రక్షణ మంత్రిత్వ శాఖ
పాలమ్ ఎయిర్‌బేస్‌లో చిన్నపాటి ఘటన విమాన కెప్టెన్ అప్రమత్తతో తప్పిన ప్రమాదం
प्रविष्टि तिथि:
30 APR 2020 7:49PM by PIB Hyderabad
2020, ఏప్రిల్ 30న భారత వైమానిక దళానికి చెందిన డోర్నియర్ విమానానికి ప్రమాదం తప్పింది. పాలమ్ ఎయిర్ బేస్ నుంచి సాధారణ విమాన ప్రయాణం చేపట్టడానికి డోర్నియర్ విమానాన్ని సిద్ధం చేశారు. టేకాఫ్ సమయంలో విమాన చక్రం కుచించుకుపోయింది. వెంటనే స్పందించిన విమాన కెప్టెన్, సరైన చర్యలు చేపట్టి టేకాఫ్ నిలిపివేశారు. విమాన సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారు. ఎలాంటి ఆస్తినష్టం జరగలేదు. వెంటనే అక్కడికి చేరుకున్న భారత వైమానికి దళ సాంకేతిక సిబ్బంది, రన్ వే నుంచి విమానాన్ని తీసుకెళ్లారు.
(रिलीज़ आईडी: 1619817)
आगंतुक पटल : 136