సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ
జమ్ము కాశ్మీర్ , లద్దాక్ లలో కోవిడ్ -19 కు సంబంధించిన ఏర్పాట్లను , జమ్ముకు రెగ్యులర్ రైలు సర్వీసుల పునరుద్ధరణను సమీక్షించిన కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్
Posted On:
12 MAY 2020 6:55PM by PIB Hyderabad
ఈశాన్యరాష్ట్రాల అభివృద్ది , ప్రధానమంత్రి కార్యాలయ శాఖ,సిబ్బంది, ప్రజాఫిర్యాదులు, పెన్షన్లు, అణుశక్తి, అంతరిక్ష శాఖ కేంద్ర సహాయమంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఈ రోజు జమ్మూ కాశ్మీర్, లడఖ్ లోని అన్ని జిల్లాల డిప్యూటీ కమిషనర్లతో మాట్లాడారు. తాజాగా కోవిడ్ -19 పరిస్థితి, రెండు కేంద్రపాలిత ప్రాంతాలలో చిక్కుకున్న వ్యక్తుల రాక , శ్రామిక్ స్పెషల్ రైళ్ల ద్వారా వచ్చే ప్రయాణీకుల కోసం అధికారయంత్రాంగం చేసిన ఏర్పాట్లు, రేపటి నుండి జమ్మూకు సాధారణ రైలు సేవలను తిరిగి ప్రారంభించడం తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు.
కోవిడ్ -19 సంక్షోభాన్ని నియంత్రించడానికి రెండు కేంద్రపాలిత ప్రాంతాలు సాగించిన నిరంతర , అద్భుత ప్రయత్నాలకు మంత్రి ఆయా జిల్లాల డిప్యూటీ కమిషనర్లను అభినందించారు. ఇతర రాష్ట్రాలు , కేంద్రపాలిత ప్రాంతాల కంటే నిర్వహణ చాలా బాగుందని డాక్టర్ సింగ్ అన్నారు. వాస్తవానికి జమ్మూ కాశ్మీర్ లో కేసుల సంఖ్య రెట్టింపు సమయం ,జాతీయస్థాయి సగటు కంటే మెరుగ్గా ఉందని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. కోవిడ్ -19 కేసులను గుర్తించేందుకు అధిక సంఖ్యలో పరీక్షలు నిర్వహించడం పట్ల ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు
వివిధ ప్రాంతాలలో చిక్కుకున్న 50,000 మంది వ్యక్తులు కేంద్రపాలిత ప్రాంతాలకు తిరిగి వచ్చారని వీరిలో విద్యార్థులు కూడా ఉన్నారన్నారు. వారిని పరీక్షించడం, క్వారంటైన్కు ఏర్పాట్లు చేయడం కోవిడ్ లేదని తేలిన వారిని ఇంటికి పంపించడం వంటి వాటిలో పాలనాయంత్రాంగం చక్కగా పనిచేస్తున్నదని అన్నారు.
.సామాజిక దూర నిబంధనలను కొనసాగించడానికి వేర్వేరు రోజులలో వేర్వేరు సమయాల్లో వేర్వేరు దుకాణాలను రద్దీలేకుండా ఉండేలా తెరవాలని మంత్రి డిసిలను కోరారు. పౌరుల రక్షణ కోసం ఆరోగ్య సేతు యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవడం, ఉపయోగించడం గురించి కేంద్ర హో్ంమంత్రిత్వ శాఖ సూచనలను మంత్రి పునరుద్ఘాటించారు. .
(Release ID: 1623398)
Visitor Counter : 193