శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ

ఎక్కువ స‌మ‌యం వినియోగించేలా ‌సౌకర్యవంతమైన ముఖ‌ మాస్క్‌ను రూపొంచిందిన సీఈఎన్ఎస్‌

- కోవిడ్‌-19 నుంచి ర‌క్ష‌ణనిస్తూ ఎక్కువ గంట‌లు ధ‌రించేందుకు సౌల‌భ్యంగా ఉండేలా స‌మ‌ర్థ‌తా రూపక‌ల్ప‌నతో త‌యారు చేసిన మాస్క్‌లు అవ‌స‌రం: డీఎస్‌టీ కార్య‌ద‌ర్శి ప్రొఫెసర్ అశుతోష్ శర్మ

Posted On: 23 MAY 2020 2:25PM by PIB Hyderabad

బెంగుళూరులోని సెంటర్ ఫర్ నానో అండ్ సాఫ్ట్ మేటర్ సైన్సెస్ (సీఈఎన్ఎస్) పరిశోధకుల బృందం క‌ప్పు ఆకారపు డిజైన్ (పేటెంట్ దాఖలు చేసిన‌) క‌లిగిన మాస్క్‌ను అభివృద్ధి చేసింది. సీఈఎన్ఎస్ సంస్థ కేంద్ర శాస్త్ర మ‌రియు సాంకేతిక శాఖ (డీఎస్టీ) ప‌రిధిలో ప‌ని చేసే స్వ‌యం ప్రతిపత్తి గ‌ల‌ సంస్థ. ఈ బృందం రూపొందించిన స‌రికొత్త క‌ప్పు ఆకార‌పు మాస్క్‌ను ధ‌రించి మాట్లాడేటప్పుడు మాస్క్‌కు నోటికి మ‌ధ్య తగినంత ఖాళీ స్థలం ఉంటుంది. ఈ త‌ర‌హా కొత్త  మాస్క్‌లను భారీస్థాయిలో ఉత్పత్తి చేసేందుకు బెంగళూరు కేంద్రంగా ప‌ని చేస్తున్న ఒక‌ సంస్థకు సీఈఎన్ఎస్ఈ త‌ర‌హా టెక్నాల‌జీని బ‌దిలీ చేసింది.  
క్రిములను నిష్క్రియం చేసేలా త‌యారీ..
ఈ బృందం రూపొందించిన సుఖవంత‌మైన ఫిట్ మాస్క్ మాట్లాడేట‌ప్పుడు ఎలాంటి అవ‌రోధం ఎదుర‌వ‌కుండా ప్రసంగ వక్రీకరణకు దారి తీయ‌ని విధంగా అద్దాల మీద ఫాగింగ్‌న‌కు వీలు లేకుండా త‌యారు చేశారు. దీనికి తోడు ఈ మాస్క్ చుట్టుపక్కల బాగా ప్యాక్ చేసి ఉన్నందున‌ శ్వాసించేటప్పుడు ఎలాంటి లీకేజీకి తావులేకుండా ఇది ఫిట్‌గా ఉంటుంది. ఇందులో మ‌రో ముఖ్యమైన ప్రయోజనం ఏమిటంటే అధిక శ్వాసక్రియకు కూడా ఇది ఎలాంటి అసౌకర్యం లేకుండా అనుమతిస్తుంది. ఈ బృందంలోని పరిశోధకులు మాస్క్ త‌యారీకి గాను ఫాబ్రిక్ పొరలను ఎన్నుకున్నారు. ఫాబ్రిక్ యొక్క ట్రైబోఎలెక్ట్రిక్ స్వభావం కారణంగా అవి తేలికపాటి ఘర్షణకు
లోనై ఫ‌లితంగా వెలువ‌డే విద్యుత్ శ‌క్తి ద్వారా వ్యాధికారక క్రిములను నిష్క్రియం చేసే అవకాశం ఉంది. ఈ కొత్త మాస్క్ యొక్క అధునాతన స్థాయి పరీక్షలు జరుగుతున్నాయి.
సౌల‌భ్య‌క‌ర‌మైన మాస్క్‌లు అవ‌స‌రం..
"మాస్క్‌ల త‌యారీ విష‌యంలో కొన్ని ప్రామాణిక‌మైన డిజైన్ల‌ను మించి ఎవ్వ‌రూ ఎక్కువగా శ్ర‌ద్ధ చూప‌డం లేదు.. కోవిడ్‌-19 నుంచి ర‌క్ష‌ణనిచ్చేలా ఎక్కువ గంట‌లు ధ‌రించేందుకు కూడా సౌల‌భ్యంగా ఉండేలా స‌మ‌ర్థ‌తా రూపక‌ల్ప‌నతో త‌యారు చేసిన‌ మాస్క్‌లు ఇప్పుడు అవ‌స‌రం. మంచి డిజైన్ అంటే అంచుల చుట్టూ శుద్ధి కాబ‌డని గాలి చొరబాటు మరియు లీకేజీ భావనను తగ్గించాలి, ఇదే స‌మ‌యంలో మాస్క్‌ను ధ‌రిస్తే శ్వాస తీసుకొనేప్పుడు, మాట్లాడేట‌ప్పుడు మ‌రింతగా సౌల‌భ్యాన్ని క‌లిగించేలా ఉండాలి" అని డీఎస్టీ కార్య‌ద‌ర్శి ప్రొఫెసర్ అశుతోష్ శర్మ అన్నారు.
రోజుకు ల‌క్ష మాస్క్‌లను ఉత్పత్తి చేసి విక్ర‌యం..‌
కోవిడ్‌- 19 కేసులు పెరుగుతున్న నేప‌థ్యంలో సాధార‌ణ ప్రజానికం త‌ప్ప‌క ఫేస్ మాస్క్‌లను వాడాలంటూ  సూచిస్తున్నారు. వైద్య రంగంలోని ఆరోగ్య సంరక్షణ నిపుణులు ప్రత్యేకమైన మరియు అధిక సాంకేతిక నాణ్యత గల వైద్య మాస్క్‌ల‌ను ఉపయోగిస్తున్న‌ప్ప‌టికీ..  సాధారణ ప్రజలు త‌క్కువ వడపోత సామర్థ్యం క‌లిగిన మాస్క్‌లు ద‌రిస్తే స‌రిపోతుంది. ఎక్కువ గంటలు ధరించమని ప్రజలను ప్రోత్సహించడానికి వీలుగా అవి సౌకర్యంగా ఉండాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది. కొన్ని దశాబ్దాల నుంచి బెంగ‌ళూరు కేంద్రంగా ప‌ని చేస్తున్న వస్త్ర సంస్థ కామెల్లియా క్లోతింగ్ లిమిటెడ్ సంస్థ‌‌కు సీఈఎన్ఎస్ ఈ అత్యాధునిక మాస్క్ త‌యారీ టెక్నాలజీని బదిలీ చేసింది. భారతదేశం అంతటా విస్త‌రించి ఉన్న త‌మ వివిధ పంపిణీ మార్గాల ద్వారా రోజుకు లక్ష మాస్క్‌ల‌ను ఉత్పత్తి చేసి విక్రయించాలని ఈ కంపెనీ భావిస్తోంది. 

 

*****

 

 


(Release ID: 1626440) Visitor Counter : 245