శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ

ఈనెల 10 నుంచి ఎన్‌సీఎస్‌టీసీ-జీయూఏసీవోఎస్‌టీ వెబినార్‌ సిరీస్‌

కొవిడ్‌పై గెలుపు కోసం ప్రజల్లో అవగాహన&సంసిద్ధతను పెంచడం లక్ష్యం

Posted On: 07 MAY 2020 5:43PM by PIB Hyderabad

జాతీయ శాస్త్ర, సాంకేతిక సమాచార మండలి (ఎన్‌సీఎస్‌టీసీ), కేంద్ర శాస్త్ర, సాంకేతిక విభాగం, గుజరాత్‌ శాస్త్ర, సాంకేతిక మండలి సంయుక్తంగా ప్రజల కోసం 'సిటిజన్స్‌ సైన్స్‌ వెబినార్‌ సిరీస్‌' నిర్వహించనున్నాయి. 'కొవిడ్‌ సమయంలో శాస్త్ర సమాచారం' అంశంపై వెబినార్‌ సిరీస్‌ చేపడుతున్నారు. మే 10 నుంచి 16వ తేదీ వరకు, ప్రతిరోజూ ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు వెబినార్‌ ఉంటుంది. ఆన్‌లైన్‌ ద్వారా దీనిలో పాల్గొనవచ్చు. కొవిడ్‌ సృష్టించిన ఇబ్బందులను వివిధ పద్ధతులు, మార్గాల ద్వారా ఎలా పరిష్కరించవచ్చో ఈ వెబినార్‌ వివరిస్తుంది. కొవిడ్‌ కారణంగా ప్రస్తుతమున్న ఆరోగ్య సంక్షోభం గురించి చెప్పి, ఈ పరిస్థితిని అధిగమించే అవగాహన&సంసిద్ధతను పెంచేందుకు సాయం చేస్తుంది.

    సవాళ్లను అధిగమించేందుకు అవసరమైన చర్యలు చేపట్టడానికి, ప్రజల సంసిద్ధతను మరింత సులభతరం చేయడానికి సరైన సమాచారంతో ఈ తరహా వ్యూహాలు సమాజంలోకి వెళ్లాలి. విద్యార్థులు, విద్యావేత్తలు, మీడియా, వాలంటీర్లను సహా వివిధ వర్గాలను చేర్చుకోవడం ఈ వ్యూహాలకు ప్రయోజనకారి అవుతుంది. సమాజ స్థాయిలో ప్రతిస్పందనను ప్రోత్సహించడానికి ప్రజాదరణ పొందిన విజ్ఞాన శాస్త్రాన్ని వెబినార్ల రూపంలో ప్రజల్లోకి చేర్చడం ద్వారా... ప్రామాణికమైన శాస్త్రీయ, ఆరోగ్య సమాచారాన్ని అర్ధం చేసుకోవడం, ఉపయోగించడం అలవాటవుతుంది. సంక్షోభ నిర్వహణను సులభతరం చేస్తుంది.
 



(Release ID: 1621888) Visitor Counter : 214