సాంస్కృతిక మంత్రిత్వ శాఖ
రంగస్థల ప్రముఖులు, యువ కళాకారులు, విద్యార్థులు మరియు నాటకరంగ ఔత్సాహికుల కోసం
प्रविष्टि तिथि:
08 MAY 2020 7:26PM by PIB Hyderabad
కోవిడ్ -19 మహమ్మారి కారణంగా దేశవ్యాప్త లాక్ డౌన్ పాటిస్తున్న ప్రస్తుత తరుణంలో మే 10వ తేదీ నుంచి
వారం రోజుల పాటు ప్రతిరోజు రంగస్థల ప్రముఖులచే వెబినార్లు నిర్వహించాలని కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖకు
చెందిన నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా సంకల్పించింది. ఆసక్తిగల వారెవరైనా నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా (ఎన్ ఎస్ డి) యూ ట్యూబ్ ఛానల్ లో మరియు పేస్ బుక్ పేజీ లో ద్వారా ఈ వెబినార్ లలో జతకూడవచ్చు. ఒక గంట పాటు ఉండే వెబినార్ ప్రతి రోజు మధ్యాహ్నం 4 గంటలకు ప్రారంభమవుతుంది . ఆ తరువాత ప్రజల కోసం 30 నిముషాల పాటు ప్రశ్నోత్తరాల కార్యక్రమం ఉంటుంది. ఈ వెబినార్లు కేవలం రంగస్థల చరిత్ర మరియు విమర్శనము మాత్రమే కాక డిజిటల్ మాధ్యమం ద్వారా ఆచరణాత్మక శిక్షణ కూడా ఉంటుంది.
ప్రసంగ పాఠాలు , ఉపన్యాస ప్రదర్శన, మాస్టర్ క్లాసు, రంగస్థలం మరియు ఇతర కళలకు చెందిన ప్రముఖులతో ఇష్టాగోష్టి మరియు భారత రంగస్థల నిష్ణాతులతో లోతైన చర్చలను ఆచి తూచి పోగుచేసిన సంకలనం ఇది. దీనివల్ల నేర్చుకోవాలనే అభిలాష గల లక్షలాది మందికి తృప్తి కలుగుతుంది. అంతే కాక పరిశోధన మరియు అధ్యయనానికి అవసరమైన సమాచారాన్ని సమకూరుస్తుంది.
ఆసక్తి గలవారు ఈ దిగువ లింక్ ద్వారా వెబినార్ తో జతకూడావచ్చు.
నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా అధికార పేస్ బుక్ పేజీలో కూడా లైవ్ లో వెబినార్ చూడవచ్చు.
దేశంలో మారుమూల ప్రాంతాలలో ఉన్న వారందరికీ చేరువ కావాలనే ఉద్దేశంతో ఎన్ ఎస్ డి ఈ కార్యక్రమానికి ఉపక్రమించింది. ఈ కోర్సు లక్ష్యం రంగస్ధలానికి చెందిన వారు మాత్రమే కాక చూసిన వారందరికీ గొప్ప అనుభవాన్ని మిగల్చడం.
మహమ్మారి కారణంగా అభినయం చేసే అవకాశం, బృందంలో మెలిగే వీలు లేకపోవడంతో కళాకారులలో ఏదో పోగొట్టుకున్న భావన కలుగుతోందని వెబ్ ద్వారా కళాకారులను ఒకచోట చేర్చే సంకల్పంతో ఎన్ ఎస్ డి ఈ కార్యక్రమానికి ఉపక్రమించిందని డైరెక్టర్ ప్రొఫెసర్ సురేష్ శర్మ తెలిపారు. వెబినార్ ద్వారా వివిధ చోట్ల ఉన్న వారందరూ జతకూడుతారని, వారు తమ సమయాన్ని జ్ఞానార్జనకు ఉపయోగించుకోవచ్చునని, అది వారి నైపుణ్యాన్ని పెంచడమే కాక మహమ్మారి సృష్టించిన వత్తిడి నుంచి బయటపడ వచ్చని ఆయన అన్నారు.
నిరంతరం అధ్యయనం, అభ్యాసాలతో తీరికలేకుండా ఉండే వాతావరణం నుంచి ఇంటికే పరిమితం కావడం వల్ల విద్యార్థులు, ఇతర రంగస్థల ఔత్సాహికులు ఈ విధంగా ఎంత కాలం ఇళ్లలో ఉండాలో అని ఆందోళనకు గురవుతున్నాఋ. ఇప్పుడు ఈ ఆన్ లైన్ శిక్షణ కార్యక్రమం వారు ఆ పరిస్థితి నుంచి బయటపడి కొంత ఊరట చెందడానికి తోడ్పడుతుంది.
వెబినార్ కార్యక్రమ వివరణ పట్టిక
= 10 మే : ప్రొఫెసర్ సురేష్ శర్మ - నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా మరియు ఎన్ ఎస్ డి సంగ్రహాలయం
-- 11 మే : ప్రొఫెసర్ అభిలాష్ పిళ్ళై - రంగస్థల రూపకల్పన యుక్తి మరియు అంకాత్మకత
- 12 మే : శ్రీ దినేష్ ఖన్నా - నటనలో మర్మాలు /టెక్నీకులు
- 13 మే : శ్రీ అబ్దుల్ లతీఫ్ ఖతానా - నాటకశాలలో పిల్లలతో పని చేయడం
- 14 మే : సుశ్రీ హేమా సింగ్ -- సంభాషణలో మౌలిక అంశాలు
- 15 మే : శ్రీ ఎం. మనోహరన్ -- రంగస్థలంలో దృశ్య శ్రవణ టెక్నాలజీ
- 16 మే : శ్రీ సుమన్ వైద్య -- ఉత్సవ నిర్వహణ
- 17 మే : శ్రీ రాజేష్ తైలాంగ్ --- హిందీ మాట్లాడే వారికి మరియు ఇతరులకు హిందీ వాక్సరణిలో సవాళ్లు

(रिलीज़ आईडी: 1622406)
आगंतुक पटल : 210