వ్యవసాయ మంత్రిత్వ శాఖ
సాయిల్ హెల్త్ కార్డ్ ఆధారంగా సమగ్ర భూపోషక నిర్వహణను రైతు ఉద్యమంగా ముందుకు తీసుకుపోవాలని పిలుపునిచ్చిన కేంద్ర వ్యవసాయ మంత్రి
- బయో మరియు సేంద్రీయ ఎరువుల వాడకాన్ని పెంచడం మరియు రసాయన ఎరువులను తగ్గించడంపై త్వరితగతిన అవగాహన కార్యక్రమాలను ప్రారంభించండి: శ్రీ నరేంద్ర సింగ్ తోమర్
Posted On:
06 MAY 2020 7:09PM by PIB Hyderabad
సమీకృత భూపోషక నిర్వహణను రైతు ఉద్యమంగా మార్చుకొని ముందుకు సాగాలని కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శ్రీ నరేంద్ర సింగ్ తోమర్ పిలుపునిచ్చారు. ఈ రోజు ఇక్కడ భూ ఆరోగ్య కార్యక్రమం యొక్క పురోగతిని ఆయన సమీక్షించారు. సాయిల్ హెల్త్ కార్డ్ (ఎస్‌హెచ్‌సీ) కార్యక్రమంలో భాగంగా బయో మరియు సేంద్రీయ ఎరువుల వాడకాన్ని పెంచడం మరియు రసాయన ఎరువులను తగ్గించడంపై మిషన్ మోడ్‌లో అవగాహన కార్యక్రమాలను అమలు చేయాలని ఆయన సూచించారు.
లక్ష గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు..
2020-21 మధ్య కాలానికి దేశంలోని అన్ని జిల్లాలోని లక్షలకు పైగా గ్రామాల్లోని రైతులకు సామూహిక అవగాహన కల్పించడంపై ఈ కార్యక్రమం ప్రధానంగా దృష్టిసారించిందని అన్నారు. దేశంలో వ్యవసాయం, మహిళా స్వయం సహాయక బృందాలు, ఎఫ్‌పీఓలు మొదలైన వాటిలో విద్యను కలిగి ఉన్న యువత గ్రామస్థాయి సాయిల్ టెస్టింగ్ ల్యాబ్‌లను ఏర్పాటు చేయాలని శ్రీ తోమర్ సూచించారు. ఎస్‌హెచ్‌సీ పథకం తగిన నైపుణ్య అభివృద్ధి తర్వాత ఉపాధి కల్పనపైన దృష్టి సారిస్తుందని ఆయన అన్నారు. వ్యవసాయ, సహకార మరియు రైతు సంక్షేమ శాఖ భూపరీక్ష ఆధారిత ఎరువుల హేతుబద్ధమైన అనువర్తనం మరియు సేంద్రీయ వ్యవసాయం ప్రాకృతిక్ కృషి పధాతితో (బీపీకేపీ) సహా సురక్షితమైన మంచి పౌష్టికాహారం నిమిత్తం సమగ్రమైన ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. దేశంలో పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి మరియు తాగునీరు మరియు పారిశుధ్య శాఖ వారి సౌజన్యంలో వీటిని చేపట్టనున్నారు.
రెండు సంవత్సరాల వ్యవధిలో కార్డులు..
ఎస్‌హెచ్‌సీ పథకం కింద దేశంలోని రైతులందరికీ 2 సంవత్సరాల వ్యవధిలో భూఆరోగ్య కార్డులు అందించబడతాయి. 2015 ఫిబ్రవరి 19వ తేదీన రాజస్థాన్‌లోని సూరత్‌ఘర్‌లో ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ ప్రారంభించారు. ఈ కార్డులు రైతులకు తమ భూపోషక స్థితిగతులపై తగిన సమాచారాన్ని అందిస్తాయి. దీనికి తోడు సాగు నేల ఆరోగ్యం, దాని ఉత్పత్తి సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి తగిన పోషకాల మోతాదులు కూడా సిఫారసు చేస్తుంది. దేశంలో వ్యవసాయ ఉత్పాదకతలో స్తబ్దతకు నేల రసాయన, శారీరక మరియు జీవ ఆరోగ్యం క్షీణించడం ఒక కారణం.
21 భాషల్లో సమాచారం..
సాయిల్ హెల్త్ కార్డ్ సేంద్రియ ఎరువుల సిఫారసులతో సహా ఆరు పంటలకు అవసరమైన రెండు సెట్ల ఎరువుల సిఫార్సును అందిస్తుంది. రైతుల కోరిక మేరకు అదనపు పంటలకు సిఫారసులను కూడా పొందవచ్చు. రైతులు తమ కార్డును ఎస్‌హెచ్సీ వెబ్ పోర్టల్ నుండి తమ సొంతంగా ముద్రించుకోవచ్చు. ఎస్‌హెచ్‌సీ పోర్టల్‌లో రెండు రుతువులకు సంబంధించిన రైతుల డేటాబేస్ నిక్షిప్తమై ఉంది. రైతుల ప్రయోజనం కోసం ఇది దాదాపు 21 భాషల్లో లభిస్తుంది.
దిగుబడి 5-6 శాతం మేర పెరిగే అవకాశం..
జాతీయ ఉత్పాదకత మండలి (ఎన్‌పిసి) 2017 లో జరిపిన ఒక అధ్యయనంలో ఎస్‌హెచ్‌సి పథకం స్థిరమైన వ్యవసాయాన్ని ప్రోత్సహించిందని, 8-10% పరిధిలో రసాయన ఎరువుల వాడకం తగ్గడానికి దారితీసిందని తేలింది. సాయిల్ హెల్త్ కార్డులలో లభించే సిఫారసుల ప్రకారం ఎరువులు మరియు సూక్ష్మ పోషకాలను ఉపయోగించడం వల్ల పంటల దిగుబడి 5-6% వరకు పెరిగింది.
(Release ID: 1621605)
Visitor Counter : 433