గనుల మంత్రిత్వ శాఖ

మార్చి 2020లో ఖనిజ ఉత్పత్తి గణాంకలు విడుదల (తాత్కాలికం)

2019 మార్చి ఉత్పత్తితో సరిగ్గా సమానం
ప్రధాన ఖనిజాల ఉత్పత్తి రేటులో హెచ్చుతగ్గులు

Posted On: 16 MAY 2020 1:05PM by PIB Hyderabad

గనుల తవ్వకం, క్వారీల సెక్టార్‌లో ఖనిజ ఉత్పత్తి సూచిక, 2019 మార్చిలో ఎంతుందో 2020 మార్చిలో సరిగ్గా అంతే నమోదైంది. ఇది 
‍(ప్రామాణికం‌: 2011-12=100 ) 132.7గా  నమోదైంది. అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే, 2019-20 ఏప్రిల్‌-మార్చి కాలంలో సంచిత వృద్ధి ‍(+)1.7 శాతంగా నమోదైంది. భారత గనుల బ్యూరోకు చెందిన 'గనులు మరియు ఖనిజ గణాంకాల డివిజన్‌' ఈ సమాచారాన్ని విడుదల చేసింది.

    2020 మార్చిలో ప్రధాన ఖనిజాల ఉత్పత్తి స్థాయిలు ఇలా ఉన్నాయి. బొగ్గు 958 లక్షల టన్నులు, లిగ్నైట్ 42 లక్షల టన్నులు, సహజ వాయువు (వినియోగించబడింది) 2323 మిలియన్ క్యూబిక్‌ మీటర్లు, పెట్రోలియం (ముడి) 27 లక్షల టన్నులు, బాక్సైట్ 1634 వేల టన్నులు, క్రోమైట్ 582 వేల టన్నులు, రాగి కాన్సంట్రేట్ 11 వేల టన్నులు, బంగారం 153 కిలోలు, ఇనుప ఖనిజం 204 లక్షల టన్నులు, లెడ్ కాన్సంట్రేట్‌ 26 వేల టన్నులు, మాంగనీస్ ఖనిజం 181 వేల టన్నులు, జింక్ (కాన్సంట్రేట్‌) 117 వేల టన్నులు, అపటైట్ మరియు ఫాస్ఫరైట్ 133 వేల టన్నులు, సున్నపురాయి 272 లక్షల టన్నులు, మాగ్నసైట్ 8 వేల టన్నులు, వజ్రాలు 3213 క్యారెట్లు.
                        
    మార్చి 2019తో పోలిస్తే, మార్చి 2020లో ప్రధాన ఖనిజాల ఉత్పత్తి సానుకూల వృద్ధిని చూపిస్తున్నాయి. అవి: క్రోమైట్‌ (15.9%), 'ఇనుప ఖనిజం' (8.3%), 'బొగ్గు' (4.3%). మరికొన్ని ముఖ్య ఖనిజాల ఉత్పత్తి ప్రతికూల వృద్ధిని చూపిస్తోంది. అవి: 'బంగారం' (-) 42.5%, 'మాంగనీస్ ఖనిజం' (-) 38.0%, 'లెడ్‌ కాన్సంట్రేట్' (-) 26.3%, 'జింక్ కాన్సంట్రేట్' (-) 24.9%, ' సున్నపురాయి '(-) 23.0%,' లిగ్నైట్ '(-) 16.9%,'రాగి కాన్సంట్రేట్‌' (-) 16.2%,' సహజ వాయువు (వినియోగించబడింది) '(-) 15.2%,' బాక్సైట్ '(-) 9.4%,' ఫాస్ఫోరైట్ '(-) 6.8%, 'పెట్రోలియం'
(ముడి) (-) 5.5%.



(Release ID: 1624398) Visitor Counter : 354