సూక్ష్మ‌, లఘు, మధ్య త‌ర‌హా సంస్థల మంత్రిత్వ శాఖష్

కరోనా వైరస్ వ్యాప్తిని నివారించేలా ముంద‌స్తు పద్ధతులను వినూత్నంగా ఉపయోగిస్తున్న కేవీఐసీ కుమ్మ‌రులు

Posted On: 11 MAY 2020 5:23PM by PIB Hyderabad

కోవిడ్ -19 కు వ్యతిరేకంగా చేస్తున్న పోరాటంలో అతిచిన్న అంశం కూడా ఆశలు పెంచుతున్న సమయంలో రాజస్థాన్ గ్రామంలో కేవీఐసీ కుమ్మరులు చాలా మంది క‌ఠిన కరోనా వైరస్ వ్యాప్తిని నివారించడానికి ప్రత్యేక ప్రచారం నిర్వ‌హిస్తూ దేశం దృష్టి ఆకర్షిస్తున్నారు. రాజస్థాన్‌లోని బరణ్ జిల్లాలోని కిషన్‌గంజ్ గ్రామంలోని కుమ్మరులు తయారుచేసిన ప్రతి మట్టి కుండ మ‌రీ ముఖ్యంగా
కూజాల‌పై కరోనాతో పోరాడే మార్గాలను గురించిన సందేశాన్ని అందిస్తున్నారు. ఈ కుండ‌ల‌ను కొనుక్కొని ఇంటికి తీసుకుపోయే కుటుంబ సభ్యులు.. నీరు త్రాగినప్పుడు ప్ర‌తీసారీ ఆ సందేశం చూసి క‌రోనా క‌ట్ట‌డికి జాగురుక‌త‌తో వ్య‌వ‌హ‌రించేలా చేయ‌డం వీరి ఉద్దేశం. క‌రోనాపై పోరాడే మార్గాల‌ను గురించిన సందేశాన్ని ప్రతి ఇంటికి చేరుకునేలా చూడ‌టానికి వీలుగా కిషన్‌గంజ్ గ్రామంలోని కుమ్మరులు ఈ వినూత్న ఆలోచ‌న‌తో ముందుకు వ‌చ్చారు. “మాస్క్‌వాడండి”, “స్టే హోమ్.. స్టే సేఫ్”, “ప్రివెన్షన్ ఈజ్ క్యూర్”,“కరోనా జాగ్రత్త వహించండి” వంటి సందేశాలను ఈ కూజాల‌‌పై కుమ్మ‌రులు ముద్రించారు. ఇది ఇంటిలోని ప్రతి సభ్యుడు రోజుకు కనీసం 4-5 సార్లు సందేశాలను చదివేలా చేస్తుంది. ఉష్ణోగ్రత పెర‌గ‌డంతో తాజాగా ఇక్క‌డ కుండ‌లు, కూజాల అమ్మకాలు పుంజుకున్నాయి.
విల‌క్ష‌ణ మార్గంలో విష‌యం చేర‌వేత‌..
క‌రోనా క‌ట్ట‌డికి గాను కుమ్మ‌రులు చేస్తున్న ప్ర‌య‌త్నాల‌ను కేవీఐసీ ఛైర్మన్ శ్రీ విన‌య్‌ కుమార్ సక్సేనా ప్రశంసించారు. ఇటువంటి విలక్షణమైన మార్గాలలో ప్రజలకు విష‌యాన్ని చేర‌వేయ‌డం కరోనాపై పోరాటంలో గొప్ప ప్రభావాన్ని చూపుతుంద‌ని అన్నారు. ఇలాంటి ప్రత్యేకమైన ప్రచారం చాలా మందికి స్ఫూర్తిదాయకంగా ఉంటుందని ఆయన అన్నారు. కిష‌న్‌గంజ్ గ్రామంలో ఉన్న ఈ
కుమ్మ‌రులు, దేశ‌వ్యాప్తంగా కుమ్మ‌రుల సమాజాన్ని బ‌లోపేతం చేయ‌డాని‌కి ఉద్దేశించిన కేవీఐసీ యొక్క కుమ్మ‌ర్ స‌శక్తికరన్ కార్య‌క్ర‌మం లబ్ధిదారుల‌వ‌డం గమనార్హం. ఉత్తర ప్రదేశ్, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, మహారాష్ట్ర, జ‌మ్ము అండ్ కాశ్మీర్‌, హర్యానా, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, అస్సాం, గుజరాత్, తమిళనాడు, ఒడిశా, తెలంగాణ, బీహార్ రాష్ట్రాల‌లోని పలు మారుమూల ప్రాంతాల్లోనూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాజస్థాన్‌లో జైపూర్, కోటా, జాల్‌వార్‌, శ్రీ గంగానగర్ సహా డజనుకు పైగా జిల్లాలకు ఈ కార్యక్రమం ద్వారా లబ్ధి చేకూరింది. “కుమ్హార్ స‌శక్తికరన్ కార్యక్రమం కుమ్మరుల జీవితాలను మార్చివేసింది. ఆధునిక పరికరాలు మరియు శిక్షణతో కుమ్మరులను అందించడం ద్వారా కుమ్మరుల స‌మాజాన్ని తిరిగి ప్రధాన స్రవంతిలోకి తీసుకురావడం ఈ మిషన్ యొక్క ముఖ్య లక్ష్యం. మేము వారిని సమాజంతో తిరిగి అనుసంధానం చేయడానికి మరియు వారి కళను పునరుద్ధరించడానికి ప్రయత్నిస్తున్నాము” అని శ్రీ సక్సేనా అన్నారు.
దాదాపు 60,000 మందికి ప్ర‌యోజ‌నం..
కేవీఐసీ ఇప్పటి వరకు 14,000 కి పైగా విద్యుత్‌తో న‌డిచే కుమ్మరి చక్రాలను (చాక్) కుమ్మరులకు పంపిణీ చేసిందని, ఈ కార్యక్రమంలో ఇప్పటి వరకు దాదాపు 60,000 మందికి ప్రయోజనం చేకూర్చిందని ఆయన అన్నారు. ఈ పథకం కింద, కుండల ఉత్పత్తుల తయారీకి బంకమట్టిని కలపడానికి బ్లంగర్ మరియు పగ్ మిల్లుల వంటి పరికరాలను కూడా కేవీఐసీ అందిస్తుంది. ఈ ప‌థ‌కం కింద అందించిన యంత్రాలు కుండల తయారీ ప్రక్రియ నుండి దుర్వినియోగాన్ని తొలగించాయి. ఫలితంగా కుమ్మరుల ఆదాయం 7-8 రెట్ల మేర‌ పెరిగింది. 

 


(Release ID: 1623082) Visitor Counter : 202