సాంస్కృతిక మంత్రిత్వ శాఖ
విర్చువల్ టూర్ నిర్వహించడంద్వారా ప్రఖ్యాత కళాకారుడు జమినీ రాయ్ కి నేషనల్ ఆర్ట్ గ్యాలరీ ఆఫ్ మోడర్న్ ఆర్ట్ ఘన నివాళి ఎన్ జి ఎంఏ సేకరించిన 215 కళాఖండాల్లో 203 ప్రదర్శన
Posted On:
02 MAY 2020 3:31PM by PIB Hyderabad
ప్రఖ్యాత కళాకారుడు జమినీ రాయ్ 133వ జయంతి ఏడాదిని పురస్కరించుకొని విర్చువల్ టూర్ నిర్వహించడంద్వారా నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడర్న్ ఆర్ట్ (ఎన్ జి ఎంఏ) ఘన నివాళి ఘటించింది. ఈ విర్చువల్ టూర్ ను ((http://www.ngmaindia.gov.in/virtual-tour-of-modern-art-1.asp)ను 9 విభాగాలు వర్గీకరించారు. ఈ 9 విభాగాల్లో 203 కళాఖండాలను ప్రదర్శించారు. ఆయన కళాఖండాల సృజనాత్మకతలోని అన్ని పార్శ్వాలను ఈ ప్రదర్శనలో చూడవచ్చు. ఎన్ జి ఎంఏ చేసిన శాశ్వత సేకరణలో మొత్తం 215 జమినీ రాయ్ కళాఖండాలున్నాయి. ఇది దేశంలోనే మొదటిసారిగా జరుగుతున్న విర్చువల్ టూర్.
కోవిడ్ -19 మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎన్ జి ఎం ఏ మ్యూజియం, లైబ్రరీని మూసేయడం జరిగింది.
కరోనా మహమ్మారి కారణంగా కళా ప్రియులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా వుండాలని ఈ విర్చువల్ టూర్ ఏర్పాటు చేసినట్టు ఎన్ జి ఎంఏ డైరెక్టర్ జనరల్ శ్రీ అద్వైత గదనాయక్ అన్నారు. ప్రఖ్యాత కళాకారుడు జమినీ రాయ్ కళాఖండాల్లోని గొప్పదనాన్ని కళా ప్రియులు ఆస్వాదిస్తారని ఆశిస్తున్నట్టు ఆయన చెప్పారు. రానున్న రోజుల్లో ఇలాంటి మరిన్ని విర్చువల్ టూర్లను ఏర్పాటు చేస్తామని ఆయన వివరించారు. ఎన్ జి ఎంఏ ఐటీ విభాగం వీఇని డిజైన్ చేసిందని ఆయన అన్నారు.
జమినీ రాయ్ 20 వ శతాబ్దానికి చెందిన ప్రసిద్ద కళాకారుల్లో ముఖ్యమైనవారు. 1920నుంచీ ఆయన తన చిత్రకళలో అనేక ప్రయోగాలు చేశారు. ఆయన చిత్రకళలో ఆధునికతను ప్రతిఫలించారు. దాదాపు ఆరు దశాబ్దాలపాటు శ్రీ జమినీ రాయ్ అనేక గొప్ప కళాఖండాలను సృజించి తన సత్తా చాటారు. తన కాలంలోని చిత్ర కళా విధానాలకు భిన్నంగా ఆయన చిత్రకళ కొనసాగింది. బ్రిటీష్ అకాడమిక్ విధానంలో శిక్షణ పొందిన ఆయన నైపుణ్యంగల పోట్రెయిట్ ఆర్టిస్టుగా పేరు సంపాదించుకున్నారు. 1916లో కలకత్తాలోని గవర్నమెంట్ ఆర్ట్ స్కూల్ లో గ్రాడ్యుయేషన్ చదివారు.
1920 లనుంచి యూరోపియన్ తైల చిత్రీకరణను వదిలేసి సంప్రదాయ వనరుల ద్వారా అంటే కూరగయాలు, ఖనిజాలనుంచి తయారు చేసిన పిగ్మెంట్స్ వాడడం మొదలుపెట్టారు. ఆయన తన చిత్రాల ద్వారా గ్రామీణతకు పట్టం కట్టారు.
***
(Release ID: 1620442)
Visitor Counter : 161