హోం మంత్రిత్వ శాఖ

కేంద్ర సాయుధ పోలీసు దళాలకు చెందిన డైరెక్టర్ జనరళ్లతో నిర్వహించిన సమీక్షా సమావేశానికి అధ్యక్షత వహించిన శ్రీ అమిత్ షా.

కేంద్ర సాయుధ పోలీసు దళాల భద్రతా, శ్రేయస్సే మోదీ ప్రభుత్వ ప్రాధాన్యత : శ్రీ అమిత్ షా.


కోవిడ్-19 యోధులకు ఆరోగ్య పరీక్షలు, చికిత్సకు సరైన ఏర్పాట్లు చేయాలి; ప్రాణ నష్టం జరిగితే సకాలంలో బకాయిలు చెల్లించేలా చూడాలి : హోంమంత్రి.


కేంద్ర సాయుధ పోలీసు బలగాల కోసం ప్రత్యేకంగా ఆసుపత్రులు / సదుపాయాలూ ఏర్పాటుచేయాలి : శ్రీ అమిత్ షా.

Posted On: 08 MAY 2020 9:20PM by PIB Hyderabad

కేంద్ర సాయుధ పోలీసు దళాలకు చెందిన డైరెక్టర్ జనరళ్లతో ఈ రోజు నిర్వహించిన సమీక్షా సమావేశానికి కేంద్ర దేశీయ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ అమిత్ షా అధ్యక్షత వహించారు.  కోవిడ్-19 నిర్వహణ వంటి క్లిష్టమైన పరిస్థితుల్లో మన కేంద్ర సాయుధ పోలీసు దళాలు చేస్తున్న ప్రశంసనీయమైన పనిని ఆయన అభినందించారు. 

 

08..05.2020 - HM CAPF Meeting1.JPG

 

కోవిడ్-19 వ్యాప్తి పట్ల ఆందోళనతో పాటు, కేంద్ర సాయుధ పోలీసు దళాల భద్రతా, శ్రేయస్సు కోసం కూడా మోడీ ప్రభుత్వం తీవ్రమైన కృషి చేస్తోందని శ్రీ షా పేర్కొన్నారు.  కోవిడ్-19 బారిన పడిన భద్రతా సిబ్బంది ఆరోగ్య పరిస్థితి గురించి హోంమంత్రి వివరంగా అడిగి తెలుసుకున్నారు.  

వ్యాధి వ్యాప్తి ని అరికట్టడానికి కేంద్ర సాయుధ పోలీసు దళాలలో వినూత్నమైన సలహాలు / చర్యలు తీసుకున్న వారి గురించి కూడా ఈసమావేశంలో చర్చించారు.  జాగ్రత్తల గురించి అవగాహన కల్పించడం, శిక్షణ గురించి,   మెస్ లో ఏర్పాట్లు,  వసతి సౌకర్యాలు,  ఆయుష్ మంత్రిత్వశాఖ మార్గదర్శకాలను అనుసరించి రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవడం,  సరైన సిబ్బంది యాజమాన్య నిర్వహణ, భద్రతా సిబ్బంది వయస్సును దృష్టిలో ఉంచుకుని, వారి ఆరోగ్య పరిస్థితుల అంచనా వంటి వివిధ విషయాలపై కూడా వారు సలహాలుసూచనలు చేశారు

కోవిడ్-19 కు వ్యతిరేకంగా కేంద్ర సాయుధ పోలీసు దళాల సిబ్బంది చేసిన కృషిని శ్రీ షా  అభినందించారు. ప్రాణ నష్టం జరిగిన సందర్భంలో వారికి ఎక్స్ గ్రేషియా, బీమా వంటి ముఖ్యమైన బకాయిలు సకాలంలో చెల్లించేలా చూడాలని శ్రీ షా సీనియర్ అధికారులకు సూచించారు వ్యాధి సోకినవారికీ, వారి కుటుంబ సభ్యులకు ఆరోగ్య పరీక్షలుచికిత్సకు సరైన ఏర్పాట్లు చేయడంతో పాటు, కేంద్ర సాయుధ పోలీసు బలగాల కోసం ప్రత్యేకంగా ఆసుపత్రులు / సదుపాయాలూ ఏర్పాటుచేయాలని శ్రీ అమిత్ షా సూచించారు. 

 

 

08..05.2020 - HM CAPF Meeting2.JPG

సానిటేషన్, సిబ్బందికి సరైన రక్షణ పరికరాలు వంటి ఆరోగ్య పరిరక్షణ జాగ్రత్తలతో పాటు ఉత్తమ ఆరోగ్య పద్దతులను పాటించాలని సూచించారు. కేంద్ర దేశీయ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి శ్రీ నిత్యానంద రాయ్ తో పాటు కేంద్ర సాయుధ పోలీసు దళాలకు చెందిన డైరెక్టర్ జనరళ్ళు, మంత్రిత్వశాఖకు చెందిన ఇతర సీనియర్ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు

*****


(Release ID: 1622377) Visitor Counter : 211