శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని ఆర్థికవ్యవస్థను పునర్వ్యవస్థీకరించేందుకు భారతదేశం సంసిద్ధంగా ఉంది – డాక్టర్ హర్షవర్ధన్
· జాతీయ సాంకేతిక దినోత్సవాన్ని పురస్కరించుకుని ‘RE-START - రీబూట్ ద ఎకానమీ త్రూ సైన్స్, టెక్నాలజీ అండ్ రీసెర్చ్ ట్రాన్సలేషన్స్’ పేరుతో ఏర్పాటు చేసిన డిజిటల్ సమావేశంలో ప్రసంగించిన డాక్టర్ హర్షవర్థన్
· టి.డి.బి. సహకారంతో పనిచేస్తున్న సాంకేతిక పరిజ్ఞానం గల కంపెనీల వర్చువల్ ఎక్స్ పోజిషన్ ప్రారంభం
· వివిధ సంస్థలు మరియు కంపెనీలు డిజిటల్ బి2బి లాంజ్ ద్వారా తమ ఉత్పత్తులను ఎక్స్ పోజిషన్ లో ప్రదర్శిస్తున్నాయి.
Posted On:
11 MAY 2020 5:30PM by PIB Hyderabad
భారతదేశం చేస్తున్న కోవిడ్ -19 వ్యతిరేకం పోరాటం బలంగా, స్థిరంగా, వేగంగా ముందుకు సాగుతోందని కేంద్ర సైన్స్ & టెక్నాలజీ, ఎర్త్ సైన్సెస్ మరియు హెల్త్ & ఫ్యామిలీ వెల్ఫేర్ శాఖల మంత్రి డాక్టర్ హర్ష్ వర్ధన్ తెలిపారు. జాతీయ సాంకేతిక దినోత్సవాన్ని పురస్కరించుకుని ‘RE-START - రీబూట్ ద ఎకానమీ త్రూ సైన్స్, టెక్నాలజీ అండ్ రీసెర్చ్ ట్రాన్సలేషన్స్’ పేరుతో ఏర్పాటు చేసిన డిజిటల్ సమావేశంలో ఆయన ప్రసంగించారు. సైన్స్ అండ్ టెక్నాలజీ (డిఎస్టి) మరియు కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సిఐఐ) యొక్క చట్టబద్ధమైన సంస్థ టెక్నాలజీ డెవలప్మెంట్ బోర్డ్ (టిడిబి) ఈ సమావేశాన్ని నిర్వహించింది.
దేశంలో కోవిడ్ వంటి అంటువ్యాధులకు సైన్స్ & టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ప్రతిస్పందనను ప్రశంసించిన డాక్టర్ హర్ష్ వర్ధన్, ఎస్ & టి ప్రతిస్పందన మొత్తం ఎస్ & టి పర్యావరణ వ్యవస్థ యొక్క సహకార స్ఫూర్తిని ప్రతిబింబిస్తుందని నొక్కి చెప్పారు. భారత ప్రభుత్వం, విద్యావేత్తలు, శాస్త్రవేత్తలు, స్టార్టప్‌లు, వ్యవస్థాపకులు మరియు పరిశ్రమలు ఈ మహమ్మారిని ఎదుర్కోవటానికి పరిష్కారాలను కనుగొనటానికి అవిశ్రాంతంగా కృషి చేస్తున్నాయన్నారు. కోవిడ్ -19 విషయంలో సత్వరమే మరియు అమలు చేయగల పరిష్కారాలను కనుగొనడానికి శాస్త్రవేత్తలు, వ్యవస్థాపకులు మరియు సంస్థలు చేస్తున్న కృషిని మేము అభినందించాలని తెలిపారు. కొత్త ఆవిష్కరణలు, పరిశ్రమల భాగస్వామ్యం మరియు మెరుగైన పరిశోధనలు వేగంగా అభివృద్ధి చెందడమే గాక, వాటికి మంచి ఆదరణ కూడా లభించిందని మంత్రి తెలిపారు.
స్వల్ప వ్యవధిలోనే కొత్త పరీక్షా వస్తు సామగ్రి, రక్షణ పరికరాలు, శ్వాసకోశ పరికరాలు మొదలైన వాటిని అభివృద్ధి చేయడానికి దేశం అనేకమంది పరిశోధకులను సమీకరించగలిగిందని చెప్పారు.
కోవిడ్-19 సంబంధిత సాంకేతిక సామర్థ్యాలను గుర్తించడానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘కోవిడ్-19 టాస్క్ ఫోర్స్’ గురించి ఈ సందర్భంగా వివరించిన డాక్టర్ హర్షవర్థన్, “మేక్ ఇన్ ఇండియా” కార్యక్రమానికి మా ప్రభుత్వం సంపూర్ణ మద్దతు అందించిందని తెలారు. ఈ చొరవ కోవిడ్ -19 పరీక్షలు, మాస్క్ లు, శానిటైజర్లు, వ్యక్తిగత రక్షణ పరికరాలు (పిపిఇలు) మరియు వెంటిలేటర్లను అభివృద్ధి చేయడానికి శాస్త్రీయ సంస్థలు మరియు స్టార్టప్‌లను ఊతమిచ్చిందని తెలిపారు.
ఈ సంవత్సరం జాతీయ సాంకేతిక దినోత్సవం సందర్భంలో విస్తృతమైన ఆర్థిక ప్రభావాన్ని తగ్గించడమే గాక కొత్త మంత్రంగా స్వావలంబనను ఉపయోగించుకుని బలమైన పునరుద్ధరణకుసిద్ధం కావలసిన అవసరం ఉందని, అందుకే సాంకేతిక మరియు పారిశ్రామిక రంగంలో వృద్ధిని మెరుగు పరిచేందుకు కొత్త అవకాశాల దిశగా దృష్టిని సారిస్తున్నామని డాక్టర్ హర్షవర్థన్ నొక్కి చెప్పారు.
ఈ సందర్భంగా నీతి ఆయోగ్ సభ్యులు డాక్టర్ వి.కె.సరస్వత్ మాట్లాడుతూ, ప్రపంచాన్ని నూతన సాధారణ స్థితికి సర్దుబాటు చేస్తున్నప్పుడు ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి చేయడంలో నూతన యుగ సాంకేతిక పరిజ్ఞానాలు, వైద్య మరియు ఉత్పాదనలో సాంకేతిక పరిజ్ఞాన ప్రాముఖ్యతను ఎత్తిచూపారు.
భారత ప్రభుత్వ ప్రధాన శాస్త్రీయ సలహాదారు ప్రొఫెసర్ కె.విజయ్ రాఘవన్ మాట్లాడుతూ, సాంకేతిక పరిజ్ఞానం మన జీవితాలను, భవిష్యత్తులో మనం చేసే పనులను ఎలా మార్చగలదో ఎత్తి చూపారు, ముఖ్యంగా కోవిడ్ అనంతర కాలంలో. భవిష్యత్ కోసం ముందుకు సాగడానికి ఇది ఒక అవకాశమని, భవిష్యత్తులో సవాళ్లకు మెరుగైన సన్నద్ధమైన ఆర్ అండ్ డి వర్క్ ఫోర్స్ మరియు పర్యావరణ వ్యవస్థ భారతదేశాన్ని మరింత సంసిద్ధత దిశగా నడిపిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.
డి.ఎస్.టి. 50వ సంవత్సరంలోకి అడుగు పెట్టిన నేపథ్యంలో, డి.ఎస్.టి కార్యదర్శి ప్రొఫెసర్ అశుతోష్ శర్మ, కోవిడ్ -19 కొనసాగుతున్న కాలంలో ఎదుర్కొన్న సవాళ్లను దృష్టిలో ఉంచుకుని జాతీయ సాంకేతిక దినోత్సవం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. కోవిడ్-19 సంక్షోభం ఆర్ & డి మరియు సాంకేతిక అభివృద్ధిని వివిధ రీతుల్లో పనిచేయడానికి దారితీసిందని ఆయన నొక్కి చెప్పారు. ప్రైవేట్-పబ్లిక్ మోడల్ ఆర్ & డిని మరింత ఎత్తుకు ప్రోత్సహించిందని, ఆమోదయోగ్యమైన అనువాదాలు, ప్రోటోటైపింగ్, స్టార్ట్-అప్‌లు మరియు పరిశ్రమలు అపారమైన వృద్ధిని సాధించాయని తెలిపారు. ఆర్థిక వ్యవస్థను రీబూట్ చేయడానికి నూతన యుగ సాంకేతికతలు, తగిన జాతీయ మిషన్లు, కార్యక్రమాలు మరియు శీఘ్ర చర్యల్లోకి రావడానికి పథకాలు అవసరమని అభిప్రాయపడ్డారు. రెడీమేడ్ సొల్యూషన్స్ అందుబాటులో లేనిచోట, పరిశోధన మరియు అభివృద్ధి మరింత లోతుగా, సంబంధితమైనవిగా, వేగవంతమైనవిగా, ప్రభావవంతమైనవిగా పరిశ్రమకు బలంగా అనుసంధానించబడాలని తెలిపారు. ఇప్పుడు నేర్చుకున్న పాఠాలు స్థిరమైన అభివృద్ధి, వాతావరణ మార్పు, పరిశ్రమ 4.0, సూక్ష్మజీవుల నిరోధకత వంటి భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లను పరిష్కరించడంలో సహాయపడతాయి.
మహమ్మారిని ఎదుర్కొనేందుకు మరియు ముందుకు సాగేందుకు అంతర్జాతీయంగా తీసుకున్న చర్యలను ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ సౌమ్య స్వామినాథన్ ప్రముఖంగా తెలిపారు. కోవిడ్ -19 సవాలును భారత్ పరిష్కరించిన తీరును వారు ప్రశంసించారు.
సి.ఐ.ఐ, డి.జి. శ్రీ చంద్రజిత్ బెనర్జీ, సి.ఐ.ఐ. అధ్యక్షుడు శ్రీ విక్రమ్ కిర్లోస్కర్, టి.డి.బి. కార్యదర్శి డాక్టర్ నీరజ్ శర్మలు ప్రారంభ సమావేశంలో పాల్గొన్న వారిలో ఉన్నారు.
ఈ సందర్భంగా డాక్టర్ హర్షవర్థన్ టి.డి.బి. సహకారంతో పనిచేస్తున్న సాంకేతిక పరిజ్ఞానం గల కంపెనీల వర్చువల్ ఎక్స్ పోజిషన్ ప్రారంభించారు. వివిధ సంస్థలు మరియు కంపెనీలు తమ ఉత్పత్తులను డిజిటల్ బి 2 బి లాంజ్ ద్వారా ప్రదర్శించాయి.
ఈ సమావేశం ద్వారా శాస్త్రవేత్తలు, టెక్నోక్రాట్లు, ప్రభుత్వ అధికారులు, డిప్లమాట్లు, డబ్ల్యు.హెచ్.ఓ. అధికారులు, జాతీయ అంతర్జాతీయ పరిశ్రమలు, పరిశోధనా సంస్థలు, విద్యాసంస్థల ప్రముఖులను ఆరోగ్య సంక్షోభం మరియు ప్రస్తుత సవాళ్ళకు పరిష్కరాలు కనుగొనేదిశగా ఒకే వేదిక మీదకు తీసుకువచ్చారు.
ఈ కాన్ఫరెన్స్ లో ‘మెడిసిన్స్ & మెడికల్ టెక్నాలజీస్’ ‘అడ్వాన్స్‌డ్ మెటీరియల్స్ - న్యూ టెక్నాలజీ హారిజన్స్’, ‘అడ్వాన్స్‌డ్ మాన్యుఫ్యాక్చరింగ్ టెక్నాలజీస్ ఫర్ సస్టైనబుల్ ఫ్యూచర్ & గ్లోబల్ ఇన్నోవేషన్’ మరియు ‘టెక్నాలజీ అలయన్స్ ఫర్ గ్లోబల్ ఎకనామిక్ లీడర్‌షిప్’ పై సాంకేతిక సమావేశాలు నిర్వహిస్తారు.
***
(Release ID: 1623109)
Visitor Counter : 224