శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ

కోవిడ్-19 ఆరోగ్య సంరక్షణ పోరాట యోధులకు చేదోడుగా ఉండేందుకు హెచ్ సి ఏ ఆర్ డి రోబో

Posted On: 29 APR 2020 12:27PM by PIB Hyderabad

వైరస్ సోకిన వారి బాగోగులను ఆస్పత్రుల్లో 24/7 చూసుకునే ఆరోగ్య సంరక్షణ కార్యకర్తలు నిత్యం కోవిడ్-19 ముప్పును ఎదుర్కొంటున్నారు. ఆరోగ్య సిబ్బంది ఇటువంటి హానికర పరిస్థితులు నుండి కాస్త ఉపశమనం కలిగించడానికి స్నేహ హస్తం అందించబోతోంది హెచ్ సి ఏ ఆర్ డి  రోబో. ఈ రోబోటిక్ పరికరం  హెచ్ సి ఏ ఆర్ డి త్వరలోనే ఆస్పత్రుల్లో సేవలు వినియోగించనున్నారు. కరోనా వైరస్ సోకిన వారితో ఆరోగ్య సిబ్బంది భౌతిక దూరాన్ని పాటించడానికి ఈ కొత్త రోబోటిక్ పరికరం సహాయం అందిస్తుంది. 

దుర్గాపూర్ లో సెంట్రల్ మెకానికల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కింద ఉన్న సిఎస్ఐఆర్ ల్యాబ్ హెచ్ సి ఏ ఆర్ డి ని    అభివృద్ధి చేసింది. ఈ పరికరం వివిధ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాలతో కూడి ఉంది. ఆటోమేటిక్మాన్యువల్ నావిగేషన్ నమూనాలో పనిచేస్తుంది.

 

Description: IMG_00477

 

నర్సులు ఉండే నర్సింగ్ బూత్ నుండి ఈ రోబోను పర్యవేక్షిస్తూ ఆపరేట్ చేయవచ్చు. దీని కంట్రోల్ స్టేషన్ కి ఉన్న నావిగేషన్ వ్యవస్థ ద్వారా రోగులకు మందులనుఆహారాన్ని అందించవచ్చు. అలాగే రోగి నమూనాలను సేకరించవచ్చు. ఆడియో-వీడియో సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవచ్చు. 

"ఈ హాస్పిటల్ కేర్ అసిస్టటివ్ రోబోటిక్ పరికరం కోవిడ్-19 రోగులతో వ్యవహరించే యోధులైన ఆరోగ్య సంరక్షణ అధికారులకు సేవలను అందించడంలో తప్పనిసరి భౌతిక  దూరాన్ని కొనసాగిస్తూ ప్రభావవంతంగా ఉంటుంది" అని సిఎస్ఐఆర్-సిఎంఈఆర్ఐ డైరెక్టర్ ప్రొఫెసర్ (డాక్టర్) హరీష్ హిరానీ పేర్కొన్నారు. ఈ పరికరం ధర రూ .లక్షల కన్నా తక్కువ ఉంటుంది.  బరువు 80 కిలోగ్రాముల కన్నా తక్కువ అని ప్రొఫెసర్ హిరానీ తెలిపారు.

 

సాంకేతిక జోక్యాల ద్వారా కోవిడ్-19 ప్రభావాన్ని తగ్గించడానికి సిఎస్ఐఆర్-సిఎంఈఆర్ఐ యుద్ధ ప్రాతిపదికన పని చేస్తుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పినట్లుగాసమాజంలో కరోనావైరస్ ప్రసారాన్ని నివారించడంలో వ్యక్తిగత రక్షణ పరికరాలు (పిపిఇ) చాలా ముఖ్యమైనవి. అందువల్ల ఆరోగ్య సంరక్షణ సంస్థలలో ప్రజలకు సహాయపడటానికి పిపిఇసామజిక పరమైన భద్రతా పరికరాలను అభివృద్ధి చేయడానికి ఇన్స్టిట్యూట్ తన వనరులను వినియోగించింది.
సిఎంఆర్ఐ లోని శాస్త్రవేత్తలు రోడ్ శానిటైజర్ యూనిట్ఫేస్ మాస్క్మెకానికల్ వెంటిలేటర్ఆస్పత్రి వ్యర్థాల నిర్వహణ సౌకర్యాలతో పాటు వివిధ  సాంకేతిక పరిజ్ఞానాలను కూడా అభివృద్ధి చేశారు.

 

***

 
 
 

(Release ID: 1619218) Visitor Counter : 266