రక్షణ మంత్రిత్వ శాఖ
ఏఆర్‌టీఆర్ఏసీ సంస్థకు కొత్త కమాండ్
Posted On:
04 MAY 2020 7:24PM by PIB Hyderabad
ఈ నెల 1వ తేదీన ఆర్మీ ట్రైనింగ్ కమాండ్ (ఏఆర్‌టీఆర్ఏసీ) కమాండ్ బాధ్యతలను లెఫ్టినెంట్ జనరల్ రాజ్ షుక్లా చేపట్టారు. నేషనల్ డిఫెన్స్ అకాడమీ, ఖడక్వాస్లా మరియు డెహ్రాడూన్లోని ఇండియన్ మిలిటరీ అకాడమీల గ్రాడ్యుయేట్ అయిన లెఫ్టినెంట్ జనరల్ రాజ్ షుక్లాను 1982 డిసెంబర్‌లో రెజిమెంట్ ఆఫ్ ఆర్టిలరీలో నియమితులయ్యారు. నాలుగు దశాబ్దాల తన కెరీర్‌లో, జనరల్ ఆఫీసర్ ఆర్మీ రంగంలో విస్తృతమైన సేవలను అందించారు. లెఫ్టినెంట్ జనరల్ రాజ్ షుక్లా తూర్పు, ఎడారి సైనిక విభాగాలలోని మీడియం రెజిమెంట్‌కు కమాండ్‌గా వ్యవహరించారు.
లోయలో నియంత్రణ రేఖ వెంబడి పదాతిదళ విభాగం మరియు పశ్చిమ సరిహద్దుల వెంట ఒక కార్ప్స్‌కు కమాండ్‌గాను ఆయన వీరోచిత సేవలను అందించారు. కౌంటర్ ఇన్సర్జెన్సీ ఆపరేషన్స్ (సీఐఏ) నిర్వహించే ఇన్‌ఫ్యాంట్రీ బ్రిగేడ్‌కు కమాండ్‌గాను వ్యవహరించారు. డిఫెన్స్ సర్వీసెస్ స్టాఫ్ కాలేజ్ వెల్లింగ్టన్, కాలేజ్ ఆఫ్ డిఫెన్స్ మేనేజ్మెంట్ సికింద్రాబాద్, నేషనల్ డిఫెన్స్ కాలేజ్ న్యూ ఢిల్లీ పూర్వ విద్యార్ధి అయిన లెఫ్టినెంట్ జనరల్ రాజ్ షుక్లా మిలిటరీ ఆపరేషన్స్ డైరెక్టరేట్లో జనరల్ ఆఫీసర్‌గా రెండు సార్లు పనిచేశారు. ఇటీవలి కాలం వరకు లెఫ్టినెంట్ జనరల్ రాజ్ షుక్లా ఆర్మీ ప్రధాన కార్యాలయంలో పెర్స్పెక్టివ్ ప్లానింగ్ విభాగం డైరెక్టర్ జనరల్‌గా సేవలు అందించారు. ఇండియన్ ఆర్మీ యొక్క ప్రతిష్టాత్మక శిక్షణా స్థాపన మరియు థింక్ ట్యాంక్ సంస్థ ఆర్మీ వార్ కాలేజీకి లెఫ్టినెంట్ జనరల్ రాజ్ షుక్లా కమాండెంట్‌గా కూడా పని చేశారు.

***
(Release ID: 1621056)
Visitor Counter : 160