భూ శా స్త్ర మంత్రిత్వ శాఖ

తుఫానుగా మారి (ఈ రోజు 12 గంట‌ల స‌మ‌యానికి) బంగ్లాదేశ్‌‌పై కేంద్రీకృత‌మైన అతి తీవ్ర తుఫాను ‘ఆంఫాన్’

Posted On: 21 MAY 2020 1:26PM by PIB Hyderabad

అతి తీవ్ర తుఫాను ‘ఆంఫాన్’ (ఆం-ఫన్‌గా ఉచ్ఛ‌రిస్తున్నారు) గ‌త ఆరు గంట‌ల వ్య‌వ‌ధిలో కాస్త బ‌ల‌హీన‌ప‌డి తుఫానుగా మారింది. గంట‌కు 10 కిలో మీటర్ల వేగంతో ఉత్తర-ఈశాన్య దిశగా ఇది కదిలింది. భార‌త ప్ర‌మాణిక కాలమాన ప్ర‌కారం ఇది ఈ రోజు (21వ తేదీ మే, 2020) 08.30 గంట‌ల స‌మ‌యంలో ఇది బంగ్లాదేశ్‌పై కేంద్రీకృత‌మై ఉంది. కోల్‌క‌తాకు ఉత్త‌ర- ఈశాన్యంలో దాదాపు 270 కిలోమీట‌ర్ల దూరంలో 24.7° ఉత్త‌ర అక్షాంశ‌ము మరియు 89.5° తూర్పు రేఖాంశాల మ‌ధ్యన‌ ఇది కేంద్రీకృత‌మై ఉంది. ధుబ్రికి దక్షిణాన 150 దూరంలోనూ, రంగ్‌పూర్ (బంగ్లాదేశ్) కి ద‌క్షిణ‌-ఆగ్నేయంగా 110 కిలోమీటర్ల‌ దూరంలోనూ ఇది కేంద్రీకృత‌మై ఉంది. ఇది క్ర‌మంగా ఉత్తర- ఈశాన్యపు దిశగా ముందుకు సాగుతోంది. రానున్న మూడు గంటలలో ఇది తీవ్ర వాయుగుండంగా మారే అవ‌కాశం ఉంది. ఆ తరువాత 06 గంటలలో చాలా ఇది మ‌రింత బలహీనపడి వాయుగుండంగా మారే అవకాశం క‌నిపిస్తోంది.


తుఫాను క‌ద‌లిక‌ల అంచ‌నాలు మ‌రియు తీవ్ర‌త వివ‌రాలు ఈ కింది ప‌ట్టిక‌లో ఇవ్వ‌బ‌డ్డాయిః

తేదీ, స‌మ‌యం (భార‌త ప్రామాణిక కాల‌మానం‌ ప్ర‌కారం) స్థితి (ఉత్త‌ర అక్షాంశం మ‌రియు తూర్పురేఖాంశం మ‌ధ్య‌)‌ గరిష్ట స్థిరమైన
ఉపరితల గాలి వేగం (గంట‌కు కి.మీట‌ర్ల‌లో)
తీవ్ర‌త‌ను బ‌ట్టి తుఫాను  వ‌ర్గీక‌ర‌ణ‌
21.05.20/0830 24.7/89.5 60-70 నుంచి 80 వేగంతో కూడిన ఈదురు గాలులు

తుఫాను

21.05.20/1130 25.3/89.8 50-60 నుంచి 70 వేగంతో కూడిన ఈదురు గాలులు

తీవ్ర వాయుగుండం

21.05.20/1730 26.5/90.5 30-40 నుంచి 50 వేగంతో కూడిన ఈదురు గాలులు

వాయుగుండం

 

(1) భారీ వర్షపాతం హెచ్చరిక:
అస్సాం & మేఘాలయ: ఈ రోజు (మే 21వ తేదీ, 2020 న‌‌) చాలా ప్రదేశాలలో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షపాతం న‌మోద‌య్యే అవ‌కాశం ఉంది. దూరంగా ఉండే ప‌లు మారుమూల ప్రదేశాలలో భారీ నుండి అతి భారీ మరియు తీవ్ర వ‌ర్షాలు (≥20 సెం.మీ) ప‌డే అవ‌కాశం ఉంది.  
అరుణాచల్ ప్రదేశ్: ఈ రోజు (మే 21వ తేదీ, 2020 న‌‌) దూరంగా ఉండే ప‌లు మారుమూల ప్రదేశాలలో భారీ నుండి అతి భారీ వ‌ర్షాలు ప‌డే అవ‌కాశం ఉంది. చాలా ప్రదేశాలలో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షపాతం న‌మోద‌య్యే అవ‌కాశం ఉంది. 


(2) ఈదురు గాలుల హెచ్చరికః
పశ్చిమ అస్సాం & పశ్చిమ మేఘాలయల‌లో గంట‌కు 50 నుండి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తున్నాయి. సాయంత్రానికి ఇవి క్ర‌మంగా 70 కిలోమీటర్ల వాయు వేగాన్ని అందిపుచ్చుకొనే అవ‌కాశం ఉంది. ఆ తరువాత క్రమంగా ఇవి బ‌ల‌హీన ప‌డి తగ్గుముఖం ప‌ట్టే అవ‌కాశం ఉంది.
వ‌ర్గీక‌ర‌ణ‌

 

[నవీకరించిన తాజా స‌మాచారం కోసం దయచేసి www.rsmcnewdelhi.imd.gov.in మరియు www.mausam.imd.gov.in వెబ్‌సైట్ల‌ను సందర్శించండి.

(నవీకరించబడిన వివ‌రాలు, గ్రాఫిక్స్‌ను ఈ కింది లింక్ ద్వారా వీక్షించండి)



(Release ID: 1625791) Visitor Counter : 162


Read this release in: English , Urdu , Punjabi , Tamil