ఆర్థిక సంఘం
ఫిస్కల్ కన్సాలిడేషన్ రోడ్ మ్యాప్‌నకు సంబంధించి రేపు జరగనున్న15 వ ఫైనాన్స్ కమిషన్ కమిటీ తొలి సమావేశం
Posted On:
20 MAY 2020 4:35PM by PIB Hyderabad
ఫిస్కల్ కన్సాలిడేషన్ రోడ్ మ్యాప్‌పై15 వ ఫైనాన్స్ కమిషన్ కమిటీ తొలి సమావేశం రేపు అంటే 21 మే 2020న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరుగుతుంది. ఈ 15 వ ఫైనాన్స్ కమిషన్ కు నివేదించిన అంశాలలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన ఫిస్కల్ కన్సాలిడేషన్ రోడ్‌మ్యాప్ ఒకటి. కేంద్ర,రాష్ట్రప్రభుత్వాలకు సంబంధించి వాటి వాటి రుణ, లోటుస్థాయిలను పరిగణనలోకి తీసుకుని దీనిని రూపొందించాలి. అలాగే, ఈక్విటీ, సమర్థత, పారదర్శకత, వంటి సూత్రాలను పరిగణనలోకి తీసుకుంటూ సమ్మిళిత అభివృద్ధికి బాటలు వేయవలసి ఉంది. ఇందుకు అనుగుణంగా దీని ముందుంచిన పరిశీలనాంశాలకు అనుగుణంగా 15 వ ఫైనాన్స్ కమిషన్ కేంద్ర ప్రభుత్వ ఫిస్కల్ కన్సాలిడేషన్ రోడ్ మ్యాప్‌పై సమీక్ష జరిపేందుకు 15 వ ఫైనాన్స్ కమిషన్ ఛైర్మన్ శ్రీ ఎన్.కె.సింగ్ అధ్యక్షతన ఒక కమిటీని 2020 మార్చి 18న ఏర్పాటు చేసింది..
2020-21 సంవత్సరానికి సంబంధించి 15 వ ఫైనాన్స్‌కమిషన్ నివేదికపై కేంద్రప్రభుత్వం ఇప్పటికే చర్యలు తీసుకుంది. పైన పేర్కొన్న పరిశీలనాంశాల ప్రకారం 2021-22 నుంచి 2025-26 వరకు ప్రభుత్వానికి సంబంధించి ఫిస్కల్ కన్సాలిడేషన్ రోడ్ మ్యాప్‌ను రూపొందించాల్సి ఉంది. అయితే కోవిడ్ -19 వైరస్ వ్యాప్తి వల్ల ఏర్పడిన అసాధారణ పరిస్థితులు, దీని ఫలితంగా కేంద్ర రాష్ట్రప్రభుత్వాలపై ఏర్పడిన తప్పని ఆర్థిక భారం కారణంగా దీనిని రూపొందించడం సంక్లిష్టంగా మారింది. ప్రస్తుత పరిస్థితులకు స్పందిస్తూ కేంద్ర ప్రభుత్వం జిడిపిలో రెండు శాతం పాయింట్ల మేరకు అదనపు అప్పు తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వాలకు అనుమతి ఇచ్చింది. ఇప్పటికే వీటికి అందుబాటులో ఉన్న 3 శాతానికి ఇది అదనం.
ప్రస్తుత కోశ పరిస్థితులను పరిగణనలోకి తీసుకునేందుకు, అలాగే ఇందుకు సంబంధించి ముందుకు వెళ్ళే మార్గం రూపొందించేందుకు పైన పేర్కొన్న కమిటీ రేపు ఆన్‌లైన్ సమావేశాన్ని నిర్వహిస్తోంది. ఈ సమావేశానికి ఛైర్మన్ శ్రీ ఎన్.కె.సింగ్, 15వ ఫైనాన్స్ కమిషన్ సభ్యులు శ్రీ అజయ్ నారాయణ్ ఝా, డాక్టర్ అనూప్ సింగ్, ఛీఫ్ ఎకనమిక్ అడ్వయిజర్ డాక్టర్ కృష్ణమూర్తి సుబ్రమణియన్, కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ శ్రీమతి సోమా రాయ్ బర్మన్, ఆర్థిక మంత్రిత్వశాఖలో సంయుక్త కార్యదర్శి శ్రీ రజత్ కుమార్ మిశ్ర, తమిళనాడు ప్రభుత్వ అదనపు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ ఎస్. కృష్ణన్, పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ అనిరుథ్ తివారి, ప్రముఖ విశ్లేషకులు డాక్టర్ సాజిద్ జెడ్ చినాయ్, డాక్టర్ ప్రాచి మిశ్రా పాల్గొంటారు.
(Release ID: 1625542)
Visitor Counter : 224