భారత పోటీ ప్రోత్సాహక సంఘం

ఇమామి సిమెంట్ లిమిటెడ్‌ను నువొకో విస్టాస్ కార్పొరేషన్ లిమిటెడ్ కొనుగోలు చేసేందుకు సీసీఐ ఆమోదం

Posted On: 21 MAY 2020 7:28PM by PIB Hyderabad

ఇమామి సిమెంట్ లిమిటెడ్‌ను నువొకో విస్టాస్ కార్పొరేషన్ లిమిటెడ్ కొనుగోలు చేసేందుకు గాను
కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ఆమోదం తెలిపింది. ఇమామి సిమెంట్ లిమిటెడ్ జారీ చేసిన మొత్తం మరియు చెల్లించిన వాటా మూలధనంలో 100 శాతం ను ఫుల్లీ డైలూట్ ప్రాతిపదికన నువోకో విస్టాస్ కార్పొరేషన్ లిమిటెడ్ కొనుగోలు చేసేలా స‌మ‌ర్పించిన ప్ర‌తిపాద‌న‌కు  సీసీఐ త‌న ఆమోదం తెలిపింది. ప్రతిపాదిత ఈ కొనుగోలు నందు నువొకో విస్టాస్ కార్పొరేషన్ లిమిటెడ్ (“ఎన్‌వీసీఎల్ ”) ఫుల్లీ డైలూట్ ప్రాతిపదికన, ఇమామి సిమెంట్ లిమిటెడ్ (“ ఈసీఎల్‌”) యొక్క మొత్తం జారీ చేసిన మరియు చెల్లించిన వాటా మూలధనంలో 100 శాతం మొత్తం కొనుగోలుకు సంబంధించినది. ఎన్‌వీసీఎల్ అనేది నిర్మా ప్రమోటర్ గ్రూప్ సంస్థ. ఇది ప్రస్తుతం (i) ఛత్తీస్‌గ‌ఢ్‌,  (ii) జార్ఖండ్, (iii) పశ్చిమ బెంగాల్, (iv) రాజస్థాన్ మరియు (v) హర్యానా రాష్ట్రాల్లో సిమెంట్ తయారీ యూనిట్లను నిర్వహిస్తోంది. పోర్ట్ ల్యాండ్ పోజోలానా సిమెంట్, పోర్ట్ ల్యాండ్ స్లాగ్ సిమెంట్ మరియు ఆర్డినరీ పోర్ట్ ల్యాండ్ సిమెంటుతో సహా వివిధ రకాల గ్రే సిమెంటుల‌ తయారీ మరియు అమ్మకం వ్యాపారాలలోనూ ఈ సంస్థ నిమగ్నమైంది. నిర్మాణంలో వినియోగించే వివిధ రసాయనాలు, వాల్ పుట్టీ మరియు కవర్ బ్లాక్స్ వంటి కొన్ని ఇతర విలువ-ఆధారిత ఉత్పత్తుల అమ్మకంలో కూడా ఇది నిమగ్నమై ఉంది. ఈసీఎల్ సంస్థ‌ ఇమామి గ్రూపులో ఒక భాగం (i) పశ్చిమ బెంగాల్, (ii) ఛత్తీస్‌గఢ్‌, (iii) బీహార్ మరియు (iv) ఒడిశా రాష్ట్రాల్లో ఈ సంస్థ సిమెంట్ తయారీ యూనిట్లను కలిగి ఉండ‌డంతో పాటు వాటిని నిర్వహిస్తుంది. పోర్ట్ ల్యాండ్ పోజోలానా సిమెంట్, పోర్ట్ ల్యాండ్ స్లాగ్ సిమెంట్, ఆర్డినరీ పోర్ట్ ల్యాండ్ సిమెంట్ మరియు సాధార‌ణ‌ సిమెంట్ కాంక్రీటు అనగా మిశ్రమ సిమెంటుతో సహా వివిధ రకాల గ్రే సిమెంటుల తయారీ మరియు అమ్మకంలో కూడా ఇది నిమగ్నమైందని పేర్కొన్నారు. ఇది చిన్న పరిమాణంలో క్లింకర్ మరియు గ్రౌండ్ గ్రాన్యులేటెడ్ బ్లాస్ట్ ఫర్నేస్ స్లాగ్‌ను కూడా తయారు చేసి విక్రయిస్తుంది. ఈ ఆమోదానికి సంబంధించిన పూర్తి వివరణాత్మక‌మైన సీసీఐ ఆదేశాలు వెలువ‌డాల్సి ఉంది. 

 



(Release ID: 1625911) Visitor Counter : 221