మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్వహణలోని ఉపాధ్యాయ విద్యా కోర్సులకు పాత తేదీ నుంచి గుర్తింపు ప్రకటించిన కేంద్ర హెచ్ఆర్ డి మంత్రిత్వ శాఖ

Posted On: 15 MAY 2020 6:10PM by PIB Hyderabad

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలు నిర్వహిస్తున్న కొన్ని ఉపాధ్యాయ విద్యా కార్యక్రమాలకు పాత తేదీ నుంచి గుర్తింపు ఇస్తున్నట్టు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ  మే 12వన తేదీ రెండు గెజిట్ నోటిఫికేషన్లు జారీ చేసినట్టు కేంద్ర హెచ్ఆర్ డి మంత్రి శ్రీ రమేశ్ పోఖ్రియాల్ “నిశాంక్” ప్రకటించారు. జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి (ఎన్ సిటిఇ) నుంచి ఎలాంటి లాంఛనప్రాయమైన గుర్తింపు లేకుండానే ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దీని వల్ల విద్యార్థులు పడే ఇబ్బందులను పరిగణనలోకి తీసుకుని ఆ నిర్ణయం తీసుకున్నట్టు మంత్రి తెలిపారు.

పూర్వాపరాలు... 
ప్రీ సర్వీస్ టీచర్ ఎడ్యుకేషన్ కోసం కోర్సుల నిర్వహణ కోసం ఎన్ సిటిఇ గుర్తింపు పొందిన కోర్సుల నిర్వహణకు విద్యా సంస్థలకు ఎన్ సిటిఇ చట్టపరమైన గుర్తింపు మంజూరు చేస్తుంది. ఎన్ సిటిఇ గుర్తింపు గల ఈ కోర్సుల్లో అర్హత సాధించిన వారు మాత్రమే దేశంలోని విద్యా సంస్థల్లో ఉపాధ్యాయులుగా నియామకం కావడానికి చట్టపరంగా అర్హులవుతారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్వహణలోని సంస్థలు తమకు తెలియకుండానే ఇలాంటి ఉపాధ్యాయ విద్యా కోర్సుల్లో విద్యార్థులను చేర్చుకున్నాయన్న అంశం ఎంహెచ్ఆర్ డి దృష్టికి వచ్చింది. దేశంలోని విద్యాసంస్థల్లో ఉపాధ్యాయులుగా నియమితులు కావడానికి ఈ అర్హతలు చెల్లుబాటు కావు.  

పాత తేదీ నుంచి కోర్సులకు గుర్తింపు... 
ఇలాంటి కోర్సులన్నింటికీ పాత తేదీ నుంచి గుర్తింపు ఇచ్చే విధంగా ఎన్ సిటిఇ చట్టం, 1993కి ఎంహెచ్ఆ  ర్ డి సవరణ చేసింది. పార్లమెంటు ఆమోదం పొందిన అనంతరం 2019 జనవరి 11వ తేదీన ఈ సవరణను నోటిఫై చేశారు. 

అయితే ఈ సవరణ 2017-2018 విద్యాసంవత్సరం కన్నా ముందు కాలానికే వర్తిస్తుంది. ఆ రకంగా ఆ సంవత్సరాల కన్నా ముందు అర్హత సాధించిన వారి విద్యార్హతకు మాత్రమే గుర్తింపు వస్తుంది. అయితే భవిష్యత్తులో ప్రారంభించే ఇలాంటి గుర్తింపు లేని కోర్సులకు ఈ సవరణ వర్తించదు. కాబట్టి ఆ కోర్సులకు తాజా గుర్తింపు అవసరం అయింది. 

ఈ నిర్ణయం వల్ల దేశంలోని మొత్తం 23 కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సంస్థల్లోని 13 వేల మంది విద్యార్థులు, 17 వేల మంది సర్వీసులోని ఉపాధ్యాయులు ఈ నిర్ణయం ద్వారా లాభం పొందుతారు.  

ఈ నోటిఫికేషన్ల ఫలితంగా బాధిత విద్యార్థులు, సర్వీసులోని ఉపాధ్యాయులు సంపాదించిన అర్హతలు చట్టపరంగా గుర్తింపు పొందుతాయి. 
 



(Release ID: 1624251) Visitor Counter : 170