గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ

రెరా యొక్క ప్రభావవంతమైన అమలు కొనుగోలుదారు మరియు విక్రేత మధ్య నమ్మకాన్ని పునరుద్ధరించగలదు: హర్దీప్ ఎస్. పురి

ప్రాజెక్టుల పూర్తిని నిర్ధారించడానికి గృహ కొనుగోలుదారుల ఆందోళనలను పరిష్కరించడం ప్రాథమిక లక్ష్యం : దుర్గా శంకర్ మిశ్రా

రెరా కింద 52,000 కంటే ఎక్కువ రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు & 40,517 రియల్ ఎస్టేట్ ఏజెంట్లు నమోదు అయ్యారు.

రేరా దినోత్సవం నిర్వహించడం జరిగింది.

Posted On: 16 MAY 2020 4:37PM by PIB Hyderabad

గృహనిర్మాణ మరియు పట్టణ వ్యవహారాల మంత్రి శ్రీ హర్దీప్ ఎస్ పూరి మాట్లాడుతూ, కొనుగోలుదారు మరియు విక్రేతల మధ్య నమ్మకాన్ని పునరుద్ధరించడం రెరా యొక్క ప్రధాన లక్ష్యాలలో ఒకటి అనీ,  రెరా యొక్క నిజమైన మరియు సమర్థవంతమైన అమలు ద్వారా మాత్రమే ఈ ట్రస్ట్ పునరుద్ధరించబడుతుందనీ అన్నారు. ఇది ఈ రంగంలో పేరుకుపోయిన ఇన్వెంటరీ భారాన్ని తగ్గించడంలో సహాయపడటమే కాకుండా, పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయడానికి డెవలపర్‌లకు అవసరమైన ఆర్థిక పరిపుష్టిని అందిస్తుందని ఆయన చెప్పారు. 

“రెరా 3 వ వార్షికోత్సవం” సందర్భంగా  రియల్ ఎస్టేట్ రంగానికి చెందిన వాటాదారులతో  ఆయన ఈ రోజు నిర్వహించిన వెబినార్ ‌లో మాట్లాడారు.  ఈ వెబినార్ లో - ఎమ్.ఓ.హెచ్.యు.ఏ. కార్యదర్శి శ్రీ దుర్గ శంకర్ మిశ్రా,  అదనపు కార్యదర్శి శ్రీ శివ దాస్ మీనా,  ఉత్తరప్రదేశ్ రియల్ ఎస్టేట్ సాధికార సంస్థ, ఛైర్ పర్సన్, శ్రీ రాజీవ్ కుమార్,  మధ్యప్రదేశ్ రియల్ ఎస్టేట్ సాధికార సంస్థ, ఛైర్ పర్సన్, శ్రీ ఆంథోనీ డే సా,  మహారాష్ట్ర రేరా, ఛైర్ పర్సన్, శ్రీ గౌతమ్ ఛటర్జీ,  తమిళనాడు రియల్ ఎస్టేట్ అప్పిలేట్ ట్రిబ్యునల్ ఛైర్ పర్సన్, జస్టిస్ బి. రాజేంద్రన్ తో పాటు  అసోచామ్, క్రెడాయ్, నారెడ్కో, ఫిక్కీ, గృహ కొనుగోలుదారుల సంఘం, జాతీయ గృహనిర్మాణ బ్యాంకు, హెచ్.డి.ఎఫ్.సి. ప్రతినిధులు పాల్గొన్నారు.  

రియల్ ఎస్టేట్ రంగం పనిచేస్తున్న నేపథ్యాన్ని గురించి మంత్రి మాట్లాడుతూ,  రెరాకు పూర్వ కాలంలో,  భారతీయ రియల్ ఎస్టేట్ రంగం 2016 వరకు ఎక్కువగా నియంత్రించబడలేదని అన్నారు.  తద్వారా, ఇది అనేక అన్యాయాలకు దారితీసిందనీ, దీని వలన వివిధ అన్యాయమైన పద్ధతులు ఏర్పడి, చివరికి గృహ కొనుగోలుదారులను ప్రతికూలంగా ప్రభావితం చేసిందన్నారు.  అందువల్ల, ఈ రంగంలో పారదర్శకత, జవాబుదారీతనం ఉండేలా క్రమబద్ధీకరించాల్సిన అవసరం ఏర్పడింది. రియల్ ఎస్టేట్ (రెగ్యులేషన్ అండ్ డెవలప్‌మెంట్) చట్టం, 2016 (రెరా) అమలుతో, దేశానికి మొదటి రియల్ ఎస్టేట్ సాధికార సంస్థ లభించింది.  రెరా భారత రియల్ ఎస్టేట్ రంగంలో కొత్త శకానికి నాంది పలికింది.  ఈ రంగాన్ని సంస్కరించే దిశగా, ఎక్కువ పారదర్శకత, పౌరుల కేంద్రీకృతం, జవాబుదారీతనం మరియు ఆర్థిక క్రమశిక్షణ వైపు ఒక అడుగు ముందుకు పడింది. 

విజయవంతంగా అమలౌతున్న రేరా గురించి మంత్రి వివరాలు తెలియజేస్తూ,  రేరా కింద 31 రాష్ట్రాలు / కేంద్రపాలితప్రాంతాలు నియమ నిబంధనలను రూపొందించాయని తెలిపారు. "30 రాష్ట్రాలు / కేంద్రపాలితప్రాంతాలు రియల్ ఎస్టేట్ నియంత్రణ సాధికార సంస్థలను  ఏర్పాటు చేయగా  24 రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంత్రాలు రియల్ ఎస్టేట్ అప్పీలేట్ ట్రిబ్యునల్స్ ను ఏర్పాటు చేశాయి. దేశవ్యాప్తంగా 52,000 రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు40,517 రియల్ ఎస్టేట్ ఏజెంట్లు రేరా కింద నమోదు చేసుకున్నారు. రియల్ ఎస్టేట్ సాధికార సంస్థ ఇంతవరకు 46,000 కు పైగా ఫిర్యాదులను పరిష్కరించింది. " అని మంత్రి వివరించారు. 

కోవిడ్-19 మహమ్మారి మరియు రియల్ ఎస్టేట్ రంగంపై దాని ప్రభావం కారణంగా ఎదురైన సవాళ్ళపై ఆయన మాట్లాడుతూ, కోవిడ్-19 రియల్ ఎస్టేట్ రంగంపై బలహీనపరిచే ప్రభావాన్ని చూపిందనీ, ఇది అనేక ప్రాజెక్ట్ లు  ఆలస్యం కావడానికి కారణమైందని అన్నారు.  లాక్ డౌన్ ప్రారంభ కాలంలో, నిర్మాణ కార్యకలాపాలు నిరోధించబడ్డాయని అన్నారు. అయితే, పరిస్థితిని సమీక్షించిన తరువాత, 2020 ఏప్రిల్ 20 నుండి నిర్మాణ కార్యకలాపాలను అనుమతించడానికి ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకుందని ఆయన తెలిపారు. 

నిర్మాణ కార్యకలాపాలకు సంబంధించి, దేశంలోని కొన్ని ప్రాంతాల్లో మరియు దేశంలోని మిగిలిన ప్రాంతాల్లో వీటిని అనుమతించామని, దశలవారీగా, ఒక క్రమ పద్దతిలో నిర్మాణ కార్యకలాపాలు తిరిగి ప్రారంభమవుతాయని మంత్రి తెలియజేశారు.  మహమ్మారి కరోనా వ్యాప్తిని అరికట్టడం కోసం ముఖాన్ని మాస్కు తో కానీ, వస్త్రంతో కానీ కప్పుకోవాలి, రెండు గజాల సామాజిక దూరం పాటించడం, ఆరోగ్య సేతు యాప్ ను ప్రతీ ఒక్కరు డౌన్ లోడ్ చేసుకోవాలి, పరిశుభ్రత, పారిశుధ్యం వంటి తీసుకోవలసిన జాగ్రత్తలకు సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలను పాటించాలని ఆయన వాటాదారులందరికీ విజ్ఞప్తి చేశారు. 

వలస కూలీలు మరియు పట్టణ పేదలకు సరసమైన అద్దె గృహాలను రెంటల్ హౌసింగ్ కాంప్లెక్స్ (ఏ.ఆర్.హెచ్.సి) పథకం కోసం ఆర్ధికమంత్రి చేసిన ఇతర ప్రకటనలను ఆయన ప్రస్తావించారు, ఇక్కడ నగరాల్లో ప్రభుత్వ నిధుల ఇళ్ళు పి.పి.పి. మోడల్ కింద స్థోమత అద్దె హౌసింగ్ కాంప్లెక్స్‌గా మార్చబడతాయి.  అనేక పట్టణ ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వలస ప్రజలకు తాత్కాలిక గృహాలను అందించే సమస్యను ఈ ఒక్క దశ చాలావరకు తొలగిస్తుందని ఆయన అన్నారు.

రియల్ ఎస్టేట్ రంగంలో వ్యాపారం సులభతరం చేసేటప్పుడు గృహ కొనుగోలుదారుల ఆసక్తిని కాపాడుకోవడానికి, పరిరక్షించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఎమ్.ఓ.హెచ్.యు.ఏ. కార్యదర్శి శ్రీ దుర్గా శంకర్ మిశ్రా సమావేశం ముగింపులో పేర్కొన్నారు.  

****



(Release ID: 1624605) Visitor Counter : 168