మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ

"మహమ్మారి మరియు లాక్ డౌన్ యొక్క మానసిక-సామాజిక ప్రభావం మరియు దాన్ని ఎలా ఎదుర్కోవాలి" అనే అంశంపై ఏడు పుస్తకాలను ఎలక్ట్రానిక్ మాధ్యమంలో విడుదల చేసిన - కేంద్ర మానవనరుల శాఖ మంత్రి.
కరోనాపై అధ్యయనాల పరంపర కింద ప్రచురించిన - నేషనల్ బుక్ ట్రస్ట్.

Posted On: 15 MAY 2020 7:26PM by PIB Hyderabad

కరోనాపై అధ్యయనాల పరంపర కింద నేషనల్ బుక్ ట్రస్ట్ ఇండియా ప్రచురించిన  ఏడు పుస్తకాల సెట్ ను  కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి శ్రీ రమేష్ పోఖ్రియాల్ "నిషాంక్"  ఎలక్ట్రానిక్ మాధ్యమంలో విడుదల చేశారు. "మహమ్మారి మరియు లాక్ డౌన్ యొక్క మానసిక-సామాజిక ప్రభావం మరియు దాన్ని ఎలా ఎదుర్కోవాలి" అనే అంశంపై ఈ పుస్తకాలను ముద్రణ రూపంలోనూ, ఈ-ఎడిషన్ గాను ప్రచురించారు.  ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, "ఈ రోజుల్లో ప్రపంచం ఎదుర్కొంటున్న ఈ బలీయమైన పరిస్థితులను ఎదుర్కోవడానికి, ఎన్.బి.టి. విశేషమైన, అసమానమైన పుస్తకాలను తెచ్చింది. ఈ పుస్తకాలు ప్రజల మానసిక క్షేమానికి మార్గదర్శకంగా పనిచేస్తాయని నేను ఆశిస్తున్నాను ",అని పేర్కొన్నారు.  ఈ పుస్తకాల ఆవిష్కరణ కార్యక్రమం అనంతరం, ఎన్.బి.టి. అధ్యయన బృందానికి చెందిన పరిశోధకులు / రచయితలతో ఎలక్ట్రానిక్ మాధ్యమం ద్వారా పరస్పర సంప్రదింపుల సమావేశం జరిగింది

నేషనల్ బుక్ ట్రస్ట్, ఇండియా  చేసిన ప్రత్యేక కృషికి శ్రీ నిషాంక్ అభినందనలు తెలియజేస్తూ, ప్రజలు సులభంగా చదవడానికి వీలుగా, ముఖ్యమైన విషయాలను పుస్తక రూపంలోకి తీసుకువచ్చిన పరిశోధకులకు ఆయన తన కృతజ్ఞతలు తెలిపారు.   ఈ కష్ట సమయాల్లో మనం ముందుకు సాగడానికి, మహమ్మారికి వ్యతిరేకంగా యోధులుగా పోరాడటానికి మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యమైన విషయమని ఆయన అన్నారు.  "మాన్ కే హారే హర్ హై మాన్ కే మాన్ కే జీతే జీత్" అనే ప్రసిద్ధ పంక్తులను ఆయన ఉటంకించారు. అంటే దీని అర్ధం మన మనస్సు మరియు మానసిక శ్రేయస్సు మన చర్యలను నిర్ణయిస్తాయి.

ఈ సందర్భంగా ఎన్.బి.టి. చైర్మన్ ప్రొఫెసర్ గోవింద్ ప్రసాద్ శర్మ మాట్లాడుతూ,  "నా వయస్సులో, ప్రపంచాన్ని ప్రభావితం చేసిన అనేక అంటువ్యాధులను, ఇతర వ్యాధులను నేను చూశాను. కానీ ఈ రోజు మనం ఎదుర్కొంటున్నది ఒక పెద్ద సవాలుగా ఉంది, ఎందుకంటే ఇది కరోనాతో ప్రభావితం కాని వారి మనస్తత్వాలను కూడా  ప్రభావితం చేస్తోంది.  అందువల్ల ఈ పుస్తకాల అవసరం చాలా ముఖ్యమైనది,  భారతదేశంలోనే కాకుండా విదేశాలలో కూడా పాఠకుల అవసరాలను ఇవి తీర్చగలవు ". అని చెప్పారు. 

భారతదేశం అంతటా పిల్లలు ఈ మహమ్మారి బారిన పడకుండా చూసేందుకు గౌరవ మంత్రి చేసిన ప్రయత్నాలకు,  మరియు అందరికీ ఇ-లెర్నింగ్ ఉండేలా చేసిన ఆయన మార్గదర్శకత్వానికి ప్రొఫెసర్ శర్మ కృతజ్ఞతలు తెలిపారు.  

ఈ ప్రాజెక్టు నిర్వహణలో నిరంతరం మార్గ నిర్దేశనం చేసిన కేంద్ర మానవవనరుల శాఖ మంత్రికి, ఎన్.బి.టి. చైర్మన్ కు, ఈ మొత్తం ప్రాజెక్టును రూపొందించి, అమలు చేసి, నాయకత్వం వహించిన ఎన్.బి.టి. డైరెక్టర్ శ్రీ యువరాక్ మాలిక్  కృతజ్ఞతలు తెలియజేశారు. నాలుగు వారల రికార్డు సమయంలో ఈ ప్రాజెక్టును పూర్తిచేయడానికి సహకరించిన పరిశోధకులకు, చిత్రకారులతో పాటు ఎన్.బి.టి. మొత్తం బృందాన్నీ ఆయన ఈ సందర్భంగా అభినందించారు.  కరోనా తగ్గిన తర్వాత పాఠకుల పఠన అవసరాలను తీర్చడానికి సరైన సమయంలో మరిన్ని కొత్త విషయాలతో ఎన్.బి.టి. పుస్తకాలను ముద్రిస్తుందని ఆయన చెప్పారు. 

అధ్యయన బృందం సభ్యులు  ఈ సందర్భంగా తమ అనుభవాలను కేంద్ర  మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రితో పంచుకున్నారు.  సాంకేతికత సహాయంతో,  తాము ఇళ్ల నుంచీ ఈ పుస్తకాల కోసం పనిచేశామనీ,  ఈ పని యొక్క ప్రత్యేక అనుభవం తమకు ఒక చికిత్సా విధానంగా తోచిందనీ అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ పుస్తకాల అవసరం ఎంతైనా ఉందని వారు నొక్కిచెప్పారు.  

ఈ అధ్యయన బృందం సభ్యుడు, ప్రముఖ మానసిక వైద్యుడు, డాక్టర్ జితేంద్ర నాగ్ పాల్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, "మానసిక ఆరోగ్యంపై దృష్టి సారించిన పుస్తకాలు భారతదేశంలో చాలా అరుదుగా వస్తున్నాయిభవిష్యత్తులో మానసిక పరిశోధన మరియు కౌన్సిలింగు కు ఈ పుస్తకాలు అపూర్వమైన అవగాహన, విజ్ఞానాన్ని అందిస్తాయి." అని పేర్కొన్నారు. ఇతర సభ్యులలో - కుమారి మీనా అరోరాలెఫ్టనెంట్ కల్నల్,  డాక్టర్ హర్షీత కుమారి రేఖా చౌహాన్, కుమారి సోనియా సిద్దుకుమారి అపరాజిత దీక్షిత్ ఉన్నారు.

ఎన్ఎ.బి.టి. ఎడిటర్, ఈ సీరీస్ ప్రాజెక్ట్ కు నాయకత్వం వహించిన శ్రీ కుమార్ విక్రమ్ కూడా రచయితలు, చిత్రకారులకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు. సాధారణ పాఠకునికి సకాలంలో ఈ పుస్తకాలను అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశ్యంతో, లాక్డౌన్ సమయంలో నిర్విరామంగా ఈ  ప్రాజెక్ట్ లో పనిచేసిన సంపాదక వర్గం, కళ, ప్రొడక్షన్, ఐ.టి., పి.ఆర్., విక్రయ విభాగాలకు చెందిన 30 మందికి పైగా సభ్యులతో కలిసి ఈ ప్రాజెక్టులో పనిచేసిన తమ అనుభవాలను ఆయన పంచుకున్నారు.  ఈ కాలంలో, పుస్తక ప్రచురణ, ప్రచారంలో  ‘ఎన్.బి.టి.’ వంటి జాతీయ సంస్థ పాత్ర  అన్నిటికంటే ముఖ్యమైనదనీ, ఎందుకంటే పుస్తకాల రూపంలో చక్కగా వ్యవస్థీకృత సమాచారం పాఠకులపై దీర్ఘకాలిక ప్రభావాన్ని చూపుతుందనీ, ఆయన నొక్కి చెప్పారు. 

కరోనా స్టడీస్ సిరీస్ ప్రత్యేకించి కరోనా తర్వాత అన్ని వయసుల పాఠకుల అవసరాలకు తగినట్టుగా సంబంధిత పఠన సామగ్రిని అందించడానికి, "మహమ్మారి మరియు లాక్ డౌన్ యొక్క మానసిక-సామాజిక ప్రభావం మరియు దాన్ని ఎలా ఎదుర్కోవాలి" అనే అంశంపై మొదటి దశలో పుస్తకాలను ప్రచురించాలని ఏడుగురు మనస్తత్వవేత్తలు మరియు సలహాదారులతో ఎన్.బి.టి. ఒక అధ్యయన బృందాన్ని ఏర్పాటు చేసింది. 

వివిధ సంఘటనలపై జరిపిన అధ్యయనాలు, వెబ్ సైట్, ఎన్.బి.టి. కి చందిన ఇతర సామాజిక మాధ్యమాల ద్వారా పంపిన ఆన్ లైన్ ప్రశ్నవళి కి అందిన ప్రతిస్పందనల ఆధారంగా ప్రజల అవగాహన వంటివి పరిగణలోనికి తీసుకుని  సమాజంలోని ఏడు విభిన్న విభాగాలపై మానసిక-సామాజిక ప్రభావం యొక్క వివిధ అంశాలపై ఈ శీర్షికలను ఎంపికచేయడం జరిగింది. 

ఈ అధ్యయనాన్ని 2020 మార్చి 27వ తేదీ నుండి 2020 మే 1వ తేదీ వరకు నిర్వహించి, విశ్లేషించడం జరిగింది. వ్యాధి వ్యాప్తి చెందుతుందన్న భయం ఆందోళను ఒక పెద్ద కారణంకాగా ఆతర్వాత ఆర్థిక మరియు స్థానిక సమస్యలు కూడా కారణమౌతున్నాయని - ఈ అధ్యయనం ద్వారా కనుగొన్నారు. ‘జాతీయ మానసిక ఆరోగ్య కార్యక్రమంలో ఒక భాగంగా  మానసిక ఆరోగ్యాన్ని బలోపేతం చేయడం’ ద్వారా శారీరక ఆరోగ్యం, సామాజిక-ఆర్ధిక అనుకూలతతో పాటు, కరోనా అనంతర సమాజాన్ని స్థితిస్థాపకంగా, చక్కగా స్వీకరించడానికి ఒక దీర్ఘకాలిక వ్యూహాన్ని రూపొందించాలని అధ్యయన బృందం సిఫార్సు చేసింది. అందమైన చిత్రాలతో  కూర్చిన కొన్ని అందమైన దృష్టాంతాలతో ఈ పుస్తకాలను ఆసక్తికరంగా రూపొందించడం జరిగింది.  ఈ కరోనా మహమ్మారి వ్యాప్తి మరియు లాక్ డౌన్ కారణంగా సంభవించిన మానసిక ఒత్తిడి మరియు ఆందోళనను ఎదుర్కోడానికి ఈ పుస్తకాలు చాలా విలువైన మరియు ఆచరణాత్మక చిట్కాలను కూడా అందిస్తాయి.

ఈ పుస్తకాల శీర్షికలు, సంపాదకులు, చిత్రకారుల వివరాలు:  

1.     Vulnerable in Autumn: Understanding the Elderly 

(ప్రధాన పరిశోధకులు : జితేంద్ర నగపాల్ & అపరాజిత దీక్షిత్, చిత్రకారులు : అలోయ్ ఘోషల్ )

2.     The Future of Social Distancing: New Cardinals for Children, Adolescents and Youth 

 (ప్రధాన పరిశోధకులు అపరాజిత దీక్షిత్ & రేఖా చౌహన్చిత్రకారులు : పార్థా సేన్ గుప్త) 

3.     The Ordeal of Being Corona Warriors: An Approach to Medical and Essential Service Providers 

(ప్రధాన పరిశోధకులు మీనా అరోరా & సోనియ సింధు,  చిత్రకారులు : సౌమ్య శుక్లా)

4.     New Frontiers At Home: An Approach to Women, Mothers and Parents 

(ప్రధాన పరిశోధకులు : తరుణ్ ఉప్పల్ & సోనియ సిద్దు,  చిత్రకారులు : ఆర్యా ప్రహరాజ్)

5.     Caught in Corona Conflict: An Approach to the Working Population 

(ప్రధాన పరిశోధకులు : జితేంద్ర నాగపాల్ & తరుణ్ ఉప్పల్,  చిత్రకారులు : ఫజ్రుద్దిన్ )

6.     Making Sense of It All: Understanding the Concerns of Persons With Disabilities 

(ప్రధాన పరిశోధకులు : రేఖ చౌహన్ & హర్షీత;  చిత్రకారులు : వికీ ఆర్య)

7.     Alienation And Resilience: Understanding Corona Affected Families 

(ప్రధాన పరిశోధకులు : హర్షీత & మీనా అరోరా;  చిత్రకారులు : నీతూ శర్మ)

ఈ పుస్తకాలతో పాటు, ఆ పుస్తకాల్లోని విషయాలను తెలియజేసే ఏడు వీడియోలను కూడా విడుదల చేశారు. 

 

ఈ పుస్తకాలు లభించే ప్రదేశాలు :

ఎన్.బి.టి. బుక్ షాపువసంత్ కుంజ్న్యూఢిల్లీ

ఎన్.బి.టి. వెబ్ స్టోర్ :  www.nbtindia.gov.in/cssbooks

 

సంప్రదించవలసిన ఫోన్ నెంబరు :+91-8826610174

సి.ఎస్.ఆర్./హెచ్.ఆర్. కార్యక్రమాల కోసం సంప్రదించవలసిన ఈ-మెయిల్ scoord@nbtindia.gov.in

అంతర్జాతీయ పంపిణీ కోసం సంప్రదించవలసిన ఈ-మెయిల్ scoord@nbtindia.gov.in

అంతర్జాతీయ భాషా హక్కుల కోసం సంప్రదించవలసిన ఈ మెయిల్ :  nbtrightscell@gmail.com

 

*****(Release ID: 1624367) Visitor Counter : 146