వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ

ఆసక్తిగల దేశాలతో పరస్పర లబ్ధి పొందే సహకారానికి, ఒప్పందాలు చేసుకునేందుకు భారత్ సిద్ధంగా ఉందని ఫారెన్ మిషన్ గురించి తెలియజేసిన శ్రీ పీయూష్ గోయల్

భారత ప్రధాని పోషించిన కీలకమైన పాత్ర కోవిడ్ సమస్యలను ఎదుర్కోవడంలో ఉత్తమ ఉద్దీపన. ఇది ప్రపంచ వ్యాప్తంగా ప్రశసించబడింది.

భారతదేశం నుంచి ఏ దేశానికైనా ఔషదాల రూపంలో ఏవైనా సహకారం అవసరమైతే, భారతదేశం దాన్ని నెరవేర్చడానికి ప్రయత్నిస్తుంది.

Posted On: 01 MAY 2020 8:06PM by PIB Hyderabad

ఒప్పందంలో పరస్పర సంబంధం ఉన్నంత వరకూ ఆసక్తి గల దేశాలతో పరస్పరం లబ్ధి పొందే సహకారానికి భారత్ సిద్ధంగా ఉందని వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్ తెలిపారు. నూఢిల్లీలో ఫారెన్ మిషన్స్ తో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడిన ఆయన, భారత్ తో వ్యాపారం చేయాలకుంటున్న ఆసక్తిగల దేశాలను స్వాగతించారు. ఏదైనా బహుపాక్షిక ఒప్పందాలపై సంతకం చేసేటప్పుడు న్యాయమైన వ్యవహారం మరియు పరస్పర సహాకారాని భారత్ చాలా ప్రాముఖ్యతనిస్తుందన్న మంత్రి, రీజనల్ ఎకనామిక్ కాంప్రహెన్సివ్ పార్టనర్ షిఫ్ (ఆర్.ఈ.సి.పి)లో భారత్ పాల్గొనకపోవడానికి ఇదే కారణమని తెలిపారు. ద్వైపాక్షిక లేదా బహుపాక్షిక ఒప్పందాల కోసం రోడ్ మ్యాప్ ప్రణాళిక కోసం డిజిటల్ గా కనెక్ట్ అవ్వడానికి ఇది సరైన సమయమని ఆయన తెలిపారు.

కరోనావైరస్ మహమ్మారి వ్యాప్తికి వ్యతిరేకంగా సహకార ప్రయత్నాల కోసం మంత్రి ఇతర దేశాలకు విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం భారతదేశంలో ఉన్న విదేశీ పౌరుల భద్రత, శ్రేయస్సును భారత్ చూసుకుంటోందని ఆయన అన్నారు. ఏప్రిల్ 5 న ప్రధాని కోరిన విధంగా 9 నిమిషాలు “లైట్ ఆఫ్‌”లో పాల్గొన్నందుకు ఆయన వారికి కృతజ్ఞతలు తెలిపారు.

'సంక్షోభ సమయంలో భారత ప్రధాని పోషించిన కీలకమైన మరియు తగిన పాత్ర' సంక్షోభానికి వ్యతిరేకంగా ఉత్తమ ఉద్దీపన అని ఇటీవలి సర్వేలు మరియు అధ్యయనాలు రుజువు చేశాయని, ఇది దేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసించబడిందని శ్రీ గోయల్ తెలిపారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ సహా పలువురు ప్రపంచ నాయకుల భారత్ నుంచి ఔషధాల ఎగుమతి కోరిన విషయాన్ని ప్రస్తావించిన శ్రీ గోయల్, భారతదేశానికి మాత్రమే కాకుండా ప్రపంచంలోని ఇతర దేశాలకు కూడా ఔషధాలను ఉత్పత్తి చేయడంలో మరియు పంపిణీ చేయడంలో భారతీయ ఔషధ పరిశ్రమ ముఖ్యమైన పాత్ర పోషిస్తోందని తెలిపారు. పోస్ట్-కోవిడ్ ప్రపంచంలో భారతదేశం నాయకత్వ పాత్ర పోషిస్తుందనే విశ్వాసాన్ని వ్యక్తం చేసిన ఆయన, అవసరమైన మందులను, ముఖ్యంగా అభివృద్ధి చెందని దేశాలను ఏ దేశమూ కోల్పోకుండా ఉండటానికి భారత్ భరోసా ఇస్తోందని అన్నారు. భారతదేశం నుండి ఔషధ పరంగా ఏదైనా సహాయం అవసరమైతే, భారత్ దాన్ని నెరవేర్చడానికి ప్రయత్నిస్తుందని ఆయన వారికి హామీ ఇచ్చారు. కానీ దీర్ఘకాలికంగా, ఫార్మసీ రంగం యొక్క స్థిరమైన వాణిజ్యం కోసం భారత్ త్వరితగతిన రోడ్‌మ్యాప్ తయారు చేయాల్సి ఉందని, ప్రధాని చెప్పినట్లు, ప్రపంచ పౌరుడిగా, అవసరమైన వారికి సేవ చేయడం మన బాధ్యత అని అన్నారు.

మహమ్మారి సమయంలో ప్రధాన మంత్రి ఆయుష్మాన్ భారత్ పథకం పాత్ర కీలకం కానుందని మంత్రి తెలిపారు. కేసుల సంఖ్య తగ్గింపు కోసం ప్రత్యేక సూచనలతో తక్షణ దేశవ్యాప్త లాక్ డౌన్ యొక్క ప్రభావాన్ని ఆయన నొక్కిచెప్పారు. ఈ సంక్షోభ సమయంలో, సంక్షోభం నుండి దేశ ఆర్థిక వ్యవస్థ పునరుజ్జీవనం కోసం ప్రభుత్వం దీర్ఘకాలిక వ్యూహాలను రూపొందిస్తోందని శ్రీ గోయల్ అన్నారు. భవిష్యత్తులో సహకారం కోసం మన స్వంత దేశాలకు నిజమైన భాగస్వామ్య దేశాలను గుర్తించే సమయమిదని ఆయన తెలిపారు.

 

***



(Release ID: 1620211) Visitor Counter : 183