మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ
సీబీఎస్ఈ రూపొంచిందిన మూడు కరదీపికలను (హ్యాండ్ బుక్) విడుదల చేసిన కేంద్ర హెచ్ఆర్డీ మంత్రి
- విద్యార్థుల నిమిత్తం సైబర్ సెక్యూరిటీ, 21వ శతాబ్దపు నైపుణ్యాలు మరియు ప్రిన్సిపాల్స్ హ్యాండ్‌బుక్‌ల విడుదల
Posted On:
20 MAY 2020 5:53PM by PIB Hyderabad
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) రూపొందించిన మూడు కరదీపికలను (హ్యాండ్ బుక్) కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి శ్రీ రమేష్ పోఖ్రియాల్ 'నిశాంక్' ఈ రోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా న్యూఢిల్లీలో విడుదల చేశారు. విలువల- ఆధారిత ప్రపంచ విద్యా ప్రమాణాలను అవలంబించడానికి వీలుగా బోర్డు తీసుకున్న చర్యలతో వీటిని తయారు చేశారు. ఈ మూడు బుక్‌లెట్లను విడుదల చేస్తూ 'సైబర్ సేఫ్టీ-ఎ హ్యాండ్‌బుక్ ఫర్ స్టూడెంట్స్ ఫర్ సెకండరీ & సీనియర్ సెకండరీ స్కూల్స్' హ్యాండ్‌బుక్ 9 వ తరగతి నుండి పన్నెండవ తరగతి చదువుతున్న విద్యార్థులలో సైబర్ భద్రత గురించి అవగాహన కల్పించేందుకు వీలుగా తయారు చేసినట్టు కేంద్ర మంత్రి తెలియజేశారు. ఇంటర్నెట్ మరియు ఇతర డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లను తరచుగా ఉపయోగించే టీనేజర్‌లు వివిధ రకాల భద్రతా ప్రమాదాలను ఎదుర్కొంటున్నారని అలాంటి వారికి ఈ బుక్‌లెట్ సరైన మార్గదర్శినిగా నిలుస్తుందని ఆయన అన్నారు. 'ఇన్ పర్స్యూట్ ఆఫ్ ఎక్సలెన్స్- ఎ హ్యాండ్‌బుక్ ఫర్ ప్రిన్సిపాల్స్' అనే బుక్‌లెట్ పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు సీబీఎస్ఈ బోర్డు వ్యవస్థలను గురించి మరియు ఇతర ఉపయోగకరమైన సమాచారం గురించి అవగాహన కల్పిస్తుందని శ్రీ పోఖ్రియాల్ తెలియజేశారు. ఇది పాఠశాలలు మరియు సీబీఎస్ఈ పరిపాలన వ్యవస్థ మధ్య మెరుగైన సమన్వయాన్ని చేకూర్చుతుందని అన్నారు. మూడవ బుక్‌లెట్ '21 వ సెంచరీ స్కిల్స్: ఎ హ్యాండ్‌బుక్ ' ద్వారా సీబీఎస్ఈ ప్రతి ఒక్కరికీ 21 వ శతాబ్దపు నైపుణ్యాల గురించి అవగాహన కల్పిస్తుందని, దైనందిన జీవితంలో వాటిని మెరుగ్గా ఉపయోగించుకునేలా చేస్తుందని వివరించారు. దేశంలోని విద్యా వ్యవస్థలోని భాగస్వామ్య పక్షాల వారందరికీ మేటి ప్రయోజనం చేకూర్చేలా ఈ బుక్‌లెట్లను రూపొందించడానికి సీబీఎస్ఈ చేసిన కృషిని మంత్రి శ్రీ పోఖ్రియాల్ ఈ సందర్భంగా ప్రశంసించారు. సైబర్ సెక్యూరిటీపై మేటి అవగాహన పెంపొందించడానికి, సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి, నైపుణ్యాలను, నాయకత్వ అనుభవాన్ని పెంపొందిచడానికి ఈ బుక్‌లెట్‌లు సహాయపడగలవని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.
సైబర్ సెక్యూరిటీ పై రూపొందించిన హ్యాండ్‌బుక్‌ను వీక్షించేందుకు గాను ఈ కింది లింక్‌ను క్లిక్ చేయండి: :http://cbseacademic.nic.in/web_material/Manuals/Cyber_Safety_Manual.pdf
ప్రిన్సిపాల్‌ల హ్యాండ్‌బుక్‌ను వీక్షించేందుకు గాను ఈ కింది లింక్‌ను క్లిక్ చేయండి:
http://cbseacademic.nic.in/web_material/Manuals/Principals_Handbook.pdf
'21 వ సెంచరీ స్కిల్స్: ఎ హ్యాండ్‌బుక్' వీక్షించేందుకు గాను ఈ కింది లింక్‌ను క్లిక్ చేయండి:
: http://cbseacademic.nic.in/web_material/Manuals/21st_Century_Skill_Handbook.pdf
(Release ID: 1625547)
Visitor Counter : 258