రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

హంద్వారా అమరవీరుడు కల్నల్ అశుతోష్ శర్మ కు నివాళి

Posted On: 05 MAY 2020 8:35PM by PIB Hyderabad

హంద్వారా అమరవీరుడు కల్నల్ అశుతోష్ శర్మ భౌతిక కాయం పూర్తి సైనిక లాంఛనాలతో 2020 మే నెల 5వ తేదీన శ్రీనగర్ నుండి జమ్మూకాశ్మీర్ లోని జైపూర్ చేరుకుంది. అమరవీరుని భౌతిక కాయంపై ముఖ్యమంత్రి శ్రీ అశోక్ గెహెలోట్ఆర్మీ కమాండర్, సప్త శక్తి కమాండ్, లెఫ్టనెంట్ జనరల్ అలోక్ క్లెర్, పి.వి.ఎస్.ఎమ్., వి.ఎస్.ఎమ్. పుష్పగుచ్చాలనుంచి నివాళులర్పించారు. 

ఈ సందర్భంగా అక్కడ హాజరైన వారిలో,  పార్లమెంటు సభ్యుడు శ్రీ రాజ్యవర్ధన్ సింగ్ రాథోర్;  రాజస్థాన్ రాష్ట్ర మాజీ సైనికుల సంక్షేమశాఖ మంత్రి శ్రీ ఖచరియవాస్;  రెవిన్యూ కార్యదర్శి శ్రీ సందీప్ వర్మ; జైపూర్ పోలీసు కమీషనర్ శ్రీ ఆనంద్ శ్రేవాస్తవ జైపూర్ డి.సి. శ్రీ జాగారామ్ తదితరులు ఉన్నారు.

ఈ సందర్భంగా, జనరల్ క్లెర్ మాట్లాడుతూ, మన దేశం కోసం కల్నల్ అశుతోష్ శర్మ ప్రదర్శించిన ధైర్యసాహసాలకూ, అంతిమ త్యాగానికీ నివాళులర్పించారు. అయనతో పాటు వీర మరణం పొందిన మజ్ అనుజ్ సూద్ తో సహా ఇతర నలుగురు సహచరులకు కూడా ఆయన నివాళులర్పించారు.  కల్నల్ అశుతోష్ శర్మ గ్యాలంట్ లో పనిచేస్తున్న ప్రతి సైనికునికి ప్రతినిధి అనీ, భారత సైనిక దళం అతని సేవలను, అతని కుటుంబాన్నీ ఎన్ని సంవత్సరాలైనా గుర్తు పెట్టుకుంటుందని ఆయన నొక్కి చెప్పారు. అతని కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడి వారికి తన సానుభూతి తెలియజేశారు. 

కల్నల్ అశుతోష్ శర్మ గార్డ్స్ కి చెందిన 19వ బెటాలియన్ బ్రిగేడ్ లో 2001 సెప్టెంబర్ 1వ తేదీన ఉద్యోగంలో చేరారు.  సున్నితమైన ఉత్తర కాశ్మీర్ లో 21 రాష్ట్రీయ రైఫిల్స్ కమాండింగ్ ఆఫీసర్ గా ఆయన నియమితులయ్యారు.  ప్రతి పనిలోనూ ముందుండే కల్నల్ అశుతోష్ శర్మ కు రెండు సేనా మెడల్స్ వచ్చాయి.  2020 మే నెల 2వ తేదీ రాత్రి హంద్వారా లో పాకిస్తాన్ ప్రేరేపిత తీవ్రవాదులతో జరిగిన ఎదురు కాల్పుల సంఘటనలో కల్నల్ అశుతోష్ శర్మ తో పాటు అతని సహచరులైన మజ్ అనుజ్ సూద్, నాయక్ రాజేష్ కుమార్, లాన్స్ నాయక్ దినేష్ సింగ్ మరియు జామ్, కశ్మీర్ పోలీసు సబ్ ఇన్ స్పెక్టర్ షకీల్ ఖ్యాజి కూడా అమరులయ్యారు.   

జైపూర్ లోని వైశాలి నగర్ లో నివాసముండే కల్నల్ అశుతోష్ శర్మ కు భార్య శ్రీమతి పల్లవి శర్మ, 12 సంవత్సరాల కుమార్తె తమన్నా ఉన్నారు.  అశుతోష్ శర్మ తల్లి శ్రీమతి సుధా శర్మ, సోదరుడు శ్రీ పీయూష్ శర్మ కూడా జైపూర్ లోనే నివాసముంటున్నారు. పూర్తి సైనిక లాంఛనాలతో నివాళి అర్పించిన అనంతరం అతని కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలో సోడాలా స్మశానవాటికలో అంత్యక్రియలు జరిగాయి

***



(Release ID: 1621406) Visitor Counter : 121