భారత పోటీ ప్రోత్సాహక సంఘం

వ్యాపార కలయికల క్రమబద్ధీకరణలో నాన్‌-కాంపీట్‌ ఆంక్షల సరళీకరణపై అభిప్రాయాలను ఆహ్వానించిన సీసీఐ

వ్యాపారాలను మరింత సులభతరం చేసేందుకు చర్యలు
సంస్థలపై సమాచార భారాన్ని తగ్గించేలా నిబంధనల్లో మార్పులకు యోచన

Posted On: 15 MAY 2020 9:18PM by PIB Hyderabad

వ్యాపార సంస్థల కలయికల పరిశీలనలో భాగంగా.. విలీనాలు, కొనుగోళ్లలో నిర్దేశించిన నాన్‌-కాంపీట్‌ ఆంక్షలను కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) సరళీకరించేందుకు ప్రయత్నిస్తోంది. నోటిఫై చేసిన పార్టీలు నాన్‌-కాంపీట్‌ ఆంక్షల సమాచారాన్ని పరిశీలన కోసం  అందించాలి. ఏ పరిస్థితుల్లో నాన్‌-కాంపీట్‌ ఆంక్షలను ‘అనుబంధం’ లేదా ‘అనుబంధం కాని’ వాటిగా పరిగణిస్తారో వివరిస్తూ మార్గదర్శకాలను సీసీఐ విడుదల చేసింది. గుడ్‌విల్‌తోపాటు ఉత్పత్తికి సంబంధించి సమస్త సమాచారం బదిలీ జరిగినట్లయితే మూడేళ్ల నాన్‌-కాంపీట్‌ ఆబ్లిగేషన్‌ సమర్థనీయమని మార్గదర్శకాల్లో పేర్కొంది. కేవలం గుడ్‌విల్‌ బదిలీ మాత్రమే జరిగితే ఇది రెండేళ్లు మాత్రమే సమర్థనీయమని పేర్కొంది. అమ్మిన వ్యాపారం, ఒప్పందం జరిగిన భూభాగానికి నాన్‌-కాంపీట్‌ పరిధి పరిమితమవుతుందని మార్గదర్శకాల్లో వెల్లడించింది. ఏదిఏదమైనా, అనుబంధం కాని ఆంక్ష, చట్ట నిబంధనల ప్రకారం, ఉల్లంఘన అనుమానాన్ని లేవనెత్తలేదు.

నాన్‌-కాంపీట్‌ ఆంక్షలను మదింపు చేయడానికి సాధారణ ప్రమాణాలను సూచించడం ఆధునిక వ్యాపార పరిస్థితులకు తగదన్న విషయాన్ని గమనించబడింది.  ప్రతీ కేసు ఆధారంగా సమగ్ర పరిశీలన నిర్వహిచడం సాధ్యమే అయినా, సంస్థల కలయిక సందర్భాలలో అనుసరించిన కాల పద్ధతులను పరిగణనలోకి తీసుకోవడం సాధ్యం కాదు.

పార్టీల కలయిక కోసం, అంగీకరించిన నాన్‌-కాంపీట్‌ రిస్ట్రిక్షన్ల సమాచారాన్ని కోరుతున్న 'కలయికల క్రమబద్ధీకరణ ఫారం-1'లోని 5.7 పేరాను వదిలివేసేందుకు సీసీఐ ప్రతిపాదించింది. నాన్‌-కాంపీట్‌ రిస్ట్రిక్షన్లను నిర్ణయించడంలో పార్టీల సౌలభ్యాన్ని ఇది పెంచుతుంది. దీనివల్ల నాన్‌-కాంపీట్‌ ఏర్పాట్లు ఆరోగ్యకర పోటీకి అనుగుణంగా ఉన్నాయని నిర్ధారించేలా సదరు పార్టీలే బాధ్యత వహిస్తాయి. నాన్‌-కాంపీట్‌ రిస్ట్రిక్షన్ల నుంచి వ్యాపార పోటీకి సంబంధించిన ఆందోళనలు తలెత్తితే, చట్టంలోని 3 మరియు/ లేదా 4 సెక్షన్ల కింద వాటిని పరిశీలించవచ్చు.

వ్యాపార కలయికల నిబంధనలకు ముసాయిదా సవరణ ప్రతిని సీసీఐ వెబ్‌సైట్‌ (www.cci.gov.in )లో చూడవచ్చు. దీనిపై ప్రజల అభిప్రాయాలను జూన్‌ 15, 2020 కల్లా combination.cci[at]nic[dot]in కు ఈమెయిల్‌ చేయాలి.



(Release ID: 1624250) Visitor Counter : 235