రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

అంఫన్‌ సహాయక చర్యలు చేపట్టేందుకు పూర్తిస్థాయి సన్నద్ధతలో వాయుసేన

అవసరమైన సామగ్రి, సిబ్బంది సహా 25 ఎయిర్‌క్రాఫ్టులు, 31 హెలికాఫ్టర్లు మోహరింపు

Posted On: 22 MAY 2020 7:30PM by PIB Hyderabad

అంఫన్‌ సూపర్‌ సైక్లోన్‌ కారణంగా అతలాకుతలమైన భారతదేశ తూర్పు ప్రాంతంలో సహాయ కార్యక్రమాలు చేపట్టడానికి భారత వాయుసేన పూర్తి సన్నద్ధతతో ఉంది. మానవతా సాయం, విపత్తు ఉపశమనం ‍(హెచ్‌ఏడీఆర్‌) కార్యక్రమంలో భాగంగా సహాయ చర్యలు చేపట్టనుంది. 25 ఫిక్స్‌డ్‌ వింగ్‌ ఎయిర్‌క్రాఫ్టులు, 31 హెలికాఫ్టర్లు ఇందుకు కేటాయించింది.

    సహాయ చర్యలు చేపట్టడానికి అవసరమైన పరికరాలు, సామగ్రితో ఈ ఎయిర్‌క్రాఫ్టులు, హెలికాఫ్టర్లు సిద్ధంగా ఉన్నాయి. వివిధ భారత వాయుసేన స్థావరాల వద్ద సిబ్బంది సహా వీటిని మోహరించారు. వాయుసేన హెడ్‌ క్వార్టర్స్‌లో సంక్షోభ నిర్వహణ విభాగాన్ని ఏర్పాటు చేశారు. స్థానిక ప్రభుత్వాలు, ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలతో ఈ విభాగం ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటోంది.

    పుణె, అరక్కోణంలో ఉన్న నాలుగు ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలను రెండు సి-130 విమానాల ద్వారా కోల్‌కతాకు తీసుకెళ్లారు. సహాయ చర్యలను చేపట్టేందుకు అవసరమైన 8.6 టన్నుల బరువైన భారీ సామగ్రి, యంత్రాలను కూడా ఈ విమానాల్లో కోల్‌కతా చేర్చారు.



(Release ID: 1626299) Visitor Counter : 164