నూతన మరియు పునరుత్పాదక శక్తి మంత్రిత్వ శాఖ
కేంద్రప్రభుత్వరంగ సంస్థ అయిన ఎస్.ఇ.సి.ఐ ఆర్టిసి సరఫరాతో 400 మెగావాట్ల ఆర్‌ఇ ప్రాజెక్టులకు ఇ-రివర్స్ వేలం నిర్వహిస్తుంది ఫలితంగా తొలి ఏడాది చరిత్రాత్మకంగా టారిఫ్ రూ 2.90/kWh అవుతుంది.
Posted On:
09 MAY 2020 3:24PM by PIB Hyderabad
భారత పునరుత్పాదక ఇంధన (ఆర్.ఇ) రంగం ఈరోజు చరిత్ర సృష్టించింది. 400 మెగావాట్ల పునరుత్పాదక ఇందన (ఆర్.ఇ)ప్రాజెక్టులకు సంబంధించి నిరంతర సరఫరాకు ఈ రివర్స్ ఆక్షణ్ జరిగింది. ఇందులో తొలి ఏడాది టారిఫ్ చరిత్రాత్మకంగా రూ 2.90/kWh గా నిర్ధారించారు. ఇందుకు సంబంధించిన బిడ్డింగ్‌ను కేంద్ర ప్రభుత్వ నూతన, పునరుత్పాదక ఇంధన మంత్రిత్వశాఖ కింద గల కేంద్ర పి.ఎస్.యు అయిన సోలార్ ఎనర్జీ కార్పోరేసన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ బిడ్డింగ్ నిర్వహించింది.
400 మెగావాట్ల కెపాసిటిని మెస్సర్స్ రిన్యూ సోలార్ పవర్ ప్రైవేట్ లిమిటెడ్‌కు కేటాయించారు. ఈ వేలంలో పలువురు పాల్గొన్నారు. మూడు గంటలపాటు జరిగిన వేలంలో టారిఫ్ కనిష్టంగా 69 పైసలు పడిపోయింది.
ఇందుకు కృషి చేసిన ఎస్.ఇ.సి.ఐని నూతన పునరుత్పాదక ఇంధన శాఖ ఇన్‌ఛార్జి సహాయమంత్రి, నైపుణ్య శిక్షణ , ఎంటర్‌ప్రెన్యూయర్ షిప్ శాఖ సహాయమంత్రి శ్రీ ఆర్.కె.సింగ్ అభినందించారు. ఇందుకు సంబంధించి నిన్న సాయంత్రం ఆయన ఒక ట్వీట్ చేస్తూ, భారత పునరుత్పాదక ఇంధన రంగ కథనంలో సువర్ణాధ్యాయం ప్రారంభమైంది.400 మెగావాట్ల పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులకు జరిగిన ఈ - రివర్స్ ఆక్షన్ నిరంతర సరఫరాకు సంబంధించి ఎస్.ఇ.సి.ఐ లిమిటెడ్ నిర్వహించగా, చరిత్రాత్మకంగా తొలిఏడాది టారిఫ్ రూ.2.90/kWh. అయింది. నూరు శాతం పునరుత్పాదక ఇంధనం ద్వారా పటిష్టమైన , అందుబాటు ధరలో ఆర్‌టిసి సరఫరాకు ఎం.ఎన్.ఆర్.ఇ నూతన ఆరంభంగా నిలుస్తుంది. అని పేర్కొన్నారు.
400 మెగావాట్ల సామర్థ్యం కోసం పిలిచిన టెండర్‌లో బలమైన పోటీ ఏర్పడింది. , మొత్తం 950 మెగావాట్ల సామర్థ్యం కోసం 4 మంది బిడ్డర్లు తమ బిడ్లను సమర్పించారు. 4 బిడ్డర్లలో 3, అవి మెస్సర్స్ రీన్యూ సోలార్ పవర్ ప్రైవేట్ లిమిటెడ్. మెస్సర్స్ గ్రీన్కో ఎనర్జీస్ ప్రై. లిమిటెడ్ , మెస్సర్స్ హచ్.ఇ.ఎస్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ లను చివరకు ఇ-రివర్స్ వేలం కోసం షార్ట్ లిస్ట్ చేశారు. మెస్సర్స్ అయనా రెన్యూవబుల్ పవర్ ప్రైవేట్ లిమిటెడ్ నాల్గవ బిడ్డర్. ఈ ప్రాజెక్టునుంచి విద్యుత్తును ఎన్.ఎం.డి.సి, డామన్ , డయ్యు, దాద్రా నాగర్ హవేలి లకు అమ్మడానికి నిర్దేశించారు. ప్రతి సంస్థ 200 మెగావాట్ల కెసాసిటీని తీసకుకుంటుంది. ప్రాజెక్టులకు టారిఫ్ సీలింగ్ లేదు. డవలపర్లు భారతదేశంలో ఎక్కడైనా ప్రాజెక్టు ఏర్పాటు చేసుకోవచ్చు. ప్రస్తుత టెండర్ కింద గల ప్రాజెక్టులు బిల్డ్- ఓన్- ఆపరేట్ నమూనాలో చేపడతారు.
ప్రస్తుత టారిఫ్ చరిత్రాత్మకమని ఎందుకు అనుకోవచ్చని అంటే, ఈ టెండర్ ద్వారా పునరుత్పాదక ఇంధన వనరుల ద్వారా నిరంతర విద్యుత్ సరఫరాకు వీలు కలుగుతుంది. అంటే పవన విద్యుత్, సౌర విద్యుత్, పివి అలాగే రెండింటినీ కలిపి స్టోరేజ్ చేయడం ద్వారా దీనిని చేపడతారు. పిపిఎ అమలులోకి వచ్చినప్పటి నుంచి 24 నెలల గరిష్ఠవ్యవధిని డవలపర్ కు ఇస్తారు.
తొలి ఏడాది టారిఫ్ 3 శాతం రేటు వంతున వార్షిక ప్రాతిపదికన పెంచుతారు. ఇలా మొత్తం 25 ఏళ్ల వ్యవధిలో 15 సంవత్సరాల వరకు దీనిని పాటిస్తారు. ఫలితంగా ఈ ప్రాజెక్టు టారిఫ్ రేటు రూ.3.59/kWh అవుతుంది. సంప్రదాయ పద్ధతులలో జరిపే విద్యుత్ ఉత్పత్తితో పోలిస్తే ఇది చాలా మెరుగైనది.
బిడ్ షరతుల ప్రకారం, డవలపర్ వార్షిక కనీస కెపాసిటీ వినియోగ ఫాక్టర్‌ను పూర్తి చేయాల్సి ఉంటుంది. అలంటే 80 శాతం,అలాగే నెలవారీ సియుఎఫ్ 70 శాతం పూర్తి చేయాలి. దీనిని సాధించలేకపోతే పిపిఎ లో పేర్కొన్నట్టు ఆ తర్వాతి సంవత్సరాలలో టారిఫ్‌పెంపు వర్తించదు. ఇది తిరిగి సాధించేవరకు ఇలాగే ఉంటుంది. ఈ నిబంధనలను గమనించినపుడు ఈ టెండర్ ఎం.ఎన్.ఆర్.ఇలు, ఎస్.ఇ.సి.ఐ కృషిలో ఒక మైలురాయిగా చెప్పుకోవచ్చు.
***
(Release ID: 1622565)
Visitor Counter : 278