ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

“ యాంటీబాడీని గుర్తించడం కోసం, పూణే లోని ఐ.సి.ఎం.ఆర్-ఎన్.ఐ.వి. అభివృద్ధి చేసిన సమర్ధవంతమైన స్వదేశీ ఐజిజి ఎలిసా పరీక్ష, కోవిడ్-19 కోసం చేపట్టే నిఘాలో కీలక పాత్ర పోషిస్తుంది" - డాక్టర్ హర్ష వర్ధన్.

Posted On: 10 MAY 2020 8:07PM by PIB Hyderabad

కోవిడ్-19 కోసం యాంటీబాడీ గుర్తింపు కోసం పూణే లోని భారత్ వైద్య పరిశోధనా మండలి (ఐ.సి.ఎమ్.ఆర్.)-నేషనల్ ఇన్ స్టిట్యూట్ అఫ్ వైరాలజీ,  స్వదేశీ ఐజిజి ఎలిసా పరీక్ష "కోవిడ్ కవచ్ ఎలిసా" ను అభివృద్ధి చేసి, ధృవీకరించింది. 

కోవిడ్-19 మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా 214 దేశాల్లో వ్యాప్తిచెందగా, మొత్తం 38,55,788 మందికి సోకినట్లు  ధృవీకరించారు. 2,65,862 మంది మృతి చెందారుప్రపంచంలోని చాలా దేశాలు అనుబాటులోఉన్న అన్ని అవకాశాలను ఉపయోగించి మహమ్మారిని కట్టడిచేయడానికి కృషి చేస్తున్నాయి.  ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలలో వివిధ రకాలైన డయాగ్నొస్టిక్ పరీక్షల డిమాండ్ పెరిగింది. కోవిడ్-19 గుర్తించడానికి ఉపయోగపడే పదార్థం ఎక్కువగా ఇతర దేశాల నుండి భారతదేశానికి దిగుమతి అవుతోంది. అందువల్ల, కోవిడ్-19 సోకడానికి కారణమైన సార్స్-కోవ్-2 కోసం స్వదేశీ విధానాలను అభివృద్ధి చేయడంలో భారతీయ శాస్త్రవేత్తలు అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారు.  

పూణే లోని ఐ.సి.ఎమ్.ఆర్.-ఎన్.ఐ.వి. వైరాలజీ పరిశోధనలో అత్యాధునిక మౌలిక సదుపాయాలు, నైపుణ్యం కలిగిన దేశంలోని అత్యున్నత ప్రయోగశాల. ఎన్.ఐ.వి. కి చెందిన సమర్ధవంతమైన శాస్త్రీయ బృందం భారతదేశంలో ప్రయోగశాల నిర్ధారించిన రోగుల నుండి సార్స్-కోవ్-2 వైరస్ ను విజయవంతంగా వేరు చేయగలిగింది.  దీంతో, సార్స్-కోవ్-2 కోసం స్వదేశీ విశ్లేషణల అభివృద్ధికి మార్గం సుగమం అయ్యింది.  

రియల్ టైమ్ ఆర్.టి.-పి.సి.ఆర్.  అనేది సార్స్-కోవ్-2  గుర్తించడానికి చేసే ముందు పరీక్ష కాగా, వ్యాధి సంక్రమణకు గురయ్యే జనాభా నిష్పత్తిని అర్థం చేసుకోవడానికి,  నిఘా కోసం బలమైన యాంటీబాడీ పరీక్షలు కీలకం.

పూణేలోని ఐ.సి.ఎమ్,ఆర్.-ఎన్.ఐ.వి లోని శాస్త్రవేత్తలు సార్స్ సార్స్-కోవ్-2 కోసం యాంటీబాడీని గుర్తించడానికి పూర్తిగా స్వదేశీ ఐ.జి.జి. ఎలిసా పరీక్షను అభివృద్ధి చేసి, ధృవీకరించడానికి కృషి చేశారు.  ఈ పరీక్షను ముంబాయిలోని రెండు ప్రదేశాల్లో ధృవీకరించబడింది. ఇది అధిక సూక్ష్మ గ్రాహ్యత, నిర్దిష్టత గురింపు పొందింది.  దీనికి అదనంగా,  రెండున్నర గంటల సమయంలో  90 నమూనాలను ఒకే సారి పరీక్షించే అవకాశం ఉంది.  అంతేకాకుండా, ఎలిసా కిట్ లో క్రియారహితం చేసిన వైరస్ ఉన్నందువల్ల, జిల్లా స్థాయిలో కూడా ఎలిసా ఆధారిత పరీక్ష సులభంగా సాధ్యమవుతుంది. రియల్ టైమ్ ఆర్.టి.-పి.సి.ఆర్. పరీక్షతో పోలిస్తే కనీస జీవ భద్రత, బయో-సెక్యూరిటీ అవసరాలు కూడా ఉన్నాయి. ఇటీవల భారతీయ మార్కెట్లోకి వెల్లువలా వచ్చిన అనేక వేగవంతమైన పరీక్షా వస్తు సామగ్రితో పోలిస్తే,  ఈ పరీక్ష చాలా ఎక్కువ సున్నితత్వాన్నీ, శిష్టతను కలిగి ఉంది.

ఈ సందర్భంగా డాక్టర్ హర్ష వర్ధన్ మాట్లాడుతూ, “ యాంటీబాడీని గుర్తించడం కోసం, పూణే లోని ఐ.సి.ఎం.ఆర్-ఎన్.ఐ.వి. అభివృద్ధి చేసిన  సమర్ధవంతమైన  స్వదేశీ ఐజిజి ఎలిసా పరీక్ష, సార్స్-కావ్-2 కరోనావైరస్ సంక్రమణకు గురైన జనాభా నిష్పత్తిని పర్యవేక్షించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ” అని పేర్కొన్నారు

ఎలిసా టెస్ట్ కిట్ల భారీ ఉత్పత్తి కోసం ఐ.సి.ఎం.ఆర్.  జైడస్ కాడిలా అనే సంస్థతో  భాగస్వామ్యం కుదుర్చుకుంది.  పూణేలోని ఐ.సి.ఎం.ఆర్-ఎన్.ఐ.వి. లో అభివృద్ధి తరువాత, భారీ స్థాయిలో ఉత్పత్తికోసం, సాంకేతిక పరిజ్ఞానాన్ని,  ఆవిష్కరణలతో నడిచే ఒక  ప్రపంచ స్థాయి ఆరోగ్య సంరక్షణ సంస్థ,  జైడస్ కాడిలాకు బదిలీ చేయడం జరిగింది.  ఎలిసా టెస్ట్ కిట్ల ఆమోదం, వాణిజ్య సరళిలో ఉత్పత్తిని వేగవంతం చేయడానికి,  జైడస్ సంస్థ ముందుగానే సవాలును చేపట్టింది.  ఈ టెస్టు కు "కోవిడ్ కవచ ఎలీషా" అని పేరు పెట్టారు.  ఇది రికార్డ్ సమయంలో “మేక్ ఇన్ ఇండియా” యొక్క పరిపూర్ణమైన ఒక ఉదాహరణ.

*****(Release ID: 1622817) Visitor Counter : 591