సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సుత‌గ్గింపు యోచ‌న‌ లేదు, నకిలీ వార్తను బ‌య‌ట‌పెట్టిన పిఐబి ఫ్యాక్ట్ చెక్‌

నాడు పోస్టు చేయడమైనది: 26 APR 2020 10:00PM by PIB Hyderabad

 

కేంద్ర ప్ర‌భుత్వ ఉద్యోగులకు సంబంధించి వారి ప‌ద‌వీ విర‌మ‌ణ వ‌య‌స్సును త‌గ్గించే యోచ‌న ఏదీ కేంద్ర ప్ర‌భుత్వం చేయ‌డం లేద‌ని ప్రెస్ ఇన్ఫ‌ర్మేష‌న్ బ్యూరో ఫ్యాక్ట్ చెక్ విభాగం ఒక ట్వీట్ ద్వారా స్ప‌ష్టం చేసింది.  కేంద్ర ప్ర‌భుత్వ ఉద్యోగుల ప‌ద‌వీ విర‌మ‌ణ వ‌య‌స్సును భార‌త ప్ర‌భుత్వం ,50 సంవ‌త్స‌రాల‌కు త‌గ్గించే యోచ‌న లో ఉన్న‌ట్టు ఒక వెబ్ పోర్ట‌ల్ లో వ‌చ్చిన వ్యాసానికి స్పంద‌న‌గా పిఐబి ఈ ట్వీట్ చేసింది.

https://twitter.com/PIBFactCheck/status/1254266971777953793?s=20

 మ‌రొక ట్వీట్‌లో , వాట్స‌ప్‌లో ప్ర‌చారంలో ఉన్న మ‌రో న‌కిలీ వార్త ను పిఐబి బ‌ట్ట బ‌య‌లు  చేసింది.   ఉద్యోగస్థులు త‌మ జీతంలో 18 శాతం మొత్తాన్ని డిపాజిట్ చేయాల్సిందిగా కోరుతూ ప్ర‌భుత్వం చ‌ట్టం తీసుకురానున్న‌ద‌న్న‌ది ఆ న‌కిలీ వార్త సారాంశం. దీనిపై పిఐబి ఒక ట్వీట్ ద్వారా వాస్త‌వం తెలియ‌జేస్తూ, కేంద్ర ప్ర‌భుత్వం ఇలాంటి చ‌ట్టం తెచ్చే ఆలోచ‌న ఏదీ చేయ‌డం లేద‌ని తెలిపింది. ఇలాంటి వార్త‌ల‌ను స‌రిచూసుకోకుండా ఫార్వ‌ర్డ్ చేయ‌వ‌ద్ద‌ని ఆ ట్వీట్ లో ప్ర‌జ‌ల‌ను కోరింది.

https://twitter.com/PIBFactCheck/status/1254336404265435136?s=20

 కరోనావైరస్ సంక్షోభ స‌మ‌యంలో , మ‌ణిపూర్‌లోని తమెంగ్‌లాంగ్‌లోని జిల్లా ఆసుపత్రి మౌలిక సదుపాయాలు  పరికరాల కొరతను ఎదుర్కొంటున్న‌ద‌ని మణిపూర్‌లో ఒక వార్త ప్ర‌చురిత‌మైంది. దీనిపై  పిఐబి అస్సాం వాస్త‌వాల‌ను తెలుసుకునే ప్ర‌య‌త్నం చేసింది. అయితే ఆ. వ్యాసంలో చేసిన వాదనను ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ ఇంతకుముందే ఖండించింది.

https://twitter.com/PIB_Guwahati/status/1254076665954742272?s=20

  నేప‌థ్యం:

 సుప్పీంకోర్టు వ్యాఖ్య‌ల‌ను అనుస‌రించి, సోషల్ మీడియాలో నకిలీ వార్తల వ్యాప్తిని తనిఖీ చేయడానికి  , సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పుకార్ల కు సంబంధించి వాస్త‌వాల‌ను తెలియ‌జేయ‌డానికి పిఐబి ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసింది.  ‘పిఐబి ఫ్యాక్ట్ చెక్ ’ అనేది ట్విట్టర్‌లో ధృవీకరించబడిన హ్యాండిల్, ఇది సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ట్రెండింగ్ సందేశాలను నిరంతరం పర్యవేక్షిస్తుంది . నకిలీ వార్తలను క‌నిపెట్టి అటువంటి వాటిపై సమగ్ర సమీక్ష నిర్వహిస్తుంది.
. దీనితో పాటు పిఐబి ఇండియా   హ్యాండిల్ , ట్విట్టర్‌లో వివిధ పిఐబిప్రాంతీయ యూనిట్ హ్యాండిల్స్ ట్విట్టర్‌లో ఏదైనా విష‌యానికి  సంబంధించి దాని అధికారిక , ప్రామాణికమైన స‌మ‌చారాన్ని అందిస్తోంది.దీనిని #PIBFactCheck అనే హ్యాష్‌ట్యాగ్‌ను ఉపయోగించి ట్విట్టర్ కమ్యూనిటీ ప్రయోజనం కోసం పెద్ద ఎత్తున పోస్ట్ చేస్తున్నాయి.

ఎవ‌రైనా వ్యక్తి పిఐబి ఫ్యాక్ట్‌చెక్‌ కు టెక్స్ట్‌, ఆడియో , వీడియోతో సహా ఏదైనా సోషల్ మీడియా సందేశాన్ని పంపి అది వాస్త‌వ‌మైన‌దో కాదో  ధృవీకరించుకోవ‌చ్చు. వీటిని ఆన్‌లైన్‌లో https://factcheck.pib.gov.in/ లేదా వాట్సాప్ నం +918799711259 లేదా ఈమెయిల్: pibfactcheck[at]gmail[dot]com లో పంప‌వ‌చ్చు. వివరాలు పిఐబి వెబ్‌సైట్‌లో కూడా ఉన్నాయి: https://pib.gov.in


(రిలీజ్ ఐడి: 1618654) సందర్శకుల సూచీ సంఖ్య : : 162
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Punjabi , Tamil , Kannada