ఆర్థిక మంత్రిత్వ శాఖ

వేలం అమ్మ‌కం (రీ-ఇష్యూ) ద్వారా వివిధ ర‌కాల ప్ర‌భుత్వ సెక్యూరిటీల విక్ర‌యం

- బ్యాంక్ ఆఫ్ ఇండియా కోర్ బ్యాంకింగ్ సొల్యూషన్ (ఈ-కుబెర్) వ్యవస్థపై బిడ్లకు ఆహ్వానం
- ఈనెల 22వ తేదీన ఆర్‌బీఐ ముంబ‌యి కార్యాల‌యం బహుళ ధరల పద్ధతిలో వేలం పాట‌

Posted On: 18 MAY 2020 6:22PM by PIB Hyderabad

భార‌త ప్ర‌భుత్వం వివిధ ప్ర‌భుత్వ స్టాక్‌ల అమ్మ‌కాన్ని (రీ-ఇష్యూ) ప్ర‌క‌టించింది. వాటి వివ‌రాలు ఇలా ఉన్నాయి (1) ధ‌ర‌ల ఆధారిత వేలం విధానంలో రూ.3000 కోట్ల (నామిన‌ల్‌) విలువైన ‘5.09 శాతం ప్రభుత్వ స్టాక్, 2022’ అమ్మకం చేప‌ట్ట‌నున్నారు. (2) ధ‌‌ర‌ల ఆధారిత వేలం విధానంలో రూ.18,000 కోట్ల (నామిన‌ల్‌) విలువైన ‘5.79 శాతం ప్రభుత్వ స్టాక్, 2030’ అమ్మకం చేప‌ట్ట‌నున్నారు. (3) మ‌రోవైపు రూ.4,000 కోట్ల (నామిన‌ల్‌) భార‌త ప్ర‌భుత్వ ఫ్లోటింగ్ రేట్ బాండ్లు-2031ల‌ను ధ‌ర‌ల ఆధారిత వేలం విధానంలో విక్ర‌యించ‌నున్నారు (4)
రూ.5000 కోట్ల (నామిన‌ల్‌) మొత్తానికి స‌మాన‌మైన ‘7.19 శాతం ప్రభుత్వ స్టాక్, 2060’
ల‌ను ధ‌ర‌ల ఆధారిత వేలం ద్వారా విక్ర‌యించ‌నున్నారు. పైన పేర్కొన్న ఒకటి లేదా అంతకంటే ఎక్కువ సెక్యూరిటీలు ఒక్కొక్కదానికి గాను అద‌నంగా మ‌రో రూ.2,000 కోట్ల వరకు అదనపు చందాను త‌నవ‌ద్ద ఉంచుకొనే అవకాశం కేంద్ర ప్ర‌భుత్వానికి ఉండ‌నుంది. ఈనెల 22వ తేదీ (శుక్ర‌వారం) ఫోర్ట్ ముంబ‌యిలో గ‌ల భార‌తీయ రిజ‌ర్వు బ్యాంక్ ముంబ‌యి కార్యాల‌యం బహుళ ధరల పద్ధతిని ఉపయోగించి ఈ వేలంపాట‌ను నిర్వహించనున్నారు. నాన్‌-కాంపిటిటివ్ బిడ్డింగ్ ఫెసిలిటీ ప‌థ‌కంలో భాగంగా అర్హత ఉన్న వ్యక్తులు మరియు సంస్థలకు గాను నోటిఫైడ్ చే సిన సొమ్ము మొత్తంలో 5 శాతం వరకు కేటాయించ‌బ‌డుతుంది. 2020 మే 22 న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కోర్ బ్యాంకింగ్ సొల్యూషన్ (ఈ-కుబెర్) వ్యవస్థపై వీటి వేలానికి గాను కాంపిటిటివ్ మరియు నాన్‌-కాంపిటిటివ్ బిడ్లను ఎలక్ట్రానిక్ రూపంలో సమర్పించాల్సి ఉంటుంది.
నాన్‌-కాంపిటిటివ్ బిడ్లను ఉదయం 10.30 నుంచి ఉదయం 11.00 మధ్య సమర్పించాలి.. ఇదే స‌మ‌యంలో కాంపిటిటివ్ బిడ్లను ఉదయం 10.30 నుంచి 11.30 మధ్యనే సమర్పించాల్సి ఉంటుంది. ఈ వేలం పాట ఫ‌లితాన్ని ఈ నెల 22వ తేదీన (శుక్ర వారం) ప్ర‌క‌టించ‌నున్నారు. ఈ వేలం విజేత‌లుగా నిలిచిన బిడ్డ‌ర్లు మే 26న (మంగ‌ళ‌వారం) త‌మ సొమ్మును చెల్లించాల్సి ఉంటుంది. రిజ‌ర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా జులై 24, 2018న‌ జారీ చేసిన స‌ర్క్యూల‌ర్ నంః
ఆర్‌బీఐ / 2018-19 / 25 కింద జారీ చేసిన మార్గ‌ద‌ర్శ‌కాల ప్ర‌కారం వెన్ ఇష్యూడ్ ట్రేడింగ్‌న‌కు ఆయా సెక్యూరిటీలు అర్హ‌మైన‌విగా నిలుస్తాయి.



(Release ID: 1624983) Visitor Counter : 228