పౌర విమానయాన మంత్రిత్వ శాఖ

దేశవ్యాప్తంగా ప్రజలకు అవసరమైన మందులను లైఫ్ లైన్ ఉడాన్ కింద 422 విమానాల్లో రవాణా చేయడం జరిగింది.

Posted On: 02 MAY 2020 3:43PM by PIB Hyderabad

లైఫ్ లైన్ ఉడాన్ కింద ఎయిర్ ఇండియా, అలయన్స్ ఎయిర్, ఐ.ఏ.ఎఫ్., మరియు ప్రైవేట్ సంస్థలు 422 విమానాలు నడిపాయి. వీటిలో 244 విమానాలను ఎయిర్ ఇండియా మరియు అలయన్స్ ఎయిర్ సంస్థలు నడిపాయి. ఈ రోజు వరకు 790.22 టన్నుల సరుకు రవాణా అయ్యింది. ఈ రోజు వరకు లైఫ్ లైన్ ఉడాన్ విమానాలు 4,13,538 కిలోమీటర్ల వాయు మార్గంలో ప్రయాణించాయికోవిడ్-19 కు వ్యతియేకంగా భారతదేశం జరుపుతున్న పోరాటానికి మద్దతుగా దేశంలోని మారుమూల ప్రాంతాల ప్రజలకు అవసరమైన వైద్య సామాగ్రిని రవాణా చేయడానికి ఎమ్.ఓ.సి.ఏ. "లైఫ్ లైన్ ఉడాన్విమానాలను నడుపుతోంది 

 

జమ్మూకశ్మీర్, లడఖ్, దీవులు మరియు ఈశాన్య ప్రాంతానికి క్లిష్టమైన వైద్య సామాగ్రి మరియు రోగులను తీసుకువెళ్ళడానికి పవన్ హన్స్ లిమిటెడ్ సంస్థతో పాటు హెలికాప్టర్ సేవలు వినియోగిస్తున్నారు.  2020 మే నెల 1వ తేదీ వరకు పవన్ హన్స్ సంస్థ 7,529 కిలోమీటర్లు ప్రయాణించి 2.3 టన్నుల సామాగ్రిని రవాణా చేసింది. ఈశాన్య ప్రాంతం, దీవుల ప్రాంతాలు, పర్వత రాష్ట్రాల పై ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగిందిజమ్మూకశ్మీర్, లడఖ్, ఈశాన్య ప్రాంతం మరియు ఇతర దీవుల ప్రాంతాలకు ఎయిర్ ఇండియా మరియు ఐ.ఏ.ఎఫ్. సంయుక్తంగా సేవలందించాయి. 

 

దేశీయ కార్గో సంస్థలు స్పైస్ జెట్, బ్లూ డార్ట్ మరియు ఇండిగో సంస్థలు వాణిజ్య పరంగా కార్గో విమానాలు నడిపాయి.  2020 మార్చ్ 24వ తేదీ నుండి మే నెల 1వ తేదీ వరకు స్పైస్ జెట్ కు చెందిన  734 కార్గో విమానాలు 12,77,213 కిలోమీటర్లు ప్రయాణించి 5,320 టన్నుల సరుకు రవాణా చేశాయి. వీటిలో 270 అంతర్జాతీయ కార్గో విమానాలు ఉన్నాయి. 2020 మార్చ్ 25వ తేదీ నుండి మే నెల 1వ తేదీ వరకు బ్లూ డార్ట్ సంస్థకు చెందిన 245 కార్గో విమానాలు 2,67,417  కిలోమీటర్లు ప్రయాణించి 4,179 టన్నుల సరుకు రవాణా చేశాయి. వీటిలో 12 అంతర్జాతీయ కార్గో విమానాలు ఉన్నాయి. 2020 ఏప్రిల్ 3వ తేదీ నుండి మే నెల 1వ తేదీ వరకు ఇండిగో సంస్థకు చెందిన 82 కార్గో విమానాలు 1,36,060  కిలోమీటర్లు ప్రయాణించి 393 టన్నుల సరుకు రవాణా చేశాయి. వీటిలో 27 అంతర్జాతీయ కార్గో విమానాలు ఉన్నాయి. వీటిలో ప్రభుత్వం కోసం ఉచితంగా రవాణా చేసిన మందులు కూడా ఉన్నాయి. 2020 ఏప్రిల్ 19వ తేదీ నుండి మే నెల 1వ తేదీ వరకు విస్తారా సంస్థకు చెందిన 20 కార్గో విమానాలు 28,590  కిలోమీటర్లు ప్రయాణించి 139 టన్నుల సరుకు రవాణా చేశాయి

 

అంతర్జాతీయ రంగంలో, ఫార్మస్యూటికల్స్ మరియు వైద్య పరికరాలు, కోవిడ్ల-19 సహాయ సామాగ్రి రవాణా కోసం, ఈస్ట్ ఆసియా తో ఒక కార్గో ఎయిర్-బ్రిడ్జి ని ఏర్పాటు చేయడం జరిగింది.  ఎయిర్ ఇండియా 842 టన్నుల మేర వైద్య సామాగ్రిని తీసుకువచ్చింది. దీనికి అదనంగా బ్లూ డార్ట్ సంస్థ 2020 ఏప్రిల్ 14వ తేదీ నుండి మే నెల 1వ తేదీ వరకు గుయాంగ్జ్ మరియు షాంఘై దేశాల నుండి 114 టన్నుల వైద్య సామాగ్రిని తీసుకువచ్చింది. స్పైస్ జెట్ సంస్థ మే నెల 1వ తేదీ వరకు షాంఘై మరియు గుయాంగ్జ్ దేశాల నుండి 204 టన్నుల వైద్య సామాగ్రిని తీసుకువచ్చింది. అదేవిధంగా స్పైస్ జెట్ సంస్థ మే నెల 1వ తేదీ వరకు హాంగ్ కాంగ్ మరియు సింగపూర్ దేశాల నుండి 16 టన్నుల వైద్య సామాగ్రిని తీసుకువచ్చింది.  

****



(Release ID: 1620428) Visitor Counter : 180