ఆర్థిక మంత్రిత్వ శాఖ

కోవిడ్ -19 నుంచి భారతదేశ పేదలను రక్షించేందుకు ప్రపంచ బ్యాంకు నుంచి 1 బిలియన్ డాలర్లు

Posted On: 15 MAY 2020 7:52PM by PIB Hyderabad

కోవిడ్ -19 మహమ్మారి కారణంగా తీవ్రంగా ప్రభావితమైన పేద మరియు బలహీన వర్గాలకు సామాజిక సహాయం అందించడంలో భారతదేశం చేస్తున్న ప్రయత్నాలకు మద్ధతుగా భారతదేశ కోవిడ్ -19 సామాజిక రక్షణ ప్రతిస్పందన కార్యక్రమాన్ని వేగవంతం చేయడానికి ప్రతిపాదించిన 1 బిలియన్ డాలర్లకు గాను, 750 మిలియన్ డాలర్ల కోసం భారత ప్రభుత్వం మరియు ప్రపంచ బ్యాంక్ ఈ రోజు సంతకాలు చేశాయి.

భారతదేశంలో అత్యవసర కోవిడ్ -19 ప్రతిస్పందన కేసం బ్యాంక్ నుంచి మొత్తం 2 బిలియన్ డాలర్లను తీసుకోనుంది. భారతదేశ ఆరోగ్య రంగానికి తక్షణ మద్దతు కోసం గత నెలలో 1 బిలియన్ డాలర్ల మద్దతును ప్రకటించారు.

ఈ నూతన మద్దతుకు రెండు దశల్లో నిధులు సమకూరుతాయి. 2020 ఆర్థిక సంవత్సరానికి 750 మిలియన్ డాలర్లు వెంటనే కేటాయించడం, అదే విధంగా 2021 ఆర్థిక సంవత్సరానికి 250 మిలియన్ డాలర్లు రెండవ విడతగా అందుబాటులో ఉంటాయి.

ఈ ఒప్పందం మీద భారత ప్రభువం తరుఫున ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆర్థిక వ్యవహారాల శాఖ అదనపు కార్యదర్శి శ్రీ సమీర్ కుమార్ ఖరే మరియు ప్రపంచ బ్యాంకు తరుఫున భారతదేశ కంట్రీ డైరక్టర్ శ్రీ జునైద్ అహ్మద్ సంతకాలు చేశారు.

ప్రస్తుతం మరియు భవిష్యత్ సంక్షోభాల ద్వారా దేశ ప్రజలకు హాని కలిగించే అంశాలను బలంగా ఎదుర్కొనేందుకు బలమైన పోర్టబుల్ సామాజిక రక్షణ వ్యవస్థ కీలకమని శ్రీ ఖరే తెలిపారు. ఈ కార్యక్రమం భారతదేశ సామాజిక రక్షణ వ్యవస్థ యొక్క ప్రభావాన్ని మరియు కవరేజీని విస్తరిస్తుందని, హాని కలిగించే సమూహాలకు ప్రత్యక్షంగా మరియు దేశవ్యాప్తంగా ఎక్కువ సామాజిక ప్రయోజనాలను అందిచడంలో సహాయపడుతుందని ఆయన తెలిపారు.

ఇందులో మొదటి దశ ఆపరేషన్ ను ప్రధాన్ మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన (పి.ఎం.జి.కె.వై) ద్వారా దేశ వ్యాప్తంగా అమలు చేయనున్నారు. ముందుగా ఉన్న జాతీయ ప్లాట్ ఫామ్ ల యొక్క ప్రధాన సమితిని మరియు పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ (పి.డి.ఎస్) మరియు డైరక్ట్ బెన్ ఫిట్ ట్రాన్స్ ఫర్ (డి.బి.టి) వంటి కార్యక్రమాలను ఉపయోగించి నగదు బదిలీలు మరియు ఆహార ప్రయోజనాలకు ఇది వెంటనే సహాయపడుతుంది. కోవిడ్ -19 సహాయక చర్యల్లో పాల్గొన్న అవసరమైన కార్మికులకు బలమైన సామాజిక రక్షణను అందించడం మరియు పి.ఎం.జి.కె.వై. కింద్ర మినహాయింపు యొక్క అధిక నష్టాలను ఎదుర్కొంటున్న వర్గాలు, ముఖ్యంగా వలసకార్మికులు మరియు అనధికార కార్మికులకు అదనపు ప్రయోజనాలను చేకూరుస్తుంది. రెండో దశలో, ఈ కార్యక్రమంల సామాజిక రక్షణ ప్యాకేజీని మరింత లోతుగా నిర్వహిస్తుంది. తద్వారా స్థానిక అవసరాల ఆధారంగా అదనపు నగదు మరియు వివిధ రకాల ప్రయోజనాలు రాష్ట్రప్రభుత్వాలు మరియు పోర్టబుల్ సామాజిక రక్షణ పంపిణీ వ్యవస్థల ద్వారా విస్తరించబడతాయి.

అంతర్జాతీయ గణాంకాల ప్రకారం భారతదేశంలో సగం జనాభా రోజుకు 3 డాలర్ల కన్నా తక్కువ సంపాదిస్తున్నారు. దారిద్ర్య రేఖకు దిగువగా ఉన్న వీరిలో సామాజిక రక్షణ అనేది ఒక క్లిష్టమైన పెట్టుబడి. భారతదేశ శ్రామికశక్తిలో 90 శాతానికి పైగా అనధికార రంగాల్లో పని చేస్తున్నాయి. గణనీయమైన పొదుపు లేదా కార్యాలయ ఆధారిత సామాజిక రక్షణ ప్రయోజనాలైన పెయిడ్ సిక్ లీవ్ లేదా సోషల్ ఇన్సూరెన్స్ వాటికి పాప్యత ఉండడం లేదు. ఏటా వివిధ ప్రాంతాల్లో పని చేసేందుకు రాష్ట్రాల సరిహద్దులు దాటి వెళ్ళిన 9 మిలియన్లకు పైగా వలస కార్మికులు కూడా అధిక ప్రమాదంలో ఉన్నారు. ఎందుకంటే భారతదేశంలో సామాజిక సహాయ కార్యక్రమాలు ఎక్కువగా రాష్ట్రాల్లో నివసించే వారికి ప్రయోజనాలను అందిస్తాయి. రాష్ట్ర సరిహద్దుల్లో తగినంత ప్రయోజనాలు అందకుండా, ముఖ్యంగా పట్టణీకరణ నేపథ్యంలో భారతదేశంలోని నగరాలు మరియు పట్టణాలకు లక్ష్య మద్ధతు మరింత ఆవశ్యకం. ఎందుకంటే భారతదేశ అతిపెద్ద సామాజిక రక్షణ కార్యక్రమాలు గ్రామీణ జనాభాపై దృష్టి సారించాయి.

ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్ -19 మహమ్మారికి ప్రతిస్పందనగా ప్రభుత్వాలు అపూర్వమైన మార్గాల్లో సామాజిక దూరాన్ని మరియు లాక్ డౌన్ లను ప్రవేశ పెట్టాల్సిన అవసరం ఉందని శ్రీ జునైద్ అహ్మద్ తెలిపారు. వైరస్ వ్యాప్తిని తగ్గించడానికి ఉద్దేశించిన ఈ చర్యలు ఆర్థిక వ్యవస్థలను మరియు ఉద్యోగాలను ముఖ్యంగా అనధికార రంగాన్ని ప్రభావితం చేశాయి. ప్రపంచంలో అతిపెద్ద లాక్ డౌన్ ఎదుర్కొన్న భారతదేశం దీని మినహాయింపు కాదు. ఈ సందర్భంలో నగదు బదిలీలు మరియు ఆహార ప్రయోజనాలు పేదలు మరియు బలహీన వర్గాలు ఆర్థిక వ్యవస్థ పునరుజ్జీవం ప్రారంభమయ్యే నాటికి భద్రత వంతన కిందకు రావడానికి సహాయపడతాయి.

ఈ కార్యక్రమం భారతదేశ భారతదేశ భద్రతా వలయాల పంపిణీని బలోపేతం చేసే వ్యవస్థను కచ్చితంగా సృష్టించే అవకాశం ఉంది:

·        రాష్ట్రాల అంతటా అవసరాల వైవిధ్యాన్ని అంగీకరిస్తూ, 460కి పైగా విచ్చిన్నమైన సామాజిక రక్షణ పథకాల నుంచి వేగంగా మరియు మరింత సరళంగా ఉండే సమగ్ర వ్యవస్థకు భారతదేశానికి సహకారం అందించడం.

·        దేశంలో ఎక్కడి నుంచైనా ప్రాప్తి చేయగల సామాజిక రక్షణ ప్రయోజనాల యొక్క భౌగోళిక పోర్టబులిటీ ప్రారంభించడం, వలస కార్మికులు మరియు పట్టణ పేదలతో సహా అందరికీ ఆహారం, సామాజిక బీమా మరియు నగదు మద్దతును అందించడం.

·        భారతదేశం యొక్క సామాజిక రక్షణ వ్యవస్థను ప్రధానంగా గ్రామీణ దృష్టి కోణం నుంచి పట్టణ పేదల అవసరాలను గుర్తించే పాన్ నేషన్ కు సహకారం ఇవ్వడం.

కోవిడ్ -19 మహమ్మారి సామాజిక రక్షణ వ్యవస్థల్లో ఉన్న కొన్ని అంతరాలను కూడా ప్రస్తుతం వెలుగులోకి తెచ్చిందని శ్రీ అహ్మద్ తెలిపారు. ఈ కార్యక్రమం మరింత ఏకీకృత డెలివరీ ప్లాట్ ఫామ్ వైపు భారత ప్రభుత్వం చేసే ప్రయత్నాలకు తోడ్పడుతుందని,  గ్రామీణ మరియు పట్ట జనాభాలకు రాష్ట్ర సరిహద్దుల్లో అందుబాటులో ఉంటుందని అలాగే 21వ శతాబ్దపు భారతదేశ అవసరాలకు మొత్తం సామాజిక రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేసేటప్పుడు, ఈ వేదిక ప్రస్తుతం ఉన్న భద్రతా వలయాల నిర్మాణం – పి.డి.ఎస్, డిజిటర్ మరియు బ్యాంకింగ్ మౌలిక సదుపాయులు మరియు ఆధార్ ను గమనిస్తుందని తెలిపారు. ముఖ్యంగా అలాంటి వ్యవస్థ భారతదేశ సమాఖ్యవాదాన్ని ప్రభావితం చేయవలసి ఉంటుందని, అలాగే త్వరిత గతిన సమర్థవంతంగా స్పందించేందుకు రాష్ట్రాలకు వీలు కల్పిస్తుందని అభిప్రాయపడ్డారు.

1 బిలియన్ డాలర్ల నిబద్ధతలో, 2020 ఆర్థిక సంవత్సరానికి 750 మిలియన్ డాలర్లు వెంటనే కేటాయించడం, అందులో 550 మిలియన్ డాలర్లు ఇంటర్ నేషనల్ డెవలప్ మెంట్ అసోసియేషన్ (ఐ.డి.ఏ) నుంచి క్రెడిట్ ద్వారా నిధులు సమకూరుతాయి. ప్రపంచ బ్యాంకు యొక్క రాయితీ రుణం సహకారం మరియు 200 మిలియన్ డాలర్లు రుణం ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్ స్ట్రక్షన్ అండ్ డెవలప్ మెంట్ (ఐ.బి.ఆర్.డి), 18.5 సంవత్సరాల తుది మెచ్యూరిటీతో, ఐదేళ్ళ గ్రేస్ పీరియడ్ తో అందిస్తాయి. అలాగే మిగిలిన 250 మిలియన్ డాలర్లు 2020  జూన్ 30 తర్వాత అందుబాటులో ఉంటాయి. ప్రామాణిక ఐ.బి.ఆర్.డి. నిబంధనలు ఈ మొత్తానికి వర్తిస్తాయి. ఈ కార్యక్రమాన్ని భారత ప్రభుత్వ ఆర్థిక మంత్రిత్వశాఖ అమలు చేస్తుంది.

 

***



(Release ID: 1624252) Visitor Counter : 288