ఆర్థిక మంత్రిత్వ శాఖ
2020 మే 11-15 తేదీల్లో సావరిన్ గోల్డ్ బాండ్ల సబ్‌స్క్రిప్షన్
గ్రాము బంగారం ధర రూ.4,590 గా నిర్ణయం
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకంటే రూ.50 తగ్గింపు
నాడు పోస్టు చేయడమైనది:
08 MAY 2020 8:17PM by PIB Hyderabad
2019 ఏప్రిల్ 13న భారత ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్ నం. F.No.4(4)-B/(W&M)/2020 ప్రకారం, 2020-21 సావరిన్ గోల్డ్ బాండ్లు (సిరీస్-2) ఈనెల 11 నుంచి 15వ తేదీ వరకు అందుబాటులో ఉంటాయి. ఈనెల 19వ తేదీని సెటిల్‌మెంట్ తేదీగా నిర్ణయించారు. సబ్‌స్క్రిప్షన్ గడువులో బంగారం ధరను గ్రాముకు రూ.4,590 గా నిర్ణయించారు. మే 8, 2020న రిజర్వ్ బ్యాంకు జారీ చేసిన పత్రికా ప్రకటనలోనూ దీనిని పేర్కొన్నారు.
ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకుని, డిజిటల్ పద్ధతిలో చెల్లింపులు చేసేవారికి గ్రాముకు రూ.50 చొప్పున తగ్గిస్తారు. వీరికి గ్రాముకు రూ.4,540 చొప్పున గోల్డ్ బాండ్లను ప్రభుత్వం జారీ చేస్తుంది.
(రిలీజ్ ఐడి: 1622300)
సందర్శకుల సూచీ సంఖ్య : : 175