.పి. కేశరిలు సంత‌కం చేశారు. మధ్యప్రదేశ్ ప్రభుత్వం అంత‌కు ముందు ఈ ప్రాజెక్టుల సాధ్యాసాధ్యల‌ అధ్యయనం నిర్వహించింది. ఆ త‌రువాత వాటి అమలుకు అనుమతి ఇచ్చింది. ప్రాజెక్టుల‌కు నిధుల‌ను స‌మ‌కూర్చ‌డ‌మనేది ప్రాజెక్టుల అమలుతో ముడిపడి ఉండ‌నుంది. పన్నెండు ప్రధాన బహుళార్ధసాధక ప్రాజెక్టులను అమలు చేయడానికి మ‌ధ్యప్ర‌దేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల‌లో ఎన్‌ఎఫ్‌పీసీఎల్‌తో క‌లిసి పీఎఫ్‌సీ చురుకుగా భాగస్వామి కావడానికి మరియు బహుళార్ధసాధక ప్రాజెక్టుల విద్యుత్తు విభాగాలతో పాటు మొత్తం 225 మెగావాట్ల హైడ్రో-ఎలక్ట్రిక్ ప్లాంట్లకు నిధుల‌ను అందించడానికి ఈ అవ‌గాహ‌న ఒప్పందం పీఎఫ్‌సీ దోహ‌దం చేయ‌నుంది. అవగాహన ఒప్పందంలో భాగంగా పీఎఫ్‌సీ ఆర్థిక సాయం అందించ‌నున్న‌ కొన్ని ప్రధాన బహుళార్ధసాధక ప్రాజెక్టులు బసానియా మల్టీపర్పస్ ప్రాజెక్ట్ దిండోరి, చింకి బోరాస్ బహుళార్ధసాధక ప్రాజెక్ట్ నర్సింగ్‌పూర్ రైసన్ హోషంగాబాద్, సక్కర్ పెంచ్లింక్ నర్సింగ్‌పూర్ చింద్వారా, దుధి ప్రాజెక్ట్ చింద్వర హోషంగాబాద్ మొదలైనవి ఉన్నాయి.
ప్ర‌తిపాదిత ప్రాజెక్టుల‌ అమ‌లులో త‌గిన ఆస‌క్తి మరియు పరస్పర ఆమోదయోగ్యమైన నిబంధనల ఆధారంగా పీఎఫ్‌సీ సంస్థ ఎన్‌బీపీసీకు ఆర్థిక సాయం అందించే విష‌యాన్ని పరిశీలిస్తుంది.

***



(Release ID: 1627101) Visitor Counter : 206