వ్యవసాయ మంత్రిత్వ శాఖ
లాక్ డౌన్ కాలంలో క్రమం తప్పకుండా పప్పుదినుసులు, నూనెగింజల్ని సేకరిస్తున్న కేంద్రం
2020 -21 రబీ సీజన్‌కుగాను 271 లక్షల మెట్రిక్ టన్నుల గోధుమ పంట. 269 లక్షల మెట్రిక్ టన్నుల గోధుమల కొనుగోలు.
లాక్ డౌన్ కాలంలో పిఎం - కిసాన్ పథకం కింద 9.25 కోట్ల రైతు కుటుంబాలకు రూ.18,500 కోట్లకు పైగా పంపిణీ
Posted On:
13 MAY 2020 6:48PM by PIB Hyderabad
లాక్ డౌన్ కాలంలో అన్నదాతలను ఆదుకోవాలని ఆదేశిస్తూ కేంద్ర వ్యవసాయశాఖకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పలు మార్గదర్శకాలు ఇచ్చారు. వాటి ప్రకారం ఆ మంత్రిత్వ శాఖ అనేక చర్యలను చేపట్టింది. ప్రధాని ఆదేశాల ప్రకారం కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శ్రీ నరేంద్ర సింగ్ తోమర్ దేశంలో రైతులకు సంబంధించిన క్షేత్రస్థాయి కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్నారు. దీనికి సంబంధించిన తాజాసమాచారం ఇలా వుంది.
లాక్ డౌన్ సమయంలో నాఫెడ్ సేకరించిన పంటల వివరాలు
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్నాటక, రాజస్థాన్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్, ఉత్తరప్రదేశ్, హర్యానా రాష్ట్రాలనుంచి 3.17 లక్షల మెట్రిక్ టన్నుల శనగపప్పును సేకరించారు.
రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తర్ ప్రదేశ్, గుజరాత్, హర్యానా రాష్ట్రాలనుంచి 3.67 లక్షల మెట్రిక్ టన్నుల ఆవాలను సేకరించారు.
తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్నాటక, మధ్యప్రదేశ్, గుజరాత్, ఒడిషా రాష్ట్రాలనుంచి 1.86 లక్షల మెట్రిక్ టన్నుల కందిపప్పును సేకరించడం జరిగింది.
రబీ మార్కెట్ సీజన్ 2020-21 లో 277.38 లక్షల మెట్రిక్ టన్నుల గోధుమల్ని ఎఫ్ సిఐ సేకరించింది. వీటిలో 268.90 లక్షల మెట్రిక్ టన్నుల గోధుమల్ని కొనుగోలు చేయడం జరిగింది.
రబీ సీజన్ 2020-21కిగాను 11 రాష్ట్రాలలో 3208 సేకరణ కేంద్రాలను పప్పు దినుసులు, నూనె గింజల సేకరణకోసం కేటాయించారు.
ఇక పిఎం కిసాన్ పథకం వివరాలను చూస్తే లాక్ డౌన్ కాలంలో పిఎం - కిసాన్ పథకం కింద 9.25 కోట్ల రైతు కుటుంబాలు లబ్ధి పొందాయి. అర్హులైన రైతులకు రూ.18,500 కోట్లకు పైగా ఇంతవరకూ విడుదల చేశారు.
*****
(Release ID: 1623736)
Visitor Counter : 299