రక్షణ మంత్రిత్వ శాఖ
దిల్లీలో నేటి నుంచి మూడు రోజులపాటు సైనిక కమాండర్ల సమావేశం కార్యాచరణ, పరిపాలన, లాజిస్టిక్స్, సైనిక సిబ్బంది అంశాలపై చర్చ
Posted On:
26 MAY 2020 6:40PM by PIB Hyderabad
ఏడాదికి రెండుసార్లు నిర్వహించే అత్యున్నత స్థాయి సమావేశాల్లో భాగంగా, సైనిక కమాండర్లు సమావేశం కానున్నారు. ముఖ్యమైన విధాన నిర్ణయాలను తీసుకునేలా, అంశాల వారీ చర్చలను సులభతరం చేసేందుకు ఈ సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ భేటీ ఈ ఏడాది ఏప్రిల్‌లోనే జరగాల్సివున్నా, కొవిడ్ కారణంగా వాయిదా వేశారు. ఇప్పుడు రెండు దఫాలుగా సమావేశాలను నిర్వహిస్తున్నారు. మొదటి దశ సమావేశం నేటి నుంచి (27.05.2020) ఎల్లుండి వరకు (29.05.2020) జరుగుతుంది. రెండో దశ చర్చలను జూన్ చివరి వారంలో నిర్వహిస్తారు.
ఎప్పటికప్పుడు ఎదురవుతున్న రక్షణ, పాలనాపరమైన సవాళ్లపై ప్రస్తుత సమావేశంలో ఆర్మీ కమాండర్లు చర్చలు జరుపుతారు. భవిష్యత్తులో సైన్యం చేపట్టాల్సిన కార్యక్రమాలను నిర్ణయిస్తారు. ఆర్మీ కమాండర్లు, సీనియర్ అధికారులతో కూడిన ఉన్నత స్థాయి బృందం ద్వారా నిర్ణయాలు తీసుకుంటారు.
దిల్లీలోని సౌత్ బ్లాక్‌లో మొదటి దఫా సమావేశాలు జరుగుతాయి. కార్యాచరణ, పరిపాలనకు సంబంధించిన వివిధ అంశాలను ఆర్మీ కమాండర్లు చర్చిస్తాయి. లాజిస్టిక్స్, సైనిక సిబ్బందికి సంబంధించిన అధ్యయనాలపైనా చర్చలు జరుగుతాయి.
***
(Release ID: 1627093)
Visitor Counter : 194