భారత పోటీ ప్రోత్సాహక సంఘం
ఇంటాస్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్‌లో 5% కన్నా తక్కువ వాటాను కానరీ ఇన్వెస్ట్‌మెంట్స్ లిమిటెడ్ మరియు లింక్ ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్ట్ II పొందటానికి సీసీఐ ఆమోదం
Posted On:
30 APR 2020 8:06PM by PIB Hyderabad
ఇంటాస్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్‌లో 5% కన్నా తక్కువ వాటాను కానరీ ఇన్వెస్ట్‌మెంట్స్ లిమిటెడ్ మరియు లింక్ ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్ట్ II పొందటానికి చేసిన ప్రతిపాదనకు సీసీఐ ఆమోదం తెలిపింది. పోటీ చట్టం, 2002 లోని సెక్షన్ 31 (1) ప్రకారం ఈ ప్రతిపాదనకు తాము ఆమోదం తెలుపుతున్నట్టుగా సీసీఐ తెలిపింది. ఈ ప్రతిపాదన కానరీ ఇన్వెస్ట్‌మెంట్స్ లిమిటెడ్ (కానరీ) మరియు లింక్ ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్ట్ II (లింక్ II) చేత ఇంటాస్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ (ఇంటాస్) యొక్క 5% కన్నా తక్కువ వాటాను పొందటానికి సంబంధించినది. కానరీ మారిషస్‌లో రిజిస్టర్ చేయబడిన పెట్టుబడి సంస్థ. లింక్ II అనేది భారతదేశ చట్టాల ప్రకారం సృష్టించబడిన మరియు నమోదు చేయబడిన ఒక ప్రైవేట్ ట్రస్ట్.
ఇంటాస్ అనేది భారతదేశ చట్టాల ప్రకారం విలీనం చేయబడిన మరియు నమోదు చేయబడిన ఒక పబ్లిక్ లిమిటెడ్ సంస్థ. ఇంటాస్ సంస్థ ఇంటిగ్రేటెడ్ గ్లోబల్ ఫార్మాస్యూటికల్ ఫార్ములేషన్ డెవలప్‌మెంట్, మాన్యుఫ్యాక్చరింగ్, మరియు మార్కెటింగ్ సంస్థ. కానరీ మరియు లింక్ II ప్రతిపాదించిన మార్పులకు లోబడి ప్రతిపాదిత వాటా కొనుగోలును సీసీఈ కమిషన్ ఆమోదం తెలిపింది. ఈ ప్రతిపాదన ఆమోదానికి సంబంధించిన పూర్తి వివరణాత్మక ఆర్డరు వెలువడాల్సి
ఉంది.
(Release ID: 1619826)
Visitor Counter : 112