రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ

కైలాస మానస సరోవర యాత్రా మార్గంలో ధార్చుల నుంచి లిపులేఖ్ (చైనా సరిహద్దు) వరకూ రహదారి నిర్మాణం పూర్తి చేయడాన్ని ప్రశంసించిన శ్రీ గడ్కరీ.

Posted On: 08 MAY 2020 4:51PM by PIB Hyderabad

కైలాస్ మానససరోవర యాత్రా మార్గంగా ప్రసిద్ధి చెందిన ధార్చుల నుంచి లిపులేఖ్ (చైనా సరిహద్దు) వరకూ రహదారి నిర్మాణాన్ని పూర్తి చేయడంలో బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (బి.ఆర్.ఓ) ప్రయత్నాలను కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల శాఖ మరియు ఎం.ఎస్.ఎం.ఈ. మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ ప్రశంసించారు. ఈ రోజు పిథోర ఘర్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేంద్ర రక్షణ మంత్రి శ్రీ రాజ్ నాథ్ సింగ్ ఈ మార్గాన్ని ప్రారంభించి, మొదటి కాన్వాయ్ కు పచ్చజెండా ఊపారు.  

సరిహద్దు గ్రామాలన్నీ మొదటి సారిగా రోడ్లద్వారా అనుసంధానం అయ్యాయని, కైలాస్ మానస సరోవర యాత్రంలో కష్టతరమైన 90 కిలోమీటర్ల మార్గాన్ని దాటి ఇప్పుడు చైనా సరిహద్దు వరకూ సులభంగా వెళ్ళవచ్చని శ్రీ గడ్కరీ తెలిపారు.

 

దార్చులా – లిపు లేఖ్ రహదారి ఫిథోర గర్ – తవాఘాట్-ఘాటియాబాఘర్ మీదుగా సాగుతుంది. ఇది ఘాటియాభాఘర్ వద్ధ మొదలై, కైలాస్ మానస సరోవర్ ప్రవేశ ద్వారం అయిన లిపులేఖ్ పాస్ వద్ద ముగుస్తుంది. ఈ రహదారిలో 6000 నుంచి 17,060 అడుగులకు ఎత్తు పెరుగుతుంది. ఈ ప్రాజెక్టు పూర్తి కావడం వల్ల ఎత్తైన భూభాగం నుంచి పర్వతారోహణ చేయాల్సిన ఇబ్బందుల నుంచి కైలాస్ మానస సరోవర్ యాత్రికులు బయట పడడమే కాకుండా, ప్రయాణ కాలం తగ్గనుంది.

ప్రస్తుతం సిక్కిం లేదా నేపాల్ మార్గాల ద్వారా ఈ ప్రయాణానికి రెండు నుంచి మూడు వారాలు పడుతోంది. లిపు లేఖ్ మార్గంలో 90కిలోమీటర్ల దూరం ఎత్తులో ప్రయాణం ఉండేది. ఈ ప్రదేశంలో వృద్ధులు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇప్పుడు ఈ మార్గంలో వాహనాల ద్వారా ప్రయాణించే సౌలభ్యం ఏర్పడింది. 

ఈ రహదారి నిర్మాణం ప్రారంభమైన నాటి నుంచి అనేక సమస్యలు ఎదురయ్యాయి. మంచు బాగా పడడం, ఎత్తుల్లో వాతావరణ మార్పులు, ఉష్ణోగ్రత కారణంగా ఐదు నెలలు పని వాయిదా వేయాల్సి వచ్చింది. దానికి తోడు స్థానికులు తిరుగుతూ ఉండడం, వ్యాపారుల కదలికలు (చైనాతో వాణిజ్యం కోసం) లాంటి వాటితో తక్కువ సమయం పని చేయాల్సి వచ్చింది.

 

ఇవే గాక కొన్నేళ్ళుగా వచ్చిన వరదలు, పిడుగులు లాంటివి ఇతర సమస్యలను సృష్టించాయి. ప్రారభంలో 20 కిలోమీటర్ల మేర పర్వతాలు కఠినమైన శిలలను కలిగి, నిలువుగా ఉండడం వల్ల బి.ఆర్.ఓ.కు చెందిన చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. అలాగే కాళి నదిలో పడిపోవడం వల్ల 25 పరికరాలు కూడా దెబ్బ తిన్నాయి.

 

 

అనేక సమస్యలు ఎదురైనప్పటికీ, గత రెండేళ్ళలో బి.ఆర్.ఓ. దాని పని తీరును పెంచి, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో 20 రెట్ల ఎక్కువ పని చేసింది. దీనికి పరికరాలను ఇతర అవసరమైన వస్తువులను తీసుకురావడానికి హెలికాఫ్టర్లను కూడా వినియోగించారు.  

 

****



(Release ID: 1622259) Visitor Counter : 198