శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ

కోవిడ్‌-19 మహమ్మారి వ్యాప్తి నేప‌థ్యంలో ఎస్ అండ్ టీని ఉపయోగించి సామాజిక ఆర్ధిక పునరుజ్జీవనం మరియు వైర‌స్‌ను ఎదుర్కొనే స్థితిస్థాపకత పెంపొందించేలా దేశంలోని విజ్ఞాన సంస్థలు దృష్టి

Posted On: 13 MAY 2020 6:34PM by PIB Hyderabad

దేశ వ్యాప్తంగా ఉన్న ప‌లు విజ్ఞాన సంస్థలు సామాజిక, ముద్ర‌ణ మరియు ఎలక్ట్రానిక్ మాధ్యమాలను ఉపయోగించి కోవిడ్-19 పై శాస్త్రీయ అవగాహన కల్పించడం ప్రారంభించాయి. దీనికి తోడు సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం (డీఎస్టీ) వారు శాస్త్రీయ సామాజిక బాధ్య‌తలో (ఎస్‌ఎస్‌ఆర్) భాగంగా జారీ చేసిన సూచ‌న‌ల‌కు ప్రతిస్పందనగా దేశంలో లాక్‌డౌన్ ముగిసిన త‌రువాత కూడా కోవిడ్ -19ను త‌ట్టుకొని నిలిచేందుకు అవ‌స‌ర‌మైన స్థితిస్థాపక అవ‌గాహ‌నకు సంబంధించి ప‌లు చొరవలను కూడా ప్రారంభించారు. డీఎస్టీ కార్యదర్శి ప్రొఫెసర్ అశుతోష్ శర్మ వీటిని గురించి విశ‌దీక‌రిస్తూ తక్షణ మరియు దీర్ఘకాలిక ఎస్ అండ్ టీ జోక్యాలు, అవసరాల్ని ఎస్ఎస్ఆర్ ముందుకు తీసుకువెళ్లే మార్గమ‌న్నారు. సమాజంలోని భాగ‌స్వామ్య ప‌క్షాల వారికి మ‌న‌ శాస్త్రవేత్తలు త‌మ విజ్ఞానాన్ని మరియు ఇత‌ర వనరుల్ని స్వచ్ఛందంగా అందించ‌డం సేవా స్ఫూర్తిని ప్రతిబింబిస్తుంద‌ని అన్నారు. దీనికి తోడుగా సామాజిక ఆర్థిక పునరుజ్జీవనం మరియు కోవిడ్ స్థితిస్థాపకతల‌పై ప్ర‌త్యేక దృష్టి నిలుపుతున్నామ‌ని అన్నారు.
 మేము సైతం అంటూ ప‌లు సంస్థ‌లు..
డీఎస్‌టీ నుంచి నిధులు అందుతున్న సీఎస్‌ఐఆర్- ఎన్‌బీఆర్‌ఐ, ఐసీఏఆర్ ల్యాబ్స్, ఛండీగఢ్ విశ్వవిద్యాలయం, మణిపూర్ విశ్వవిద్యాలయం, శ్రీ‌న‌గ‌ర్‌లోని ఎస్‌కేఏయూఎస్‌టీ‌, పంజాబ్‌లోని
ఫ‌రీద్‌కోట్ కేంద్రంగా ప‌ని చేస్తున్న బాబా ఫరీద్ హెల్త్ సైన్సెస్ విశ్వవిద్యాలయం వారు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) సూచ‌న‌ల ప్రకారం శానిటైజర్ అభివృద్ధి మరియు పంపిణీ కోసం తగిన ప‌రిజ్ఞానాన్ని మరియు వనరులను అందించారు. ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ (పీఎస్ఏ) జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం మాస్క్‌ల‌ తయారీ మరియు కోవిడ్ -19 నిర్ధార‌ణ పరీక్ష కోసం సేవలందించారు. న్యూఢిల్లీలోని ఎయిమ్స్‌లో ప్ర‌స్తుతం కొన‌సాగుతున్న ప్రాజెక్టుల‌లో భాగంగా
గర్భిణీ స్త్రీల నిమిత్తం మొబైల్ యాప్ ఆధారిత నిరంత‌రాయ స‌ల‌హా కేంద్రం ప్రారంభించబడింది.
శ్రీ‌న‌గ‌ర్ కేంద్రంగా ప‌ని చేస్తున్న షేర్-ఎ-కాశ్మీర్ యూనివర్శిటీ ఆఫ్ అగ్రికల్చరల్ సైన్సెస్ అండ్‌ టెక్నాలజీ ఆఫ్ కాశ్మీర్‌లో (ఎస్‌కేఏయూఎస్‌టీ) కొనసాగుతున్న ప్రాజెక్టుల కింద వ్యవసాయ జంతువుల ఆరోగ్యాన్ని పర్యవేక్షించేందుకు టెలిమెడిసిన్ సదుపాయాన్ని కూడా ప్రారంభించింది.
శ్వాస సంబంధిత సమస్యలను పరిష్కరించడానికి, ఆయుర్వేద సూత్రాలపై మూలికా క్షీణత స్ప్రే అభివృద్ధి చేయబడింది. వ్యాధిని నివారించే ప్రక్రియలో భాగంగా న్యూఢిల్లీ స‌ఫ్ధ‌ర్‌గంజ్‌లో ఉన్న‌ ఎయిమ్స్‌లోని వ‌ల‌స ప్ర‌జ‌ల‌కు దాదాపు 5000 లీట‌ర్ల మేర‌ శానిటైజ‌ర్‌‌ను పంపిణీ చేశారు.
హర్యానా, పంజాబ్, యూపీ పోలీసు శాఖ మరియు వ్యాధిని క‌ట్ట‌డి చేసేందుకు వీలుగా త‌గు ప్రక్రియను కొనసాగిస్తున్నారు.
మాన‌సిక స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి పీఎఫ్ఏ-ఈ అభివృద్ధి
డీఎస్టీ నిధులతో కొనసాగుతున్న ప్రాజెక్ట్‌ల్లో అభివృద్ధి చేయబడిన హెర్బల్ శానిటైజర్ యొక్క సాంకేతికతను భారీ ఉత్పత్తి నిమిత్తం కంపెనీలకు బదిలీ చేయడ ‌మైంది. సరసమైన ధ‌ర‌కు ప్రజా వినియోగానికి వాటి సరఫరాను కొనసాగించేందుకు స్థానిక స్థాయిలో పంపిణీ కోసం ప్రోటోకాల్‌ను స్వచ్ఛంద సంస్థలతో పంచుకోబ‌డింది. గూగుల్ ఫార్మ్‌ను వినియోగించి కోవిడ్‌-19 నేప‌థ్యంలో ఎదుర‌య్యే మానసిక సామాజిక సమస్యలను తగ్గించడానికి సైకలాజికల్ ఫస్ట్ ఎయిడ్-ఎపిడెమిక్ ‌(పీఎఫ్ఏ-ఈ) వేదిక అభివృద్ధి ద‌శ‌లో ఉంది. ప్రామాణికమైన వనరుల ద్వారా సమాజం కోవిడ్‌ మరియు మానసిక సామాజిక ప్రతిస్పందనకు సంబంధించి సాహిత్యం ప్రచురించబడుతోంది.
ఆరు నెల‌ల్లో వినియోగంలోకి..
వేర్వేరు పంటలకు మ‌ధ్య కాంటాక్ట్‌ను తగ్గించడానికి వ్యవసాయ కార్మికులకు దూర-అనుకూల వ్యవసాయ పని ప్రణాళిక మరియు ఉద్యమ వ్యూహం అభివృద్ధి చేయబడుతున్నాయి. చేతులు మరియు ఉపరితల పరిశుభ్రత కోసం బయో- సర్ఫ్యాక్టెంట్-ఆధారిత సూత్రీకరణ; ఈ ప్ర‌మాద‌క‌ర వైర‌స్‌కు వ్యతిరేకంగా పోరాడటానికి విషపూరితం కాని, జీవ అనుకూలత మరియు త‌క్కువ ఖర్చుతో కూడిన శరీర శానిటైజేష‌న్‌ మరియు ఓజోన్ మైక్రో-నానో-బబుల్స్ (ఎంఎన్‌బీ లు) ఉపయోగించి స్టెరిలైజేషన్ల‌ నమూనాలు ప్రతిపాదించబడ్డాయి. మ‌రో 6 నెలల్లో వినియోగానికి ఇవి అందుబాటులోకి రానున్నాయి. ఎస్ అండ్ టీ యొక్క ఇంటర్‌ఫేస్ అయిన‌ సైన్స్ ఫర్ ఈక్విటీ ఎంపవర్‌మెంట్ అండ్ డెవలప్‌మెంట్ (సీడ్) డివిజన్ ఆయా విజ్ఞాన సంస్థలకు మద్దతులో విభిన్న సామాజిక సవాళ్ల ప‌రిష్కారం దిశ‌గా కృషి చేస్తోంది. ప్ర‌స్తుతం పెరుగుతున్న మహమ్మారి వల్ల ఎదురయ్యే సవాళ్లను,  ముప్పును ఎదుర్కోవటానికి సమాజం యొక్క సంసిద్ధతను నిర్ధారించడానికి మరియు కోవిడ్‌-19 దీర్ఘకాలిక ప్రభావాన్ని తగ్గించడం దిశ‌గా కూడా చ‌ర్య‌లు చేప‌డుతోంది.

(మరిన్ని వివరాల కోసం, దయచేసి డాక్టర్ రష్మి శర్మ, సైంటిస్ట్-ఈ, డీఎస్‌టీ, Email r.sharma72[at]nic[dot]in, మొబైల్‌ నం + 91-9971538681 ని సంప్రదించండి)



(Release ID: 1623715) Visitor Counter : 203