జల శక్తి మంత్రిత్వ శాఖ
‘నదీ నిర్వహణ భవిష్యత్తు’పై ఐడియథాన్‌ను నిర్వహించిన ఎన్.ఎం.సి.జి, ఎన్.ఐ.యు.ఎ అంతర్జాతీయ నిపుణులు, 500 మందిచే మేధోమథనం
వివిధ థీమ్‌లపై భవిష్యత్ సహకార ఫ్రేమ్ వర్క్, గంగా విజ్ఞాన కేంద్రాన్ని బలోపేతం చేయడంపై సమాలోచన
Posted On:
02 MAY 2020 6:25PM by PIB Hyderabad
జల్ శక్తి మంత్రిత్వ శాఖ , నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ అఫైర్స్ (ఎన్‌ఐయుఎ) ఆధ్వర్యంలోని నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా (ఎన్‌ఎంసిజి), “రివర్ మేనేజ్‌మెంట్ భవిష్యత్తు” పై ఐడియథాన్ నునిర్వహించింది. రివర్ మేనేజ్‌మెంట్ భవిష్యత్ వ్యూహాలను కోవిడ్ -19 సంక్షోభం, ఎలా రూపొందిస్తుందో అన్వేషించడానికి దీనిని నిర్వహించారు. కోవిడ్ -19 సంక్షోభాన్ని ఎదుర్కోవడం ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలకు ఒక సవాలుగా మారింది, చాలా ప్రదేశాలలో ఇది ఒక విధమైన లాక్‌డౌన్ పరిస్థితులకు కారణమైంది. ఈ సంక్షోభం చుట్టూ ఆందోళన ,బాధ ఉన్నాయి.అయితే ఈ సంక్షోభం కొన్ని సానుకూల పరిణామాలకు కూడా కారణమైంది. సహజసిద్ధ పర్యావరణం మెరుగుపడడం ఈ సానుకూల మార్పులో ఒకటి.
నదులు పరిశుభ్రంగా మారాయి. గాలి తాజాగా మారింది. జీహెచ్‌జీ ఉద్గారాలలో గణనీయంగా తగ్గాయి. జంతువులు , పక్షులు తిరిగి వచ్చి వాటి ఆవాసాలను అవి ఆస్వాదిస్తున్నాయి. నది నిర్వహణ దృక్కోణం నుండి, భారతదేశంలో గత కొన్ని వారాలలో గంగా , యమునా నీటి నాణ్యతలో గణనీయమైన మెరుగుదల ఉంది. గత సంవత్సరం, కాస్త అటు ఇటుగా, గాంగెటిక్ డాల్ఫిన్, నదికి చెందిన పలు ప్రాంతాలలో కనిపిస్తూ వస్తోంది. ఈ జాతి కనిపించడం పరిస్థితులు మెరుగుపడుతున్నాయనడానికి ఒక సూచిక .
లాక్ డౌన్ సమయంలో గంగానది, దాని పలు ఉపనదులలో ఇవి మరింత ఎక్కువసార్లు కనిపించాయి. వెనీస్‌కుచెందిన ప్రఖ్యాత కాలుష్య కారక కాలువలకు పర్యాటకులు దూరం కావడంతో ఆ తర్వాత అవి పరిశుభ్రమయ్యాయి. ఇటలీలో నావిగేషన్ నిలిపివేయడంతో జలమార్గాలలో తిరిగి డాల్ఫిన్లు కనిపించడం ఇటీవలి కాలంలో ఇదే మొదటిసారి. అయితే దీర్ఘకాలంలో ఎంత వరకు మార్పులు వస్తాయన్నది ప్రస్తుత ప్రశ్న. ఇతర సంక్షోభాలను పరిష్కరించడానికి నదుల సామాజిక కోణాన్ని ఎలా ప్రభావితం చేయవచ్చో ఐడియాథాన్ పరిశీలించింది. రివర్ మేనేజ్‌మెంట్‌కు సంబంధించి కోవిడ్ మహమ్మారి మనకు ఏం పాఠాలు నేర్పింది? నది సంక్షోభాన్ని ఎదుర్కొన్నప్పుడు ఏ ప్రతిస్పందన విధానాలు అవసరం? అన్నది చర్చించారు.నిన్న నిర్వహించిన అంతర్జాతీయ వెబినార్ లో 500 మంది పాల్గొన్నారు. నిపుణుల ప్యానళ్లలో వివిధ దేశాలకు చెందిన వారు , అంతర్జాతీయ సంస్థలకు చెందిన వారు ఉన్నారు.
నది నిర్వహణ పట్ల మరింత దృష్టిపెట్టడానికి, నదితో నగరాలకు గల అంతర్గత అనుబంధాన్ని ప్రముఖంగా ప్రస్తావించడానికి, నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా, ఈ ఐడియాథాన్ ను నిర్వహించింది..
సాంప్రదాయిక పట్టణ ప్రణాళిక పద్ధతుల కంటే భిన్నమైన దృక్పథం అనుసరించడంతోపాటు,
నదికి సంబంధించి సామాజిక-సాంస్కృతిక ప్రాముఖ్యతనుంచి లబ్ధిపొందడమే కాకుండా, పర్యావరణ ప్రాముఖ్యత ,ఆర్థిక శక్తిసామర్ధ్యాలపై దృష్టిపెట్టాలి. ఇలాంటి నదీ నగరాలు ప్రణాళికా బద్ధంగా ఏర్పడితే వాటి అభివృద్దికి దోహదపడతాయి. .
నగరాల అర్బన్ ప్లానింగ్ ఫ్రేమ్ వర్క్‌లో రివర్ మేనేజ్ మెంట్‌ను ఒక ప్రధానమైన అంశంగా చేసే ఉద్దేశంతో , ఎన్.ఎం.సి.జి, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ అఫైర్స్ తో కలిసి, అర్బన్ రివర్ మేనేజ్‌మెంట్ ప్రణాళిక కోసం ఒక నమూనాను అభివృద్ధి చేస్తోంది.
కోవిడ్ -19 మహమ్మారి, దాని ఫలితంగా అమలు చేస్తున్న లాక్‌డౌన్, కారణంగా నది నిర్వహణపై పడిన ప్రభావం వంటి వాటిని తెలుసుకోవడానికి మేధోమధనం చేయాలని ఐడియాథాన్ ప్రయత్నించింది.
ఎన్.ఐయుఎ కి చెందిన డాక్టర్ విక్టర్ షిండే, వెబ్‌నార్‌ను ప్రారంభించి ఇందుకు సంబంధించి పైన పేర్కొన్న అంశాలపై చర్చకు సమావేశాన్ని సమయత్తం చేశారు అలాగే , పట్టణ నదీ నిర్వహణ ప్రణాళికను అభివృద్ధి చేయడంలో ఎన్.ఎం.సి.జి తో ఎన్.ఎం.యు.జి సహకారాన్ని పరిచయం చేశారు..
నమామి గంగే కార్యక్రమం గురించి, ఈ ఐడియాథాన్లో పాల్గొన్నవక్తలకు, ఇందులో పాల్గొంటున్న వారికి ఎన్.ఎం.సి.జి ,డి.జి, శ్రీ రాజివ్ రంజన్ మిశ్రా, పరిచయం చేశారు.
అతి పెద్ద నదీ పునరుజ్జీవన పథకాలలో నమామి గంగే పథకం ఒకటి. నదికిసంబంధించి సమగ్ర ప్రణాళిక, నిర్వహణ కోసం వివిధ రంగాల సమన్వయంతో సమగ్ర రివర్ బేసిన్ విధానం అనుసరించడం ద్వారా కాలుష్యాన్ని తగ్గించడం , గంగా పరీవాహక ప్రాంత పునరుజ్జీవనం లక్ష్యం.
నది సందర్శకులు, నది ఒడ్డున పడేసే ఘన వ్యర్థాల సమస్య లాక్ డౌన్ సమయంలో లేకుండా పోయింది. పరిశ్రమలు , ఇతర వాణిజ్య సంస్థల నుండి వచ్చే వ్యర్థాలూ లేకుండా పోయాయి. మునిసిపల్ మురుగునీటి ఉత్పత్తి, శుద్ధి కాస్త అటు ఇటుగా అదే స్థాయిలో ఉంది ఇప్పటివరకు ఆరంభించిన ఎస్టీపీలు పూర్తి స్థాయిలో పనిచేస్తున్నాయి
లాక్‌డౌన్ తర్వాత నదిని ఇలాంటి స్థితిలో ఉంచడం ఒక సవాలు, ఇది మౌలిక సదుపాయాల కల్పన, ప్రవర్తనలో మార్పు ద్వారా సాధ్యమవుతుంది. మనమందరం సరైన విధంగా వ్యవహరిస్తే నదిని చైతన్యంతో నింపవచ్చని కోవిడ్ -19 , దాని ఫలితంగా విధించిన లాక్‌డౌన్ చూపింది.-
పట్టణ ప్రణాళికా కొలమానాలను రూపొందించే సందర్భంలో , నదులను కూడా దృష్టిలో పెట్టుకోవలసిన ఆవశ్యకతను ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. పట్టణ ప్రణాళికను భూమి ఆధారంగా రూపొందించడం నుంచి మానవ, పర్యావరణ హితాన్ని కూడా దృష్టిలో ఉంచుకోవలసిన అవసరాన్ని కోవిడ్ -10 పాఠం నుంచి నేర్చుకోవచ్చని అన్నారు. నదికి, ప్రజలకు మధ్య గల బంధాన్ని మరింత పటిష్టం చేయవలసి ఉంది. పౌరుల ప్రవర్తనలో మార్పు తీసుకువచ్చే కార్యకలాపాలకు రూపకల్పన చేయాలి. జలవనరులు కాపాడుకోవడం ప్రస్తుత కర్తవ్యం , ఇందుకు జరిగే కృషిని ఒక పద్దతి ప్రకారం రూపుదిద్దుకునేలా చేయాలి.
గంగ నదిపై విజ్ఞానం పొందే కార్యక్రమంలో ప్రజలను నిమగ్నం చేసేందుకు శ్రీ మిశ్రా 'గంగా క్వెస్ట్' (గ్యాంగాక్వెస్ట్.కామ్ వద్ద ఆన్‌లైన్ క్విజ్) ను ప్రవేశపెట్టారు, దీనికి మంచి స్పందన వచ్చింది.. లాక్‌డౌన్ నేపథ్యంలో, 600,000 మంది విద్యార్థులు ఇతరులు ఇందులో పాలుపంచుకుంటున్నారు.గంగానదిపై విజ్ఞానం పొందే కార్యక్రమంలో ప్రజలను నిమగ్నం చేసేందుకు శ్రీ మిశ్రా 'గంగా క్వెస్ట్' (gangaquest.com) ను ప్రవేశపెట్టారు, దీనికి మంచి స్పందన వచ్చింది.. లాక్‌డౌన్ నేపథ్యంలో, 6,00,000 మంది విద్యార్థులు ఇతరులు ఇప్పటికే ఇందులో పాలుపంచుకుంటున్నారు.
సుస్థిరాభివృద్ధిలక్ష్యాలు నీటి నిర్వహణకు సంబంధించి స్పష్టమైన దార్శనికత కలిగి ఉన్నాయి. ప్రత్యేకించి ఇండియాలో నదీపరివాహక ప్రాంత నిర్వహణకుగల ప్రాధాన్యత దృష్ట్యా ప్రభుత్వాలు వీటి లక్ష్యాలపైపై దృష్టిపెడుతున్నాయి. ఇందుకు బహుళపక్ష భాగస్వాములు, వివిధ మంత్రిత్వశాఖల సమన్వయంతో కూడిన విధానాలతోపాటు సమీకృత సమాచార వ్యవస్థ అవసరం. నదీపరివాహక సంస్థ అభివృద్ధి, గంగా నది పరివాహక ప్రాంత నిర్వహణ కోసం నమామి గంగే ప్రాజెక్టు కింద అనుకూల ఫ్రేమ్ వర్క్‌ను , రివర్ బేసిన్ ప్లానింగ్ , మేనేజ్‌మెంట్ సైకిల్ ను అభివృద్ది చేసేందుకు ఎన్.ఎం.సి.జి సంస్థ జి.ఐ.జెడ్ తో కలసి పనిచేస్తోంది. వివిధ మంత్రిత్వ శాఖలు సేకరించిన డేటా వ్యవస్థల బేస్ లైన్ ఇంటిగ్రేషన్ కార్యాచరణ ప్రణాళికల మెరుగైన నిర్వహణ , అమలుకు సహాయపడుతుంది
భవిష్యత్ నీటి నిర్వహణ ప్రయత్నాలు, ప్రభుత్వ మౌలిక సదుపాయాలలోనే కాకుండా, కమ్యూనిటీలు, సొసైటీలు, ఎన్జిఓలు, యాక్షన్ గ్రూపులు, స్టార్టప్‌లు వ్యక్తుల కృషిని సంఘటితం చేయాలి. ఇలాంటి కృషికిసంబంధించి ఆర్ధిక విలువను లెక్కించడం చాలా కష్టంమైనప్పటికీ, సహజ వనరుల మెరుగైన నిర్వహణపై దృష్టి పెట్టాల్సిన రంగాలలో, పర్యావరణ వ్యవస్థ సేవల ఆర్థిక మూల్యాంకనం కూడా ఒక ముఖ్యమైన అంశం. ఇందుకు సంబంధించి మరింత వివరిస్తూ శ్రీ మిశ్రా, జాతీయ గంగా మండలికి అధ్యక్షత వహించేటప్పుడు ప్రధాని శ్రీనరేంద్ర మోదీ పేర్కొన్న ‘అర్థ్ గంగా’ భావన గురించి మాట్లాడారు. నీటిపారుదల, వరద నియంత్రణ , ఆనకట్టలపై ప్రభుత్వ ఖర్చులు, సేంద్రీయ వ్యవసాయం, మత్స్య, వైద్య తోటల పెంపకం, పర్యాటక , రవాణా, జీవవైవిధ్య ఉద్యానవనాలు వంటివి అర్థ్ గంగా కు నిరూపితమైన నమూనాలుగా చెప్పుకోవచ్చు.
.
కోవిడ్ -19 నేపథ్యంలో వారు తెలుసుకున్నదేమంటే, ఇప్పుడు, “ఎవరు మనుగడ సాధించగలిగితే వారు అన్నట్టు కాకుండా , అత్యంత అనుకూలమైన మనుగడ అన్నది ముందుకు వచ్చింది..” అడాప్టివ్ గవర్నెన్స్ ఆలోచనపై మిశ్రా ప్రముఖంగా ప్రస్తావించారు., సహకార భాగస్వామ్యంతో, భవిష్యత్తు సవాళ్లను ఎదుర్కోవడానికి నది నిర్వహణను ఎలా చేపట్టాలో తెలిపే విధంగా ఇది ఉండాలన్నారు.
ఐడియా థాన్ ప్రముఖ వక్తలలో ధాయిలాండ్ లోని బ్యాంకాక్‌కు చెందిన , ఇన్స్టిట్యూట్ ఫర్ గ్లోబల్ ఎన్విరాన్‌మెంటల్ స్ట్రాటజీస్ సీనియర్ పాలసీ సలహాదారు డాక్టర్ పీటర్ కింగ్ ఉన్నారు. డాక్టర్ కింగ్ ఆసియా ఎన్విరాన్మెంటల్ కంప్లైయన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ నెట్‌వర్క్ సెక్రటేరియట్‌కు నాయకత్వం వహిస్తున్నారు., వాతావరణ మార్పులకు సంబంధించి ఆసియా కోఆర్డినేషన్ గ్రూపులో ఆయన సభ్యుడు అలాగే యుఎస్‌ఐఐడి అడాప్టేషన్ ప్రాజెక్ట్ ప్రిపరేషన్ అండ్ ఫైనాన్స్,అడాప్ట్ ఆసియా-పసిఫిక్ ప్రాజెక్టుకు టీమ్ లీడర్, ఏదైనా రివర్ బేసిన్ మేనేజ్‌మెంట్ ప్లాన్ కోసం కీలకమైన అంశాలను ఆయన ప్రస్తావించారు., దీని ప్రభావం సమీప భవిష్యత్తులో కొంత వరకు ఉంటుంది.
ఈ కీలక అంశాలలో, భవిష్యత్‌లో నదికి సంబంధించి రూపొందించే ప్రణాళికపై వాతావరణ ప్రభావం, అది ఏరకంగా నీటి వ్యవస్థను ప్రభావితం చేస్తుంది? దీని ప్రభావం తగ్గించడానికి ఏం చేయాలి వంటివి ఉన్నాయి. నది ఎగువ భాగం, దిగువ భాగం లోకార్యకలాపాలను జాగ్రత్తగా గమనించాల్సి ఉందని ఆయన అన్నారు. ఎందుకంటే నది ఎగువ భాగంలో కార్యకలాపాల ప్రభావం నదిదిగువ భాగంపై పడుతుంది కనుక.
.
నగర సరిహద్దులోకి ప్రవేశించే నది నీటి నాణ్యత ఎలా ఉందో , సరిహద్దులు దాటేటప్పుడు కూడా కనీసం అదేస్థాయి నీటి నాణ్యత కలిగి ఉండాలి.. నదులపై అభివృద్ధి చేస్తున్న జలవిద్యుత్ ప్రాజెక్టులు, వాటి ప్రభావాలతో పాటు వరదలు, తక్కువ ఇ-ప్రవాహం, అవక్షేపణ మొదలైన వాటిపై అధ్యయనం చేయాలి.
నదిపై వస్తున్న అన్ని కొత్త పెద్ద ప్రాజెక్టులకు ట్రాన్స్-బౌండరీ ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ చేయించే నిబంధన ఉండాలి. నది నిర్వ,మరియు నది నిర్వహణ ప్రణాళిక తయారీకి కృత్రిమ మేధస్సును ఉపయోగించడం చాలా ముఖ్యం.కోవిడ్ సంక్షోభాన్ని దర్శించడానికి, ప్రకృతి నుంచి నేర్చుకోండి అన్న వినూత్న ఆలోచనను డాక్టర్ కింగ్ ముందుకు తెచ్చారు. ఈ కార్యక్రమంలోపాల్గొన్నవారు పై అంశాలను ప్రకృతి దృష్టికోణంలోంచి చూడాలని, ఈ సంక్షోభ సమయంలో ప్రకృతి మనకు ఏం బోధిస్తున్నదో గ్రహించాలన్నారు.
అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌కు చెందిన లాస్ ఏంజెల్స్ రివర్ వర్క్స్ అథారిటీ అధిపతి మై్‌ఖేల్ అఫెల్డట్ కూడా ఐడియాథాన్‌లో మాట్లాడారు. మై్‌ఖేల్ అఫెల్డట్, మేయర్ ఎరిక్ గార్సెట్ సిటీ సర్వీసెస్ కార్యాలయంలో లాస్ ఏంజెల్స్ రివర్ వర్క్స్ టీమ్ కు డైరక్టర్‌గా ఉన్నారు. లాస్ ఏంజిల్స్ రివర్ వర్క్స, లాస్ ఏంజెల్స్ రీవైటలైజేషన్ మాస్టర్ ప్లాన్ , లాస్ ఏంజెల్స్ నదీ-సంబంధిత కృషి విషయంలో విధానపరమైన అంశాల అభివృద్ధి, ప్రాజెక్టు సమన్వయం చేస్తుంది. లాస్ ఏంజెల్స్ మాస్ట్ ప్లాన్ రూపకల్పనలో తన అనుభవాలను ఆయన ఈ సందర్భంగా వివరించారు. లాస్ ఏంజిల్స్ నగరం ఒకప్పుడు లాస్ఏంజెల్స్ నది ఒడ్డున ఏర్పడింది, కాని ఆతర్వాత నగరం బాగా విస్తరించింది. ఫలితంగా నదిని మరింత అందుబాటులోకి తెచ్చి, ఉద్యానవనాలు ,బహిరంగ ప్రదేశాలను మరింత సహజంగా అభివృద్ధి చేయడం ద్వారా నదితో ప్రజల బంధాన్ని మెరుగుపరచాల్సిన అవసరం ఏర్పడింది. ఏదైనా నది నిర్వహణ ప్రణాళికరూపకల్పన కోసం, ముందు ప్రకృతి సంబంధ సమస్యలను పరిష్కరించుకోవాలి , తరువాత నదిని, దాని చుట్టుపక్కల ఆవాసాలు , ప్రజలతో దానిని అనుసంధానించాలి
థాయిలాండ్‌లోని బ్యాంకాక్‌లోగల మెకాంగ్ ఫ్యూచర్స్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ అలెక్స్ స్మాజ్‌గ్ల్ మాట్లాడుతూ, స్టేక్ హోల్డర్లకు తగిన ప్రాముఖ్యత ఇవ్వకపోవడం వల్ల వివిధ విధానపరమైన విధానాలు, శాస్త్రీయ పరిశోధనల అమలులో విఫలమౌతున్నాయని అన్నారు.
ఒక ప్రాజెక్ట్ విజయవంతం కావడానికి పాలసీ-సైన్స్ ఇంటర్ఫేస్ ఉండాలన్నారు. ప్రాజెక్టు ఫ్రేమ్‌వర్క్, స్టేక్ హోల్డర్ల పాత్రకు సంబంధించి ఖచ్చితంగా వివరణ ఇచ్చేదిగా ఉండాలని ఆయన చెప్పారు.
నది పునరుజ్జీవన ప్రణాళికను సిద్ధం చేయడానికి ముందు గుర్తుంచుకోవలసిన పాఠాలు ఏమిటంటే, బహుళ-స్థాయి, బహుళ రంగం లేదా క్రాస్-లెవల్ వర్కింగ్ గ్రూపును కలిగి ఉండాలి, భాగస్వామ్య దృష్టిని కలిగి ఉండాలి, ఇది వాటాదారులకు ప్రాజెక్టును తమది అన్న భావన కలిగిస్తుంది. రాజకీయ రిస్క్‌లను అర్థం చేసుకోవాలి. అనుభవం , వాస్తవ పరిస్థితుల నుండి నేర్చుకోవాలి అని ఆయన చెప్పారు.
సహజ వనరుల నిర్వహణ, అభివృద్ధి, పట్టణీకరణ వాతావరణ మార్పుల వ్యవస్థల సందర్భంలో ట్రాన్స్-డిసిప్లినరీ మోడలింగ్‌పై దృష్టి సారించిన పర్యావరణ ఆర్థిక శాస్త్రంలో డాక్టర్ అలెక్స్ స్మాజ్‌గ్ల్ నిపుణుడు.
ఇంటర్నేషనల్ వాటర్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్ లో ప్రిన్సిపల్ ఎకోసిస్టమ్ రీసెర్చర్, డాక్టర్ క్రిస్ డికెన్స్ ,మూడు ప్రధాన రంగాలలో పనిచేసిన 30 సంవత్సరాల అనుభవం ఉన్న జల పర్యావరణ శాస్త్రవేత్త: జల పర్యావరణ వ్యవస్థ ఆరోగ్యం, పర్యావరణ అవసరాలు వనరుల నాణ్యత లక్ష్యాలు , నీటి వనరుల నిర్వహణ , పాలనతో సహా నీటి వనరుల రక్షణలో వారికి విశేష అనుభవం ఉంది.
డాక్టర్ డికెన్స్ నది నిర్వహణ ప్రణాళికలో జీవవైవిధ్యం ప్రాముఖ్యతను ప్రముఖంగా ప్రస్తావించారు. నగరాలు ప్రత్యక్షంగా , పరోక్షంగా నదులు వాటి చుట్టుపక్కల ఉన్న పర్యావరణ వ్యవస్థపై ఎక్కువగా ఆధారపడి ఉంటాయి. నీటి వనరులు పర్యావరణ వ్యవస్థ సక్రమంగా ఉన్నాయన్న దానిని పరిశుభ్రమైన నదులు సూచిస్తాయి.. నది పర్యావరణ వ్యవస్థ ధ్వంసం కాకుండా, లేదా నాశనం కాకుండా వివిధ పోషకాలు, ఆల్గే బ్లూమ్,ఇతర భారీ లోహాలు నది నీటిలో ఏ స్థాయిలో ఉన్నాయొ గమనించుకుంటూ నది నీటి నాణ్యతను పర్యవేక్షించడం చాలా ముఖ్యం. నది లోని వివిధ సూక్ష్మజీవుల వైవిధ్యంపై డేటా సేకరణ చేయవలసి ఉంది. నది , నీటి వనరు దాని పర్యావరణ వ్యవస్థకు ఉన్న సంబంధం ఎంతో ముఖ్యమైనది, దీనిని సరిగా అర్థం చేసుకోవాలి.
ఐడియాథాన్, నది నిర్వహణ కు సంబంధించిన వివిధ అంశాలపై చాలా ఇంటరాక్టివ్ చర్చకు అవకాశం కల్పించింది..ఐడియాథాన్ నడుస్తున్న సమయంలో సమాంతర అభిప్రాయ సేకరణలో కూడా ఇందులో పాల్గొన్నవారు పాలుపంచుకున్నారు. ఇందులో పాల్గొన్న వారి నుండి వివిధరకాల ప్రశ్నలు కూడా వచ్చాయి
.
ఐడియాథాన్లో పాల్గొన్నందుకు ప్యానలిస్టులందరికీ ఎన్‌ఎంసిజి ,డి.జి కృతజ్ఞతలు తెలిపారు .అలాగే వివిధ అంశాలపై తమ ప్రచురణలు, అనుభవం మొదలైనవాటిని ఇతరులతో పంచుకునేందుకు ముందుకొచ్చారు. వివిధ అంశాలపై సహకారానికి సంబంధించి తీసుకోవలసిన చర్యలు రూపొందిచనున్నారు. భవిష్యత్తులో ఎన్‌ఐయుఎ , ఇతర సంస్థల సహాయంతో థీమాటిక్ వెబ్‌నార్లు ,రౌండ్‌టేబుల్స్ నిర్వహించనున్నారు. ఇది గంగా నాలెడ్జ్ సెంటర్ అభివృద్ధికి మరింత సహాయపడుతుంది.
ఐడియాథాన్ చర్చల ఆధారంగా విధానపత్రాన్ని తీసుకురావాలని నమామి గంగే , ఎన్‌ఐయుఎ యోచిస్తున్నాయి. ఈ సెషన్ కార్యకలాపాలు త్వరలో ఎన్.ఎం.సి.జి వెబ్‌సైట్ ద్వారా అందరికీ అందుబాటులో ఉండనున్నాయి.
(Release ID: 1620545)
Visitor Counter : 316