శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
కొత్త అనుకరణ కోడ్ ఉపగ్రహాలు కదిలించే భూమి యొక్క అయస్కాంత గోళంలో విద్యుత్ క్షేత్ర నిర్మాణాన్ని అధ్యయనం చేయడానికి సహాయపడుతుంది
భవిష్యత్ అంతరిక్ష కార్యకలాపాల ప్రణాళికలో ఈ అధ్యయనం ఉపయోగపడుతుంది
ఇది మానవత్వం యొక్క ఎప్పటికప్పుడు విస్తరిస్తున్న శక్తి అవసరాలకు ఖచ్చితంగా నియంత్రిత ఫ్యూజన్ ప్రయోగశాల ప్రయోగాలకు దారితీస్తుంది
Posted On:
30 APR 2020 3:33PM by PIB Hyderabad
కేంద్ర ప్రభుత్వానికి చెందిన శాస్త్ర సాంకేతిక విభాగ పరిధిలోని స్వయంప్రతిపత్తి సంస్థ ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ జియో మాగ్నెటిజమ్ ( ఐఐజి) ఏక కోణ ఫ్ల్యూయిడ్ సిమ్యులేషన్ కోడ్ ను అభివృద్ధి చేసింది. భూమి ప్లాస్మా వాతావరణానికి దగ్గరగా వున్న వివిధ విద్యుత్ క్షేత్ర నిర్మాణాలను లేదా భూమి మాగ్నటో స్పియర్ ను అధ్యనం చేయడానికి ఈ కోడ్ ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ అధ్యయన ఫలితాలు భవిష్యత్తులో చేసే అంతరిక్ష పరిశోధనలకు ఉపయోగపడతాయి.
భూమి మాగ్నెటో స్పియర్ చాలా విస్తృతమైన ప్రాంతం. ఇందులోనే గణనీయ సంఖ్యలో ఉపగ్రహాలు తిరుగుతుంటాయి. ఈ అధ్యయనం ద్వారా ఉపగ్రహం చుట్టూ జరిగే ప్లాస్మా ప్రాసెస్సులను అర్థం చేసుకోవడానికి వీలవుతుంది.
విశ్వంలోని 99 శాతం పదార్థం ప్లాస్మా రూపంలో వుంటుంది. అంతే కాదు భూమి మాగ్నెటో స్పియర్ కూడా దీనితోనే వుంటుంది. కాబట్టి ప్లాస్మా ప్రాసెస్సులనేవి మాగ్నెటో స్పియర్ ప్రాంతంలో సంచరించే ఉపగ్రహాల పనికి విఘ్నంకలిగించే సామర్థ్యం కలిగినవి.
ఉపగ్రహాలు ఎంతో విలువైనవి. వాటి భద్రతతోపాటు మాగ్నెటో స్పియర్ ను అర్థం చేసుకోవడమనేది ముఖ్యం. ఎందుకంటే తద్వారా కాస్మోస్ ను అవగాహన చేసుకోవచ్చు. భూమి చుట్టూగల అంతరిక్షంలో ప్లాస్మా వుండడానికి ముఖ్యమైన కారణం సూర్యుడు. సౌర గాలుల రూపంలో సూర్యుడు భూమివైపు ప్లాస్మాను పంపుతుంటాడు. సౌర గాలుల వేగమనేది సెకనుకు 300 నుంచి 1500 కిలోమీటర్లు వుంటుంది. ఇవి మాగ్నెటిక్ క్షేత్రాన్ని కూడా తీసుకొస్తాయి. దీన్ని అంతర్ గ్రహ అయస్కాంత క్షేత్రం ( ఐఎంఎఫ్ ) అని కూడా అంటారు. ఐఎంఎఫ్‌కు భూమి అయస్కాంత క్షేత్రానికి మధ్యన జరిగే సంభవించే చర్యవల్ల భూమికి సంబంధించిన మాగ్నెటోస్పియర్ ఏర్పడుతుంది.
మాగ్నెటో స్పియర్‌కు సంబంధించి ఐఐజి శాస్త్రవేత్తలు చేస్తున్న పరిశోధనలు అంతరిక్ష ప్రయోగాలకు ఉపయోగపడతాయి. అంతే కాదు భవిష్యత్తులో మానవాళికి పెరగనున్న శక్తి వనరుల అవసరాలను తీర్చడానికి కూడా ఉపయోపడతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మరిన్ని వివరాలకు [Publicatications: https://doi.org/10.1063/1.5113743
మరిన్ని వివరాలకు: డాక్టర్ అజయ్ లొతేకర్, ablotekar[at]gmail[dot]com, ajay14@iigs.iigm.res.in మొబైల్ నెంబర్ : 9082752267]
****
(Release ID: 1619733)
Visitor Counter : 275