రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

ల్యాండింగ్ క్రాఫ్ట్ యుటిలిటీ ఎంకె -IV , ఐఎన్ఎల్‌సియు ఎల్ 57 (జిఆర్ ఎస్ ఇ యార్డ్ 2098) ఏడవ నౌక పోర్ట్ బ్లెయిర్ వద్ద 15 మే 2020 న‌ ప్రారంభం

లెఫ్టినెంట్ జనరల్ పిఎస్ రాజేశ్వర్, పివిఎస్ఎమ్, ఎవిఎస్ఎమ్, విఎస్ఎమ్, ఎడిసి, కమాండర్-ఇన్-చీఫ్ ఎ అండ్ ఎన్ కమాండ్,

Posted On: 15 MAY 2020 4:24PM by PIB Hyderabad

ఐఎన్ఎల్‌సియు ఎల్ 57 ను 2020 మే 15న పోర్ట్ బ్లెయిర్ వ‌ద్ద భార‌త‌నౌకాద‌ళంలో బాధ్య‌త‌ల‌లోకి తీసుకున్నారు. ఐఎన్ఎల్ సియు ఎల్ 57 నౌక ల్యాండింగ్ క్రాఫ్ట్ యుటిలిటి (ఎల్‌సియు ) ఎంకె 4 త‌ర‌హా లో భార‌త నౌకా ద‌ళంలో చేరుతున్న ఏడ‌వ నౌక‌. ఈ నౌక‌ను దేశీయంగా రూప‌క‌ల్ప‌న‌చేసి , నిర్మించారు. దీనిని మెస్స‌ర్స్ గార్డ‌న్ రీచ్ షిప్ బిల్డ‌ర్స్ , ఇంజ‌నీర్స్ (జిఆర్ఎస్ఇ),కోల్‌క‌తా రూపొందించి నిర్మించింది.  ఐఎన్ఎల్‌సియు ఎల్ 57 నౌకాద‌ళంలో చేర‌డం ద్వారా దేశీయంగా డిజైన్ కు రూప‌క‌ల్ప‌న చేసి, నౌకా నిర్మాణం చేప‌ట్టే సామ‌ర్ద్యానికి ఇదొక ప్ర‌తిరూపంగా చెప్పుకోవ‌చ్చు.
ఎల్ సి కు ఎంకె -IV నౌక‌, ప్రధాన యుద్ధ ట్యాంకులు, సాయుధ వాహనాలు, నావికా ద‌ళాలు,  సామగ్రిని ఓడ నుండి ఒడ్డుకు రవాణా చేయడానికి , మోహరించడానికి ప్రాధ‌మిక  బాధ్య‌త కలిగిన ఉభయచర నౌక. అండమాన్  నికోబార్ కమాండ్ లోఉంటూ, ఈ నౌకలను బీచ్ ఆపరేషన్లు, సెర్చ్ అండ్ రెస్క్యూ, విపత్తు సహాయక చర్యలు, సరఫరా,స‌ర‌కు  నింపడం ,సుదూర ద్వీపాల నుండి తరలించడం వంటి  బహుళ‌ప‌క్ష‌ కార్యకలాపాల కోసం దీనిని వినియోగించ‌వ‌చ్చు..
లెఫ్టినెంట్ కమాండర్ హర్షవర్ధన్ వేణుగోపాల్ నేతృత్వంలోని ఈ నౌకలో ఐదుగురు అధికారులు, 45 మంది నావికులు ఉన్నారు అదనంగా 160 మంది సైనికులను తీసుకువెళ్ల‌గల‌ సామర్థ్యం  దీనికి ఉంది. 830 టన్నుల  బ‌రువు కలిగిన ఈ నౌక ప్ర‌ధాన యుద్ధ ట్యాంకులైన‌ అర్జున్, టి 72 ఇతర వాహనాల వంటి వివిధ రకాల యుద్ధ పరికరాలను రవాణా చేయగలదు. ఇంటిగ్రేటెడ్ బ్రిడ్జ్ సిస్టమ్ (ఐబిఎస్)  ఇంటిగ్రేటెడ్ ప్లాట్‌ఫామ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (ఐపిఎంఎస్) వంటి అత్యాధునిక పరికరాలు అధునాతన వ్యవస్థలతో ఈ నౌకను తీర్చిదిద్దారు.
ఈ త‌ర‌హా నౌక‌ల‌లో చివ‌రిది నిర్మాణంలో ఉంది .దీనిని కోల్‌క‌తా లోని మెస్స‌ర్ జిఆర్ ఎస్ ఇ , నిర్మిస్తోంది. ఇందుకు సంబంధించిన ప‌నులు పురోగ‌తి లో ఉన్నాయి. ఈ సంవ‌త్స‌రం ఆఖ‌రునాటికి ఈ నౌక నౌకాద‌ళానికి చేరే అవ‌కాశం  ఉంది.
ఈ నౌక‌లు ప్ర‌ధాన‌మంత్రి గారి  మేక్ ఇన్ ఇండియా పిలుపున‌కు అనుగుణంగా రూపుదిద్దుకుని, దేశ స‌ముద్ర ప్రాంత భ‌ద్ర‌తా అవ‌స‌రాలకు ఉప‌యోగ‌ప‌డ‌నున్నాయి.


(Release ID: 1624138) Visitor Counter : 242