సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ

జే అండ్ ‌కే డొమిసిల్ రూల్స్ నోటిఫికేషన్ జ‌మ్మూ కాశ్మీర్‌లో న‌వ‌ శకానికి నాంది పలికిందిః కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్

Posted On: 19 MAY 2020 7:12PM by PIB Hyderabad

జమ్మూ & కాశ్మీర్ (జే అండ్ ‌కే) డొమిసిల్ రూల్స్ నోటిఫికేషన్‌తో జమ్మూ కాశ్మీర్‌లో న‌వ శకం ప్రారంభమైనట్టుగా కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అభివ‌ర్ణించారు. ఈ రోజు మంత్రి ఇక్క‌డ మాట్లాడుతూ తాజా దిద్దుబాటు దేశంలో సమానత్వపు సూత్రం, ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యం నిబంధనలకు అనుగుణంగా చేప‌ట్టిన చ‌ర్య అని రానున్న చ‌రిత్ర‌లో నిరూపిత‌మ‌వుతుంద‌ని ఆయ‌న అన్నారు.
హోం మంత్రి అమిత్‌షాకు అభినంద‌న‌లు..
జమ్మూ & కాశ్మీర్ డొమిసిల్ రూల్స్ నోటిఫికేషన్ గ‌త 70 సంవత్సరాలుగా చరిత్ర యొక్క తీవ్ర గర్భపాతాన్ని దూరం చేసిందని మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అభివ‌ర్ణించారు. మంగ‌ళ‌వారం మీడియాను ఉద్దేశించి డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ ఈ దిద్దుబాటు చ‌ర్య గ‌త కొన్ని సంవ‌త్స‌రాలుగా వేచి ఉంద‌ని అన్నారు. బహుశా భారతదేశ ప్రధానిగా శ్రీ నరేంద్ర మోడీ బాధ్యతలు స్వీకరించినప్పుడే ఈ దిద్దుబాటు జ‌ర‌గాల‌న్న‌ది ఆ దేవుని చిత్తం కావొచ్చ‌ని మంత్రి అన్నారు. పూర్తి స్ప‌ష్ట‌త‌తో ఈ దిద్దుబాటు చ‌ర్య‌ల‌కు సంబంధించిన క‌స‌ర‌త్తును నిర్వ‌హించిన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ను డాక్టర్ జితేంద్ర సింగ్ అభినందించారు. జమ్మూ కాశ్మీర్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు మూడు తరాలకు చెందిన‌ ప్రజలకు న్యాయంగా, గౌరవంతో జీవించే హక్కు పూర్తిగా నిరాకరించబడిందని ఆయ‌న అన్నారు.
ఇదో గొప్ప విముక్తి ప్ర్ర‌క్రియ‌..
మ‌న‌ జీవితకాలంలోనే ఇంత గొప్ప విముక్తి ప్ర్ర‌కియ జ‌ర‌గ‌డం ఎంతో ఆనందంగా ఉంద‌ని ఆయ‌న వివ‌రించారు. ఈ చ‌ర్య‌ భవిష్యత్ తరాలకు ఒక దీవెన వంటిది అనే అంశాన్ని రుజువు చేస్తుందని డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. ఈ మొత్తం ప్ర్ర‌క్రియ ప‌ట్ల మంత్రి త‌న పూర్తి సంతృప్తిని వ్య‌క్తం చేశారు. త‌న సమకాలీనులలో కొంతమంది ఈ స్వేచ్ఛా ప్ర్ర‌కియ క‌సర‌త్తులో పాలుపంచుకొనే అవ‌కాశం ల‌భించింద‌ని అన్నారు. పూర్తిస్థాయిలో కాక‌పోయినా కనీసం స్వ‌ల్ప మొత్తంలోనైనా ఇందులో పాలుపంచుకొనే అవ‌కాశం ల‌భించ‌డం ప‌ట్ల ఆయన త‌న సంతృప్తి వ్యక్తం చేశారు.
పశ్చిమ పాకిస్థాన్ శరణార్థులు మరియు పీజేకే నుండి స్థానభ్రంశం చెందిన వ్యక్తుల‌ చట్టబద్ధమైన హక్కులను తాజా చ‌ర్య‌ల‌తో పునరుద్ధరించ‌బ‌డిన‌ట్టుగా మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు.
ద‌శాబ్దాల వివ‌క్ష ర‌ద్దు చేయ‌బ‌డింది..
అనేక దశాబ్దాల వివక్ష రద్దు చేయ‌బ‌డింద‌ని అన్నారు. ఈ చర్యను వ్యతిరేకిస్తున్న వారు.. గ‌డిచిన 70 సంవత్సరాలుగా వివక్ష రాజకీయాలతో అభివృద్ధి చెందుతున్నారనే ఆరోపణలకు రుజువు చేసుకొనేలా తమనుతాము బహిర్గతం చేసుకుంటున్నార‌ని మంత్రి దుయ్య‌బ‌ట్టారు. ఐఏఎస్, ఐపీఎస్‌లతో సహా ఆల్ ఇండియా సర్వీసెస్ ఆఫీసర్లు జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో 30 నుంచి 35 సంవత్సరాలు ప‌ని చేసి ఇక్క‌డ అభివృద్ధికి గాను త‌మ జీవితాల‌ను అంకితం చేసిన వారు త‌మ స‌ర్వీసులు ముగియ‌గానే అక్క‌డ నుంచి సర్దుకొని తిరిగి బయలు దేరాల్సిన ప‌రిస్థితి ఉండేది అన్నారు. ఎంతో సేవ చేసిన రాష్ట్రంలో ఉండేందుకు వీలులేకుండా అక్క‌డ స్థిరపడటానికి మరెక్కడో స్థలం కోసం వెతుక్కోవాల్సిన విచిత్ర‌మైన ప‌రిస్థితి ఉండేద‌ని ఆయ‌న తెలిపారు. చాలా రాష్ట్రాలు మరియు యుటీల ఏర్పాట్ల‌కు ఇది విరుద్ధంగా ఉంద‌ని ఆయ‌న తెలిపారు. చాలా రాష్ట్రాలు మరియు యుటీలలో అక్కడ స్టేట్ కేడర్‌కు చెందిన ‌అఖిల భారత సర్వీస్ ఆఫీసర్లు స్థిరపడటానికి పూర్తిస్థాయిలో అనుమతించబడటమే కాక, వారికి త‌గిన‌ ప్లాట్లు కూడా మంజూరు చేస్తార‌ని ఆయ‌న తెలిపారు.
ప్ర‌పంచ భార‌తావ‌ని అభివృద్ధి దిశ‌గా..
జమ్మూ & కాశ్మీర్లో పాఠశాల విద్య అభ్యసించిన ఈ అధికారుల పిల్లలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని మంత్రి తెలిపారు. వీరికి ఉన్నత విద్యా సంస్థల్లో ప్రవేశానికి దరఖాస్తు చేయకుండా నిషేధించబ‌‌డే వార‌ని మంత్రి తెలిపారు. డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ తాజా చ‌ర్య‌తో మన పిల్లలకు విస్తృత బహిర్గతమైన‌ మరియు సామర్థ్యాన్ని పెంపొందించే అవకాశంగా చూడాల‌ని అన్నారు. తద్వారా వారు ప్రపంచ భార‌తావ‌ని అభివృద్ధి ప‌ర‌చ‌డానికి తమను తాము సిద్ధం చేసుకొనే అవ‌కాశం ఉంటుందని మంత్రి వివరించారు. 



(Release ID: 1625232) Visitor Counter : 216