పర్యటక మంత్రిత్వ శాఖ
పర్యాటక మంత్రిత్వ శాఖ "దేఖో అప్నా దేశ్" వెబ్‌నార్ సిరీస్ కింద ‘ఉత్తరాఖండ్ సింప్లీ హెవెన్’ పేరుతో 20 వ వెబ్‌నార్ సెషన్
Posted On:
18 MAY 2020 1:51PM by PIB Hyderabad
పర్యాటక మంత్రిత్వ శాఖ "దేఖో అప్నా దేశ్" వెబ్‌నార్ సిరీస్‌లో భాగంగా ‘ఉత్తరాఖండ్ సింప్లీ హెవెన్’ వెబ్‌నార్ సెషన్‌ను మే 16వ తేదీ నిర్వహించింది. "దేఖో అప్నా దేశ్" వెబ్‌నార్ సిరీస్‌లో ఇది 20 వ సెషన్. ఉత్తరాఖండ్ యొక్క రెండు ప్రాంతాలలో కేదర్ ఖండ్ (గర్హ్వాల్ ప్రాంతం) మరియు మను ఖండ్ (కుమావున్ ప్రాంతం) లో పర్యాటక ప్రత్యేకతలను గురించి ఈ సెషన్‌లో ప్రధానంగా వెల్లడించారు. వీటికి తోడు రాష్ట్రంలోని గంగోత్రి, యమునోత్రి, బద్రీనాథ్, కేదార్‌నాథ్, హేమ్‌ఖండ్ సాహిబ్ మరియు యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ ఆఫ్ వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ వంటి ప్రతిష్టాత్మకమైన పర్యటక ప్రాంతాలను గురించిన పలు విషయాలను కూడా ఇందులో స్పృశించారు. ఈ వెబ్‌నార్‌ను ప్రముఖ స్కాలర్, ఫుడ్ హిస్టారియన్, అంతర్జాతీయ సంబంధాల నిపుణుడు, జేఎన్‌యూ మాజీ ప్రొఫెసర్ డాక్టర్ పుష్ఫేష్ పంథ్, ప్రఖ్యాత రచయిత గణేష్ సెలి, ప్రముఖ ఫోటోగ్రాఫర్, ఉత్తరాఖండ్ చరిత్ర అథారిటి శశాంక్ పాండే, సర్టిఫైడ్ అవుట్‌బౌండ్ ట్రైనర్, ఆస్పెన్ అడ్వెంచర్స్ మేనేజింగ్ డైరెక్టర్ రిషికేశ్‌లు సమర్పించారు. ఈ ప్రత్యేక సెషన్‌ను పర్యాటక మంత్రిత్వ శాఖ అదనపు డైరెక్టర్ జనరల్ శ్రీమతి రూపీందర్ బ్రార్ మోడరేట్ చేశారు. సెషన్‌లో ఉత్తరాఖండ్ యొక్క అడ్వెంచర్ టూరిజం సంభావ్యతను గురించి ఇందులో ప్రధానంగా వివరించారు. రిషికేశ్ మరియు పిట్టోరాగ్ర్హల వద్ద నదీ తెప్పల సోయగాలు, రాష్ట్రంలో శీతాకాల క్రీడలకు గల సౌకర్యాలు తెహ్రీ డ్యామ్, కౌషని మరియు ఔలీ వద్ద స్కీయింగ్‌కు గల వెసులుబాటును ఇక్కడ వివరించారు. ట్రెచోప్తా మరియు పిండారి హిమానీనదంతో సహ ట్రెక్కింగ్ కోసం అందుబాటులో ఉన్న అసంఖ్యాక ఎంపికలను, రిషికేశ్‌లోని భారతదేశంలోనే ఎత్తైన బంగీ జంపింగ్ సౌకర్యం గురించి సమర్పకులు ప్రధానంగా ఈ సెషన్‌లో హైలైట్ చేశారు.
నేషన్‌పార్క్‌లతో కూడిన సమాచారం..
అడ్వెంచర్ కార్యకలాపాలతో పాటు దేశంలో పురాతన జాతీయ ఉద్యానవనం- జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్, రాజాజీ టైగర్ రిజర్వ్ మరియు నందా దేవి నేషనల్ పార్క్ యొక్క యునెస్కో సైట్ గురించి తెలిపారు. ప్రకృతిని ఉత్తమంగా అనుభవించే వివిధ ఎంపికలను గురించి ఈ సెషన్లో వివరించారు. హిమాలయన్ ప్రాంతం యొక్క పూల మరియు జంతు జాలం విశేషణాలను కూడా ఈ ప్రత్యేక సెషన్‌లో తెలియపరిచారు. గ్రామీణ పర్యాటకం సమర్పణ, మరియు అభివృద్ధి చేయడానికి మరియు అన్వేషించడానికి ఉత్తరాఖండ్‌లో అపారమైన అవకాశాలున్నాయని ఇందులో తెలిపారు. హోమ్‌స్టేలకు సంబంధించి ఉత్తమ ఎంపికలు, ఇందులో స్థానిక వంటకాలలో ఉత్తమమైన సేవలను అందించే ప్రజల నిజమైన ఆతిథ్యాన్ని అనుభవించవచ్చనే విషయాన్ని ఈ సెషన్‌లో ప్రధానంగా వివరించారు. అదనపు డైరెక్టర్ జనరల్ శ్రీమతి రూపీందర్ బ్రార్ ఉత్తరాఖండ్‌ను ‘దేవ్ భూమి’గా అభివర్ణించారు. అన్ని రకాల అభిరుచులు గల పర్యటకులను మంత్రముగ్దులను చేసే ప్రదేశం ఈ ఉత్తరాఖండ్ అని పేర్కొంటూ సెషన్‌ను ముగించారు. పవిత్రమైన మరియు మతపరమైన ప్రదేశం కావడం నుండి దాని స్వచ్ఛమైన రూపంలో గొప్ప జీవవైవిధ్యం కలిగిన సాహస భూమి అని అన్నారు. ఇది ఒక బహుముఖ గమ్యమని తెలిపారు.
19న ‘ఫోటోవాకింగ్ భోపాల్’ పేరుతో తదుపరి సెషన్..
ఎలక్ట్రానిక్స్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (ఎంఈఐటీవై) యొక్క నేషనల్ ఈ-గవర్నెన్స్ డివిజన్ (ఎన్ఈజీడీ) యొక్క క్రియాశీల సహకారంతో ఈ "దేఖో అప్నా దేశ్" వెబ్‌నార్ సిరీస్ సెషన్‌లను నిర్వహిస్తున్నారు. ఈ వెబ్‌నార్లను చూడలేకపోయిన వారి కోసం ఆయా సెషన్‌లు https://www.youtube.com /channel/UCbzIbBmMv tvH7d6Zo_ ZEHDA/featured అనే వెబ్‌లింక్‌లలో అందుబాటులో ఉండనుంది. దీనికి తోడు భారత ప్రభుత్వ పర్యాటక మంత్రిత్వ శాఖ యొక్క అన్ని సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో కూడా ఇవి అందుబాటులో ఉన్నాయి. వెబ్‌నార్ యొక్క తదుపరి ఎపిసోడ్ మే 19, 2020 మంగళవారం ఉదయం 11.00 గంటలకు షెడ్యూల్ చేయబడింది. ‘ఫోటోవాకింగ్ భోపాల్’ పేరుతో ఈ సెషన్ జరుగనుంది. ఆసక్తి కలిగిన వారు ఈ వెబ్‌నార్‌ను https://digitalindia- gov.zoom.us/webinar/register/WN_wLHXyRT GTrK3Vb-lj K8sxQ అనే లింక్‌పై క్లిక్ చేసుకొని రిజిస్టర్ చేసుకోవడం ద్వారా యాక్కెస్ చేయవచ్చు.
(Release ID: 1624885)
Visitor Counter : 328