శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
కోవిడ్ -19ను సత్వరం, కచ్చితంగా నిర్ధారించే కిట్‌ను అభివృద్ధిచేసే పరిజ్ఞానానం లైసెన్సింగ్‌కు సంబంధించి సిఎస్ఐఆర్- ఐజిఐబి, టాటా సన్స్ మధ్య ఒప్పందంపై సంతకాలు.
తక్కువ ధరలో అందుబాటు, సులభంగా ఉపయోగించగలగడం, ఖరీదైన క్యూ-పిసిఆర్ మెషిన్ పై ఆధారపడనవసరం లేకపోవడం దీనికున్న సానుకూలతలు
Posted On:
05 MAY 2020 7:18PM by PIB Hyderabad
సిఎస్ఐఆర్ కి చెందిన పరిశోధన శాల అయిన ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ జెనోమిక్స్, ఇంటిగ్రేటివ్ బయాలజీ(సిఎస్ఐఆర్-ఐజిఐబి), టాటాసన్స్ సంస్థలు సత్వరం కోవిడ్ -19 వ్యాధి నిర్ధారణకు ఎఫ్.ఎన్ సిఎ ఎస్ -9 ఎడిటర్ అనుసంధానిత యూనిఫామ్ డిటెక్షన్ అస్సే 9 (ఎఫ్.ఇ.ఎల్.యు.డి.ఎ)పరిజ్జాన లైసెన్సింగ్ కు సంబంధించి ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి.
మే చివరి నాటికి అందుబాటులోకి తీసుకురాగల కోవిడ్ -19 పరీక్ష కిట్ కోసం తమ అనుభవం స్థాయిని పరిజ్ఞాన బదిలీ వంటివి ఈ లైసెన్స్ లో ఇమిడి ఉన్నాయి. పూర్తిగా దేశీయ పరిజ్ఞానంతో కోవిడ్ -19 కోసం రూపుదిద్దుకుంటున్న ఎఫ్.ఇ.ఎల్.యు.డి.ఎ పెద్ద ఎత్తున ప్రజలకు పరీక్షలు నిర్వహించడానికి ఉపయోగపడుతుంది. పైగా తక్కువ ఖర్చులో అందుబాటులో ఉంటుంది. అలాగే అత్యంత ఖర్చుతో కూడిన క్యు-పిసిఆర్ యంత్రాలపై ఆధారపడాల్సిన అవసరం ఉండదు. సి.ఎస్.ఐ.ఆర్, ఐజిఐబి, టాటాసన్స్ కలసి కట్టుగా ఇక దీనిని వీలైనంత త్వరగా పెద్దఎత్తున వినియోగంలోకి తెచ్చేందుకు కృషిచేస్తాయి.
ఈ ఒప్పందంపై వ్యాఖ్యానిస్తూ టాటాసన్స్‌కు చెందిన ఇన్‌ఫ్రాస్ట్రక్చ్, డిఫెన్స్, ఎయిరోస్పేస్, అధ్యక్షుడు, శ్రీ బాన్‌మాలి అగర్వాల్ , మాట్లాడుతూ, ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ జెనోమిక్స్, సిఎస్ ఐఆర్ కు చెందిన ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బయాలజీ (కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్, ఇండస్ట్రియల్ రీసెర్చ్) తో భాగస్వామ్యానికి తమకు అనందంగా ఉందని, కోవిడ్ -19 ను గుర్తించేందుకు, క్లస్టర్డ్ రెగ్యులర్లీ ఇంటర్ స్పేస్‌డ్‌షార్ట్ పాలిన్‌డ్రోమిక్ రిపీట్స్ (సిఆర్ైఎస్‌పిఆర్) ఆధారిత టెక్నాలజీ అభివృద్ధి , వాణిజ్యపరంగా వాటిని ముందుకుతీసుకుపోవడానికి ఇదివీలు కల్పిస్తుందని. అని అన్నారు.
ఈ వినూత్న సిఆర్ ఐ ఎస్‌పిఆర్, ఫెలూదా టెసట్ అత్యంత అధునాతన సిఆర్ ఐ ఎస్‌పిఆర్ సాంకేతిక పరిజ్ఞానాన్ని నోవెల్ కరోనా వైరస్ జెనోమిక్ పరిణామం తెలుసుకోవడానికి వీలు కలిగిస్తుంది. ఈ పరీక్షలు నిర్వహించడం సులభంగా ఉండనున్నాయి. తక్కువ వ్యవధిలో వైద్య సిబ్బంది దీనిని ఉపయోగించడానికి వీలు కలిగిస్తుంది.
డిజి-సిఎస్ఐఆర్, డాక్టర్ సుధాకర్ మండే దీనిపై వ్యాఖ్యానిస్తూ, సిఎస్ఐఆర్‌ల్యాబ్‌లు అంటే సిఎస్ ఐఆర్-ఐజిఐబి లు ఈ రంగంలో అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో ,లోతైన శాస్త్రవిజ్ఞానంతో పనిచేస్తున్నాయన్నారు. టాటా గ్రూప్ దీనిలో భాగస్వాములుకావడానికి ముందుకు రావడం ఆనందంగా ఉందన్నారు. ఈ భాగస్వామ్యం కోవిడ్ -19ని ఎదుర్కోవడంలో మరోమలుపుగా ఉండిపోతుంది అని ఆయన అన్నారు.
డాక్టర్ అనురాగ్ అగర్వాల్, డైరక్టర్ ఐజిఐబి, సిఎస్ఐఆర్-ఐజిఐబి లో ఊపిరిపోసుకుని అభివృద్ధి అయిన సాంకేతిక పరిజ్ఞానం కోవిడ్ -19 ను ప్రత్యేకంగా గుర్తించడానికి ఉపయోగపడనున్నదన్నారు సిఆర్ైఎస్‌పిఆర్ బయాలజీ, పేపర్‌స్ట్రిప్ కెమిస్ట్రీలు వైరల్ ఇన్‌ఫెక్షన్‌ను శాంపిల్‌లో గుర్తించడానికి దోహదపడనున్నాయని చెప్పారు.
****
(Release ID: 1621378)
Visitor Counter : 221