రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ

కోవిడ్-19 మహమ్మారి వల్ల అనేక సవాళ్లు ఎదురవుతున్నా

ఎన్ పి కె ఎరువులు సుఫల అమ్మకాల్లో 35 శాతం వృద్ధి నమోదు చేసుకున్న ఆర్‌సిఎఫ్

Posted On: 09 MAY 2020 4:03PM by PIB Hyderabad

కోవిడ్-19 లాక్‌డౌన్ వల్ల ఎదురైన అనేక లాజిస్టిక్ఇతర సవాళ్లు ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వంలోని రసాయనాలుఎరువుల మంత్రిత్వ శాఖ పరిధిలోని పిఎస్‌యు అయిన రాష్ట్రీయ కెమికల్స్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ (ఆర్‌సిఎఫ్) గొప్ప పనితీరును ప్రదర్శించి  2019 ఏప్రిల్‌తో పోలిస్తే 2020 ఏప్రిల్ నెలలో ఎన్‌పికె ఎరువులు సుఫల అమ్మకాలలో 35.47 శాతం పెరుగుదలను నమోదు చేసింది. కోవిడ్-19 లాక్‌డౌన్ వల్ల ఎదురైన అపారమైన లాజిస్టిక్, ఇతర సవాళ్లు ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వంలోని రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ పరిధిలోని పిఎస్‌యు అయిన రాష్ట్రీయ కెమికల్స్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ (ఆర్‌సిఎఫ్) గొప్ప పనితీరును ప్రదర్శించి  2019 ఏప్రిల్‌తో పోలిస్తే 2020 ఏప్రిల్ నెలలో ఎన్‌పికె ఎరువులు సుఫల అమ్మకాలలో 35.47 శాతం పెరుగుదలను నమోదు చేసింది. 

 

వ్యవసాయ పోషకాల అవసరాలను తీర్చడంలో ఉత్సాహాన్ని కనబరిచిన ఆర్‌సిఎఫ్‌ను రసాయనఎరువుల మంత్రి శ్రీ డివి సదానంద గౌడ అభినందించారు. ఈ ఉత్సాహ కరమైన అమ్మకాలతో రైతులు అధిక దిగుబడిని పొందుతారు. కోవిడ్-19 మహమ్మారిని అరికట్టడానికి ప్రకటించిన లాక్ డౌన్  ఇబ్బందులను అధిగమించి దేశంలోని రైతులకు సహాయం చేయడానికి తన మంత్రిత్వ శాఖ పరిధిలోని వివిధ ఎరువుల పిఎస్‌యులు తీవ్రంగా కృషి చేస్తున్నాయని ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. శ్రీ గౌడ తన ఎరువుల శాఖతో పాటువిత్తు వేసే కాలంలో అవసరమైన ఎరువుల ఉత్పత్తిరవాణాపంపిణీని సులభతరం చేయడానికి వ్యవసాయ మంత్రిత్వ శాఖలు / కేంద్రంలోని ఇతర సంబంధిత విభాగాలలోరాష్ట్రాలు / యుటిలలో తన సహచరులతో సంప్రదింపులు జరుపుతున్నట్టు చెప్పారు. 

కోవిడ్ -19 మహమ్మారి నేపథ్యంలోమహారాష్ట్ర వ్యవసాయ శాఖ సహాయంతో రైతులకు ఎరువులు నిరంతరం సరఫరా చేసేలా ఆర్‌సిఎఫ్ చర్యలు తీసుకుంటుందని ఆ సంస్థ సిఎండి ఎస్‌సి ముద్గేరికర్ ట్వీట్‌లో పేర్కొన్నారు. రైతుల భద్రత కోసంవ్యవసాయ క్షేత్రాల సరిహద్దు వద్ద ఎరువులు పంపిణీ చేస్తున్నారు. ఇది కాకుండా ఆర్‌సిఎఫ్ ట్రోంబే యూనిట్ 6.178 ఎంకే క్యాలరీ / ఎంటి శక్తి సామర్థ్యంలో కొత్త మైలురాయిని నెలకొల్పింది.    

కార్పోరేట్ సోషల్ రెస్పాన్స్‌బిలిటీ పట్ల బలమైన విశ్వాసం ఉన్న ఆర్‌సిఎఫ్దీనిలో భాగంగానిరుపేదలకు ప్రయోజనం చేకూర్చడంసర్వ జన శ్రేయస్సు కోసంపిఎం కేర్స్ ఫండ్‌కు 83.56 లక్షలుమహారాష్ట్ర సిఎంఆర్‌ఎఫ్‌కు 83.50 లక్షలు అందించింది. ఆ ఉద్యోగులు కూడా ముందుకు వచ్చి ఒక రోజు జీతం అందించారు.

"మినీ రత్న" అయిన ఆర్‌సిఎఫ్ , దేశంలో ఎరువులురసాయనాల తయారీలో ప్రముఖమైనది. ఇది యూరియాకాంప్లెక్స్ ఎరువులుబయో ఎరువులుసూక్ష్మ పోషకాలునీటిలో కరిగే ఎరువులుఅనేక రకాల పారిశ్రామిక రసాయనాలను తయారు చేస్తుంది. ఈ సంస్థ గ్రామీణ భారతంలో ఇంటింటికి ఒక చిరునామాగా మారి, “ఉజ్జ్వలా” (యూరియా), “సుఫలా” (కాంప్లెక్స్ ఎరువులు) బ్రాండ్లతో అధిక బ్రాండ్ ఈక్విటీని కలిగి ఉంది. ఎరువుల ఉత్పత్తులతో పాటురంగులుద్రావకాలుతోలుఫార్మస్యూటికల్స్ఇతర పారిశ్రామిక ఉత్పత్తుల తయారీకి ముఖ్యమైన పారిశ్రామిక రసాయనాలను కూడా ఆర్‌సిఎఫ్  పెద్ద సంఖ్యలో ఉత్పత్తి చేస్తుంది. 

**** 



(Release ID: 1622566) Visitor Counter : 284